
📌 Key Points
- శర్వానంద్ ‘బైకర్’ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ అదిరిపోయాయి; నటనలో శర్వా అదరగొట్టాడు.
- రాజశేఖర్ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంది; వింటేజ్ రాజశేఖర్‌ని మళ్ళీ చూసే అవకాశం!
- రేసింగ్ సీన్లు, జంపింగ్ సీన్లు సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అంటున్నారు.
- ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందట; సెకండాఫ్‌లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే!
శర్వానంద్ నటించిన ‘బైకర్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజశేఖర్ కీలక పాత్రలో నటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శర్వానంద్ నటన ఎలా ఉంది?
శర్వానంద్ ఈ సంక్రాంతికి `నారీ నారీ నడుమ మురారి` చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు `బైకర్` చిత్రంతో వస్తున్నారు. రాజశేఖర్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఆయన నటిస్తున్నారు. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం(ఏప్రిల్ 3)న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. సినిమా ఎలా ఉందో తేలిపోయింది.
శర్వానంద్ `నారీ నారీ నడుమ మురారి` హిట్ తర్వాత నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. దీనికితోడు ఇందులో రాజశేఖర్ ముఖ్యపాత్ర పోషిస్తుండటం విశేషం. ఇది బిజినెస్ పరంగానూ, ఆడియెన్స్ లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. ఇది బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే చిత్రం అని తెలుస్తోంది. ఇందులో రాజశేఖర్ ఒకప్పుడు రేసర్‌గా రాణిస్తారు. ఆయన ఛాంపియన్ కూడా. కానీ కొంత స్ట్రగుల్ ఉంటుంది.కొన్ని కారణాలతో దానికి ఆయన దూరం కావాల్సి వస్తుంది. తన కొడుకు అయిన శర్వానంద్ ని ఈ రంగంలో ఎంకరేజ్ చేయడం, కొడుకుని ఛాంపియన్ చేసేందుకు తండ్రి పడే తపనే మూవీ అని తెలుస్తోంది.
రాజశేఖర్ పాత్ర హైలైట్స్ ఏంటి?
ఇక ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ ఏ సర్టిఫికేట్‌ని పొందింది. సెన్సార్ నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీ రెండు గంటల 35 నిమిషాల నిడివితో ఉండబోతుందట. అయితే సినిమాని ఇప్పటికే కొంత మంది చూశారు. వారి అభిప్రాయం మేరకు సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఎమోషనల్ అండ్ రోలర్ కోస్టర్‌లా సాగుతుందట. టెక్నీకల్‌గా బ్రిలియంట్ గా ఉంటుందని, నటీనటుల ప్రదర్శన హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.
ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా స్టార్ట్ అవుతుందట. శర్వానంద్ నటన ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆకట్టుకుంటుందని, పాత్రలో ఒదిగిపోయినట్టు సమాచారం. అలాగే రాజశేఖర్ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, ఆయన నటన కట్టిపడేస్తుందని, చాలా రోజుల తర్వాత ఒక బలమైన పాత్రలో ఆయన కనిపించబోతున్నారని, వింటేజ్ రాజశేఖర్‌ని చూడొచ్చు అంటున్నారు. విజువల్స్ బాగుంటాయని, రేసింగ్ సీన్లు ఆకట్టుకుంటాయని అంటున్నారు. రేసింగ్‌లో జంపింగ్ సీన్లు అదిరిపోతాయని, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని సమాచారం.
సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్
ఇక సెకండాఫ్‌లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్, వారి బాండింగ్ హైలైట్‌గా నిలుస్తాయని, అది అదిరిపోతుందని, క్లైమాక్స్ లో రేసింగ్ సీన్లు ఉత్కంఠకి గురి చేస్తాయని తెలుస్తోంది. శర్వానంద్, రాజశేఖర్ మధ్య వచ్చే సీన్లు, అందులోని ఎమోషన్స్ పీక్‌లో ఉంటాయని అంటున్నారు. మ్యూజిక్, సౌండింగ్ బాగుందని చెబుతున్నారు. మొత్తంగా సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కానీ ఒక్కటే నెగటివ్ టాక్ ఉంది. కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా కథ పరంగా ఓల్డ్ గానే ఉంటుందని, గతంలో ఇలాంటి సినిమాలు చాలానే తెలుగులో వచ్చాయని సమాచారం. కాకపోతే దర్శకుడు తెరపై స్క్రీన్ ప్లే చేసిన మ్యాజిక్ హైలైట్ అని అది ఆడియెన్స్ ని ఎంత వరకు ఎంగేజ్ చేస్తుందని, దానికి కనెక్ట్ అయ్యే సినిమా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. మరి అది ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.
‘బైకర్’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. శర్వానంద్, రాజశేఖర్ నటన అద్భుతంగా ఉందని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


