|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రాఫిక్ చిక్కుల్లో సాహసం.. ఫుట్‌పాత్‌పై దూసుకెళ్లిన బైక్, కారుకు గుద్దు!

Published: 22-03-2026, 5:30 PM
  • ట్రాఫిక్ తప్పించుకోవడానికి ఫుట్‌పాత్‌పైకి ఎక్కిన టూ-వీలర్ వాహనదారుడు.
  • బైక్ అదుపు తప్పి నేరుగా కారును ఢీకొట్టిన ఘటన బెంగళూరులో జరిగింది.
  • కారు యజమాని ఆగ్రహంతో ఊగిపోయి వాహనదారుడి నుంచి డబ్బులు వసూలు చేశాడు.
  • ఫుట్‌పాత్‌పై వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్.

దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, బెంగళూరులో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ నుండి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై బైక్ నడుపుతూ కారును ఢీకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్రాఫిక్ తప్పించుకోవడానికి విఫలయత్నం

దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠినమైన రూల్స్ అమలు చేసిన కూడా, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే లేటెస్ట్ గా ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు ఓ టూ-వీలర్ వాహనదారుడు ప్రయత్నించి, నేరుగా కారుని ఢీకొట్టేశాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

కారును ఢీకొట్టిన టూ-వీలర్ వాహనదారుడు

బెంగుళూరులో నిత్యం ట్రాఫిక్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మన హైదరాబాద్ తరహాలోనే బెంగళూరులో రద్దీ ఎక్కువ. ఈ నేపథ్యంలో టూ-వీలర్ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తారు. ఫుట్ పాత్ పైన కూడా డ్రైవింగ్ చేసి ఎస్కేప్ అవుతుంటారు. అచ్చం అలాగే ట్రాఫిక్ సిగ్నల్ పడ్డ చోట వీడియోలో కల్పించిన ఈ వాహనదారుడు, ఫుట్ పాత్ పైన వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే బైక్ అదుపు తప్పడంతో నేరుగా కారును ఢీ కొట్టాడు. దీంతో ఆ కారు యజమాని, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. డబ్బులు కూడా వసూలు చేశాడు. ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఫుట్ పాత్ పైన బైక్ నడిపే వాళ్లకు కచ్చితంగా ఫైన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నెటిజన్ల ఆగ్రహం, చర్యలు తీసుకోవాలని డిమాండ్

A post shared by Lokmat Times Nagpur (@lokmat_times)

ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన తెలియజేస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. బాధ్యతగా వాహనాలు నడపాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.