
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సీజన్ లో సెలబ్రిటీలు, కామనర్స్ పోటీ పడుతున్నారు. టీవీ నటుడు నరేష్ లొల్లా ఈ షో గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
Key Points
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో సెలబ్రిటీలు, కామనర్స్ మధ్య పోటీ.
నరేష్ లొల్లా కామనర్స్ గెలుస్తారని ఊహించని ఊహ.
కామనర్స్ సెలబ్రిటీల కంటే బలంగా ఉన్నారని నరేష్ అభిప్రాయం.
ఈ సీజన్ విజేత కామనర్ అయ్యే అవకాశం ఎక్కువ అని నరేష్ లొల్లా అంచనా.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం
`బిగ్ బాస్ తెలుగు సీజన్ 9` ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. 15 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సారి తొమ్మిది మంది సెలబ్రిటీలను, ఆరుగురు కామనర్స్ ని కంటెస్టెంట్లుగా ఎంపిక చేశారు. వీరిలో భరణి, తనూజ, శ్రష్టి వర్మ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ సెలబ్రిటీలుగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, మర్యాద మనీష్, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియాలు, హరీష్ కామనర్స్ గా హౌజ్‌లోకి వచ్చారు. వీరిలో కామనర్స్ మెయిన్ హౌజ్‌లో, సెలబ్రిటీలు ఔట్ హౌజ్‌లో ఉన్నారు. వీరి మధ్య ఫైటింగ్ ఎలా ఉండబోతుందో నేటి నుంచి తేలనుంది.
ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ షోపై టీవీ సీరియల్ నటుడు నరేష్ లొల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో ఉన్నదే సెలబ్రిటీల కోసం అని, మధ్యలో ఈ కామనర్స్ ఎవరు అంటూ ప్రశ్నించారు. కామనర్స్ కి కెమెరాని ఎలా ఫేస్ చేయాలో తెలియదు, సెలబ్రిటీలను ఎలా ఎదుర్కొనాలో తెలియదు. సెలబ్రిటీలతో వారు ఎలా తలపడతారు. సెలబ్రిటీల ముందు వాళ్లు నిలువ లేరంటూ షాకిచ్చారు. సెలబ్రిటీల కోసం స్టార్ట్ చేసిన షోలోకి కామనర్స్ ని ఎందుకు తీసుకొస్తున్నారని, రెండు సీజన్ల క్రితమే కామనర్‌ని తీసుకొచ్చారు. అతను చేసిన పెంట, రచ్చ ఎలాంటిదో తెలిసిందే. ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నాం. అలాంటిది ఇప్పుడు కామనర్స్ ని ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు నరేష్ లొల్లా. ఈ కామనర్స్ ఐదు వారాలకు మించి ఉండరని సవాల్ చేశాడు.
నరేష్ లొల్లా సంచలన వ్యాఖ్యలు
కానీ అంతలోనే ట్విస్ట్ ఇచ్చాడు. తాను ఇలా చెబుతానని అనుకుంటారు, కానీ అలా చెప్పను అని, ఈ సారి కామనర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. సెలబ్రిటీల కంటే కామనర్సే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని తెలిపారు. తాను అగ్నిపరీక్ష ఎపిసోడ్లని చూశానని, ఒక్కొక్కరు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో, ఎంత బాగా ఆడుతున్నారో చూశానని, ఈ సారి వారిని తట్టుకోవడం చాలా కష్టమని, సరైన సెలబ్రిటీ కంటెస్టెంట్లు లేరని తెలిపారు. ఎప్పుడూ టీవీల్లో చూసిన మొహాలే ఈ షోకి వస్తున్నారని తెలిపారు.
కామనర్స్ విజయంపై నరేష్ ఊహ
అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ ఎవరో కూడా చెప్పేశాడు నరేష్ లొల్లా. ఈ సారి బిగ్ బాస్ కప్ కామనర్స్ దే అని తేల్చేశాడు. వాళ్లే కప్ సాధించినా ఆశ్చర్యం లేదని, వారిని ఎదుర్కోవడం సెలబ్రిటీలకు చాలా టఫ్ అని తెలిపారు. అంతేకాదు కామనర్స్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే వాళ్లు జస్ట్ కామనర్స్ కాదు అని, జీవితంలో చాలా సాధించారని తెలిపారు. వాళ్ల గేమ్, మైండ్ గేమ్ వేరే లేవల్ అని తెలిపారు. ఈ సారి కప్ కామనర్స్ సొంతమని జోష్యం చెప్పాడు నరేష్ లొల్లా. ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి. నరేష్ లొల్లా.. `మగువ ఓ మగువ`, `లక్ష్మీ నివాసం` వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
నరేష్ లొల్లా చేసిన ఊహాగానాలు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పై ఆసక్తిని పెంచుతున్నాయి. కామనర్స్ నిజంగానే ఈ సారి గెలుస్తారా అన్నది వేచి చూడాలి.


