|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్

Published: 05-12-2025, 1:48 PM
Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
  • బిగ్‌ బాస్‌ తెలుగు 9లో 13వ వారం టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లు రసవత్తరంగా జరిగాయి.
  • రీతూ, భరణిల మధ్య రింగ్‌ టాస్క్‌లో తీవ్ర వాగ్వాదం, నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
  • టవర్‌ టాస్క్‌లో రీతూ చౌదరి అతిగా ఏడుస్తూ, ఓవరాక్షన్‌ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
  • కళ్యాణ్‌ సీజన్‌లో మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచి, కామన్‌ మ్యాన్‌గా వచ్చి సత్తా చాటాడు.

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌లో టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లు ఉత్కంఠగా సాగాయి. రీతూ చౌదరి, సంజనాల డ్రామాలు హైలైట్‌గా నిలిచాయి. చివరకు కళ్యాణ్‌ అద్భుత ప్రదర్శనతో మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఈ వారం ఎపిసోడ్‌ల పూర్తి వివరాలు ఇక్కడ.

టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌ల హోరు

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ 13 వారం మొత్తం టికెట్‌ టూ ఫినాలేకి సంబంధించిన టాస్క్ లే జరుగుతున్నాయి. దాదాపు ఆరు టాస్క్ లు నిర్వహించారు. ఒక్కో టాస్క్ లో ఒక్కొక్కరు ఫిల్టర్‌ అవుతూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఎపిసోడ్‌లో రీతూ, కళ్యాణ్‌, ఇమ్మాన్యుయెల్‌, భరణిల మధ్య రింగ్‌ టాస్క్ జరిగింది. ఇందులో భరణి ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో రీతూ, ఇమ్మాన్యూయెల్‌, కళ్యాణ్‌ ఫైనల్‌కి చేరుకున్నారు. అయితే ఇందులో రీతూ రింగ్‌ దాచిపెట్టింది. భరణికి దక్కకుండా ఆమె రింగ్‌ని తన షర్ట్ లో దాచుకుంది.

ఇందులో ట్రయాంగిల్‌ సరిగా కర్వ్ లేకపోయినా దాన్ని సంచాలక్‌ సంజనా ట్రయాంగిల్‌గా ఇవ్వడాన్ని భరణి రచ్చ చేశాడు. ఆ తర్వాత రీతూ రింగ్‌ దాచిందని తెలిసి మరింత ఫైర్‌ అయ్యాడు. దీంతో రీతూ అరుస్తూ, ఆ తర్వాత ఏడుస్తూ వెళ్లిపోయింది. తాను గెలిచిన ఆనందం లేకుండా చేస్తున్నారంటూ మండిపడింది. కన్నీళ్లు పెట్టుకుంది. బలవంతంగా ఏడుస్తూ కనిపించింది. సంతోషం లేకుండా చేస్తున్నారంటూ పదే పదే ఆమె అనడం ఓవర్‌గా ఉంది. పెద్ద సీన్‌ చేస్తున్నట్టుగానే ఉంది. ఇందులో కళ్యాణ్‌, భరణి మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. ఒకరికొకరు మీద మీదకు వెళ్లారు. ఒక్కసారిగా హౌజ్‌ హీటెక్కింది. ఇన్నాళ్లుసైలెంట్‌గా ఉన్న భరణి ఇందులో ఫైరింగ్‌లో కనిపించాడు.

రీతూ, సంజనాల డ్రామాటిక్ సీన్స్

అనంతరం రీతూ, ఇమ్మాన్యుయెల్‌ కళ్యాణ్‌ టవర్‌ కట్టే టాస్క్ లో పాల్గొన్నారు. ఇందులో రీతూ చౌదరీ నానా హంగామా చేసింది. తనని భరణి, కళ్యాణ్‌, తనూజ కొడుతుంటే రచ్చ రచ్చ చేసింది. అక్కడ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ టాస్క్ లో కళ్యాణ్‌ విన్‌ అయ్యాడు. ఆ తర్వాత రీతూ, ఇమ్మాన్యుయెల్‌ మధ్య టవర్‌ టాస్క్ జరిగింది. ఆ సమయంలో బాల్‌ తగిలిందని ఏడుస్తూ మరోసారి నానా అరాచకం చేసింది. కానీ ఇందులో రీతూనే గెలిచింది.

చివరగా రీతూ, కళ్యాణ్‌ మధ్య టికెట్‌ టూ ఫినాలే ఫైనల్‌ టాస్క్ జరిగింది. అందులో కళ్యాణ్‌ విన్‌ అయ్యాడు. కానీ రీతూ మంచి ఎఫర్ట్స్ పెట్టింది. దీనికి బిగ్‌ బాస్‌ కూడా అభినందించారు. మొత్తంగా ఈ సీజన్‌లో మొదటి ఫైనలిస్ట్ గా కళ్యాణ్‌ నిలవడం విశేషం. కామన్‌ మ్యాన్‌గా హౌజ్‌లో వచ్చి క్రమంగా స్ట్రాంగ్‌ అవుతూ ఇప్పుడు ఏకంగా ఫైనలిస్ట్ అయ్యాడు కళ్యాణ్‌. దీంతో ఆయనతోపాటు అంతా ఆనందం వ్యక్తం చేశారు. కానీ తనూజ మాత్రం కాస్త జెలసీగా కనిపించింది. ఏదో బాధగా కనిపించింది. ఇది ఆమె రియాలిటీని బయటపెడుతుందని చెప్పొచ్చు.

కళ్యాణ్‌ మొదటి ఫైనలిస్ట్‌గా విజయం

మరోవైపు ఇమ్మాన్యుయెల్‌ ఈ టాస్క్ ల్లో ఒంటరిగానే పోరాడాడు. ఆయనకు ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. దీంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే సంజనా.. ఇమ్మాన్యుయెల్‌ విషయంలో పెద్ద సీన్‌ చేసింది. ఇమ్మూ లేడీ వాయిస్‌తో పాటలు పాడటంలో దిట్ట. ఆయన అలా అమ్మ పాట పాడాడట. అయితే ఆ పాటకి అర్థాన్ని తెలుసుకొని, అది తననే అన్నావంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇమ్మాన్యుయెల్‌ సరదాగా పాడిన పాటని సంజనా తనకు అన్వయించుకుని ఏడవడం షాకిస్తుంది. ఇది ఆమె రియాలిటీని తెలియజేస్తుంది. ఆ విషయాన్ని బిగ్‌ బాస్‌ కూడా క్లోజప్‌లో చూపించడం విశేషం. ఈ సీన్లని బిగ్‌ బాస్‌ ప్రత్యేకంగా తన కెమెరాల్లో బంధించిన చూపించి వాళ్ల డ్రామాలను బయటపెట్టడం విశేషం.

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ లో కళ్యాణ్‌ ఫైనలిస్ట్ అయ్యాడు. మిగిలిన నలుగురు ఫైనలిస్ట్ లు ఎవరనేది వచ్చే వారం తేలనుంది. ఇక ప్రస్తుతం హౌజ్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో 13వ వారం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. తనూజ, రీతూ, సంజనా, భరణి, సుమన్‌ శెట్టి, డీమాన్‌ పవన్‌ ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిలో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు హౌజ్‌ని విడబోతున్నారనేది రేపటితో క్లారిటీ రానుంది. ఈ వారం ఒకే ఎలిమినేషన్‌ ఉంటుందా? డబుల్‌ ఉంటుందా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ వారం సుమన్‌ శెట్టి, సంజనాలో ఒకరు ఎలిమినేషన్‌కి అవకాశం ఉంది.

మొత్తంగా, బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌లో టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. రీతూ, సంజనాల డ్రామాలు, కళ్యాణ్‌ ఫైనలిస్ట్‌గా నిలవడం ఈ వారం ప్రధాన ఆకర్షణగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.