
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ రోజు ప్రారంభం అవుతోంది. ఈ సీజన్ లో రెండు హౌస్ లు, కామన్ పీపుల్ ఓనర్లుగా, సెలబ్రిటీలు టెనెంట్లుగా ఉండబోతున్నారు. భరణి ఎలిమినేషన్ గురించి ఆసక్తికరమైన ట్విస్ట్ ఉందని చర్చలు జరుగుతున్నాయి.
Key Points
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ రోజు ప్రారంభం.
రెండు హౌస్ లు: ఒకటి లగ్జరీ, మరొకటి సాధారణ.
భరణి ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఉందని అనుమానం.
రెండు హౌస్ లు, రెండు జీవితాలు
ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్ టైన్ చేసేందుకు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. తెలుగులో కొత్త సీజన్ ఇవాళ (సెప్టెంబర్ 7) స్టార్ట్ కాబోతోంది. మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి తెర లేస్తుంది. సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సారి సీజన్ లో ట్విస్ట్ లు మామూలుగా ఉండట్లేదని తెలిసింది. ప్రోమో చూస్తూనే ఆ విషయం అర్థమైంది.
బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలు వెళ్లడం, ఆటలాడం కామనే. కానీ ఈ సారి బిగ్ బాస్ తెలుగు 9 వ సీజన్ లో మాత్రం సెలబ్రిటీలకు చుక్కలు కనిపించబోతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సారి బిగ్ బాస్ లో ఒకటి కాదు రెండు హౌస్ లు ఉండబోతున్నాయి. ఇందులో ఒక హౌస్ ను అత్యంత లగ్జరీగా ఉన్నట్లు చూపించారు. అంటే మరో హౌస్ కనీస వసతులతో సాధారణంగా ఉండబోతుందని అంచనా. ఓనర్లు, టెనెంట్లు (రెంట్ కు ఉండేవాళ్లు) అని రెండు గ్రూప్ లుగా ఉండబోతుంది పోరు.
కామన్ పీపుల్ vs సెలబ్రిటీలు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం తొలిసారి అయిదుగురు కామన్ పీపుల్ ను హౌస్ లోకి పంపిస్తున్నారు. ఇప్పటికే అగ్ని పరీక్ష పేరుతో వీళ్లకు పరీక్ష పెట్టి సెలెక్ట్ చేశారు. ఇక 9 మంది సెలబ్రిటీలు ఈ రోజు హౌస్ లు అడుగుపెడతారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సీజన్ లో కామనర్స్ ఓనర్లుగా ఉండబోతున్నారు. వీళ్లు లగ్జరీగా కనిపించిన రూమ్ లో ఉంటారు. ఇక సెలబ్రిటీలు ఏమో టెనెంట్లుగా నార్మల్ రూమ్ లో ఉండబోతున్నారని టాక్. ప్రత్యేక సౌకర్యాలు కావాలంటే మాత్రం సెలబ్రిటీలు టాస్క్ లు ఆడాల్సిందేనని తెలిసింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంఛ్ ప్రోమోలో ఓ నటుడు స్టేజీ మీది నుంచే సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు చూపించారు. ఆ నటుడు భరణిగా తెలుస్తోంది. అయితే ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఉన్నట్లు సోర్స్ ప్రకారం తెలుస్తోంది. ఎందుకంటే భరణి లాంటి సీనియర్ నటుడిని సీజన్ లాంఛ్ ఎపిసోడ్ లోనూ ఎలిమినేట్ చేసేందుకు బిగ్ బాస్ మేకర్స్ రెడీగా ఉండరని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భరణి ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఉంటుందని టాక్. ఆయన ఇప్పటికే హౌస్ లోకి అడుగుపెట్టారని సమాచారం.
భరణి ఎలిమినేషన్ ట్విస్ట్?
ఇక ఈ సారి సీజన్ లో బిగ్ బాస్ కూడా సీరియస్ గా ఉండబోతున్నాడని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ సారి రణరంగంలో అర్జునుడిని చూస్తారని ముందే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సీజన్ రెండు హౌస్ ల మధ్య పోరు నిజంగా రణరంగమేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరమైన ట్విస్టులతో ప్రారంభమైంది. సెలబ్రిటీలు, కామన్ పీపుల్ మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి.


