
నవీన్ చంద్ర నటించిన ‘బ్లైండ్ స్పాట్’ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం, ఓటీటీలో మాత్రం అనూహ్య విజయం సాధిస్తోంది.
Key Points
నవీన్ చంద్ర నటించిన 'బ్లైండ్ స్పాట్' ఓటీటీలో అందుబాటులో ఉంది.
అమెజాన్ ప్రైమ్‌లో టాప్-2లో ట్రెండింగ్ అవుతోంది.
రాశీ సింగ్, ఆలీ రెజా, గాయత్రి భార్గవి నటించారు.
బ్లైండ్ స్పాట్ ఓటీటీ విడుదల
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర మరో ఆసక్తికర సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు. బ్లైండ్ స్పాట్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో అలరించాడు. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు.
అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్
అయితే ఇటీవలే బ్లైండ్ స్పాట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అంతగా రాణించలేకపోయినప్పటికీ.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మాత్రం దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా వ్యాప్తంగా ఏకంగా టాప్-2లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ క్రైమ్ థ్రిల్లర్ కథేంటో మీరు కూడా చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో రాశీసింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు.
కథాంశం మరియు నటీనటులు
హైదరాబాద్‌కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే ‘బ్లైండ్ స్పాట్’ చూడాల్సిందే.
బ్లైండ్ స్పాట్ సినిమా ఓటీటీలో అద్భుతమైన ప్రతిస్పందనను పొందుతోంది. క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులందరూ తప్పకుండా చూడవలసిన చిత్రం ఇది.


