
ఒకప్పటి స్టార్ హీరో సుమన్ తనపై చేతబడి జరిగిందని సంచలన విషయాలు బయటపెట్టారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఈ చేతబడి వల్ల ఎదురుదెబ్బలు తగిలాయని, దీనికి విరుగుడుగా కేరళలో ప్రత్యేక పూజలు చేయించుకున్నానని ఆయన తెలిపారు. కర్మ సిద్ధాంతం గురించి కూడా ఆయన వివరించారు.
Key Points
స్టార్ హీరో సుమన్ కెరీర్ బిజీగా ఉన్నప్పుడు తనపై చేతబడి జరిగిందని వెల్లడి.
కేరళలోని చోటనికరేలో చేతబడికి విరుగుడు పూజ చేయించుకున్నానని పేర్కొన్న సుమన్.
సినిమా, బిజినెస్ రంగాల్లో ఇలాంటివి జరుగుతాయని, ఎవరు చేశారో తెలియదని స్పష్టీకరణ.
కాలం, కర్మ సిద్ధాంతాలను బలంగా నమ్ముతానని, వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరని సుమన్ అభిప్రాయం.
కెరీర్‌కు చేతబడితో ఎదురుదెబ్బ?
సుమన్(Suman)..ఒకప్పుడు స్టార్ హీరో. చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన నటుల్లో ఆయన ఒకరు. అనుకోకుండా ఆయన జైలుకు వెళ్లడం.. ఆరు నెలల పాటు అక్కడే ఉండడంతో ఆయన కెరీర్‌కి పెద్ద దెబ్బ తగిలింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా హీరోగా సినిమాలు చేసినా .. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు . ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే .. మరోవైపు టీవీ సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు . తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగిన చేతబడి గురించి వివరించాడు . కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో ఆయనకు చేతబడి చేశారట . కేరళకు వెళ్లి విరుగుడు పూజ చేయింకున్నాని సుమన్ చెప్పారు .
కేరళలో చేతబడి విరుగుడు పూజ
‘ నాపై చేతబడి జరిగిన మాట వాస్తవం . అయితే ఎవరు చేయించారనేది తెలియదు . సినిమా ఇండస్ట్రీలోనే కాదు .. బిజినెస్ రంగంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి . ఈ చేతబడి అనేది కేరళలో చాలా ఫేమస్. అక్కడ చోటనికరే అనే ప్లేస్ ఉంది . అక్కడ చేతబడి జరిగిన వాళ్లకి విరుగుడు పూజ చేస్తుంటారు. ఇందులో రకరకాలుగా ఉంటుంది. ఎందుకు? ఎవరు చేయించారనేది తెలియదు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కేరళ వాళ్లకి దీని గురించి బాగా తెలుసు చేతబడి ఎలా ప్రయోగిస్తారు ? దాన్ని తగ్గించడం.. మనస్పర్థలు తీసుకుని రావడం లాంటి విద్యలు చేస్తుంటారు. అది ఇప్పటికీ ఉంది.
కాలం, కర్మ సిద్ధాంతంపై సుమన్ నమ్మకం
అప్పట్లో నాకు వరుసగా ఎదురుదెబ్బలే తగులుతుండడంతో కొంతమంది చెబితే అక్కడకు వెళ్లాను . విరుగుడు పూజ ఏదో చేయించారు . అది తప్పు ఒప్పు… ఉంది లేదని నేనేం చెప్పను. కానీ నేను టైమ్‌ని బాగా నమ్ముతా. ఈరోజు ఇది.. ఈ నెల ఇది.. ఈ సంవత్సరం ఇది అంటే అది జరిగితీరుతుంది. ఇది నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా.. మనం చెప్పుకోవడానికి చాలా చెప్పొచ్చు. వాడు తొక్కేశాడు.. వీడు నొక్కేశాడు.. ఎక్కేశాడు. వీడి వల్ల అలా జరిగింది.. ఇలా జరిగిందని. బట్.. ఆ టైమ్ అలా జరిపిస్తుంది. ఆ టైమ్ కొందరితో అలా చేయిస్తుంది. నిజానికి వాళ్లకి అలా చేయాలనే ఉద్దేశం ఉండదు. కానీ టైమ్ వాళ్లని అలా చేయిస్తుంది. అది కూడా వాళ్ల రాతే. దాన్నే కర్మ అని అంటారు. కర్మను నేను బాగా నమ్ముతాను . రోగాలు రావడం కూడా కర్మే . టైమ్ ని బట్టి రోగాలు వస్తుంటాయి . కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరు ’ అని సుమన్ చెపుకొచ్చారు .
తన జీవితంలో జరిగిన సంఘటనలను కాలం, కర్మ సిద్ధాంతాలతో సుమన్ ముడిపెట్టారు. ఎవరూ కర్మ సిద్ధాంతం నుంచి తప్పించుకోలేరని, రోగాలు కూడా కర్మ వలనే వస్తాయని ఆయన బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.


