
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. నాగార్జున మళ్ళీ హోస్ట్ గా ఉండనున్నారు. ఈ సీజన్ కు సంబంధించి కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి.
Key Points
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షూటింగ్ త్వరలో ప్రారంభం.
నాగార్జున మళ్ళీ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
తేజస్వినీ, కల్పిక గణేష్, నవ్య స్వామి లాంటి పలువురు కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి.
2025 ఆగస్టు చివరి వారంలో షో ప్రారంభం కావచ్చు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభ తేదీ
ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ అక్కినేని నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. నాగార్జున బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి హోస్ట్ గా కొనసాగుతున్నారు. తొలి రెండు సీజన్ లకు ఎన్టీఆర్, నాని హోస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం షో నిర్వాహకులు సీజన్ 9 కోసం సెట్స్ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సెట్స్ పూర్తయ్యాక అధికారికంగా బిగ్ బాస్ 9 లాంచ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
అందుతున్న సమాచారం మేరకు, షో 2025 ఆగస్ట్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతోంది.
లీక్ అయిన కంటెస్టెంట్ల పేర్లు
ఇక కంటెస్టెంట్ల విషయానికొస్తే, అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, సోషల్ మీడియా వేదికగా పలు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో తేజస్వినీ, కల్పికా గణేష్, కావ్య, టీవీ ఆర్టిస్ట్ నవ్య స్వామి, టాలీవుడ్ నటుడు ఛత్రపతి శేఖర్, బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ, జ్యోతి రాయ్, సాయికిరణ్, యూట్యూబర్ శ్రావణి వర్మ, ఆర్జే రాజ్ లాంటి వారు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక హోస్ట్ నాగార్జున ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘కుబేరా’ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల తర్వాత ఆయన బిగ్‌బాస్ పనుల్లో పూర్తి స్థాయిలో పాల్గొననున్నట్లు సమాచారం.
హోస్ట్ నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు అనేది ప్రతి ఏడాదీ టీవీ ప్రేక్షకులను బాగా ఆకర్షించే షోగా నిలుస్తోంది. ప్రత్యేకంగా సెట్స్, టాస్కులు,సెలబ్రిటీల వ్యక్తిగత అనుభవాలు షోకి మరింత ఆకర్షణను తీసుకువస్తున్నాయి. అయితే ప్రతి సీజన్ లో టాస్కులు రొటీన్ గా మారుతున్నాయి అనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో సీజన్ 9 సరికొత్త అనుభవాన్ని ఇచ్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి ప్రణాళికతో వస్తారో చూడాలి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాలి. కొత్త టాస్కులు, కొత్త కంటెస్టెంట్లు ఈ సీజన్‌ను ప్రత్యేకంగా చేస్తాయని ఆశిద్దాం.


