|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ విజేత కళ్యాణ్ పడాలకి అండగా నిలిచిన అగ్గిపుల్ల… ఆమెనే మాస్టర్ మైండ్!

Published: 22-12-2025, 10:44 PM
బిగ్ బాస్ విజేత కళ్యాణ్ పడాలకి అండగా నిలిచిన అగ్గిపుల్ల... ఆమెనే మాస్టర్ మైండ్!
  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్ విజేత కళ్యాణ్ పడాల.
  • కళ్యాణ్ విజయం వెనుక మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ బలమైన మద్దతు ఉంది.
  • గీతూ రాయల్ కళ్యాణ్ కోసం నాలుగు గంటలు లైవ్ ప్రమోషన్లు చేసిందని కళ్యాణ్ వెల్లడించాడు.
  • విజయం తర్వాత కేక్ కట్ చేసి గీతూ రాయల్, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ వేడుకలు జరిపారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల విజయం వెనుక ఆసక్తికర కథ వెలుగులోకి వచ్చింది. మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ అతనికి అద్భుతమైన మద్దతు అందించి, విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ప్రమోషన్లు, వేడుకల వివరాలు తెలుసుకోండి.

కళ్యాణ్ బిగ్ బాస్ ప్రస్థానం: సైలెంట్ నుండి టాప్ రేసు వరకు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసింది కానీ ఆ హంగామా ఇంకా ముగియలేదు. కళ్యాణ్ పడాల అభిమానులు ఇంకా సక్సెస్ సెలెబ్రేషన్స్ లోనే ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో కామనర్ గా కళ్యాణ్ అడుగుపెట్టాడు. అగ్ని పరీక్షలో సత్తా చాటి బిగ్ బాస్ కు అర్హత సాధించాడు. తొలి మూడు వారాలు కళ్యాణ్ హౌస్ లోన్ సైలెంట్ గా ఉండిపోయాడు. ఎలిమినేషన్ గండం నుంచి కూడా తప్పించుకున్నాడు.

కానీ తన గేమ్ స్ట్రాటజీ మార్చుకుని ప్రతీవారం తన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ప్రతి టాస్క్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ టాప్ రేసులోకి దూసుకువచ్చాడు. బిగ్ బాస్ టైటిల్ దక్కించుకోవడానికి కళ్యాణ్ హౌస్ లోపల ఎంత చేయాలో అంతా చేశాడు. హౌస్ బయట కళ్యాణ్ కి తన అభిమానుల నుంచి మంచి సపోర్ట్ దక్కింది. కానీ ఊహించని విధంగా ఒక వ్యక్తి కళ్యాణ్ కి బలమైన సపోర్ట్ ఇచ్చారు.

విజయం వెనుక గీతూ రాయల్ అద్భుత మద్దతు

ఆమె ఎవరో కాదు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్. గీతూ రాయల్.. కళ్యాణ్ కోసం ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేసిందట. కళ్యాణ్ బిగ్ బాస్ టైటిల్ గెలిచి బయటకి రాగానే అతడిచేత కేక్ కట్ చేయించి సెలెబ్రేషన్స్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ లో ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ కూడా పాల్గొన్నారు.

వీళ్లంతా పెద్ద హంగామా చేశారు. తాను టైటిల్ గెలిచి స్టేజీ దిగి రాగానే ప్రియా శెట్టి ముందుగా నీ గురించే చెప్పింది అని కళ్యాణ్ గీతూతో అన్నాడు. గీతూ నీకోసం అద్భుతంగా ప్రమోషన్స్ చేసింది అని ప్రియా శెట్టి చెప్పింది. నాలుగు గంటలు లైవ్ లో కూర్చుని ఒక్కొక్కడికీ ఇచ్చిపడేసింది అని ప్రియా చెప్పినట్లు కళ్యాణ్ గీతూతో అన్నాడు.

టైటిల్ తర్వాత వేడుకలు, గీతూ స్పందన

A post shared by Geetu Royal (@geeturoyal_)

గీతూ స్పందిస్తూ నేను చేసింది ఏమీ లేదు. నువ్వు గేమ్ అంత బాగా ఆడావు. నీ గేమ్ కి నేను మీడియంగా ఉన్నాను అంతే. క్రెడిట్ మొత్తం నీదే అని గీతూ పేర్కొంది. చివర్లో నువ్వు, తనూజ స్టేజిపైకి వెళ్ళగానే.. నీ గుండె ఎలా కొట్టుకుందో తెలియదు కానీ నా గుండె మాత్రమే చాలా వేగంగా కొట్టుకుంది అని గీతూ తెలిపింది. గ్రాండ్ ఫినాలే రోజు ఉదయం నుంచి తనూజ విన్నర్ అని చెబుతూనే ఉన్నారు. కానీ నేను నమ్మలేదు. కళ్యాణ్ మాత్రమే గెలుస్తాడు అని చెప్పా అంటూ గీతూ పేర్కొంది. పక్కనే ఉన్న దమ్ము శ్రీజ.. కళ్యాణ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు అంటూ అగ్గిపుల్ల వెలిగించి క్రేజీగా చెప్పింది.

మొత్తం మీద, కళ్యాణ్ పడాల విజయం కేవలం అతని ప్రదర్శన వల్లే కాకుండా, గీతూ రాయల్ వంటి స్నేహితుల అండదండలతోనే సాధ్యమైంది. బిగ్ బాస్ హంగామా ఇంకా కొనసాగుతుందని చెప్పడంలో సందేహం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.