
Bunny23 Rumours: ఈ సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న రూమర్ ఎలా స్ప్రెడ్ అవుతుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ పై వస్తున్న గాసిప్స్ .యస్ ..గత రెండు రోజులుగా ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో ‘బన్నీ 23’ (#Bunny23) క్యాన్సిల్ అయిందంటూ కొన్ని హ్యాండిల్స్ గట్టిగా ప్రచారం చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ డైలమాలో పడిపోయారు.అయితే, దీని వెనుక ఉన్న అసలు నిజాలు, ఇన్సైడ్ టాక్ పరిశీలిస్తే సోషల్ మీడియా గాసిప్స్‌కు, వాస్తవానికి అస్సలు సంబంధం లేదని స్పష్టమవుతోంది. చెన్నై మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్స్ ప్రకారం.. అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రాబోయే #Bunny23 ప్రాజెక్ట్‌లో ఎలాంటి మార్పులు లేవని ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ కేవలం కల్పితాలు మాత్రమేనని తెలుస్తుంది.
‘రాకా’ షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల
నిజానికి బన్నీ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘రాకా’ షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల, లోకేష్ సిద్ధం చేసిన పూర్తి స్క్రిప్ట్‌ను ఇంకా వినలేదు. మరోవైపు, దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాను హీరోగా నటిస్తున్న ‘డిసి’ (DC) చిత్ర పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ పనులతో తెగ బిజీ అయిపోయాడు.ఈ గ్యాప్‌నే కొందరు గాసిప్ రాయుళ్లు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ మలిచారు. రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ చిత్రం చేతి దాకా వచ్చి జారిపోవడం, దానికి తోడు ‘కూలి’ డిజాస్టర్ కావడంతో లోకేష్ కనగరాజ్ ఇపుడు తనని తానూ ప్రూవ్ చేసుకోవాలన్న కసి మీద ఉన్నాడు. తానేంటో నిరూపించుకోవడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ అతనికి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి.
యమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న రాకా
మరోవైపు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న విజువల్ ఫాంటసీ గ్రాండియర్ ‘రాకా’ (Raaka) షూటింగ్ యమా జోరుగా జరుగుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఒకవైపు ఈ చిత్ర విఎఫ్ఎక్స్ (VFX) పనుల కోసం పలు అంతర్జాతీయ హాలీవుడ్ కంపెనీలు రంగంలోకి దిగాయి. గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో దర్శకుడు అట్లీ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే షూటింగ్‌లో పాల్గొంటుండగా, కథలో కీలకమైన మరికొంతమంది స్టార్ హీరోయిన్లు త్వరలోనే సెట్స్‌పైకి అడుగుపెట్టబోతున్నారట . సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్, ఈ మధ్యకాలంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సాయి అభ్యంక్కర్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశాయ్.
2027 వేసవి రేసు నుండి తప్పుకునే ఛాన్స్
ఇక నెగెటివిటి విషయానికి వస్తే సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన భారీ యాక్షన్ బ్లాక్స్, టాకీ పార్ట్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. మూవీ టీమ్ అంచనా ప్రకారం.. ఈ ఏడాది (2026) చివరి నాటికి షూటింగ్ పూర్తయితేనే గొప్ప విషయమని అంటున్నారు. ఒకవేళ షూటింగ్ ఆలస్యమైతే ‘రాకా’ అనుకున్నట్టుగా 2027 వేసవి రేసు నుండి తప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2027 సమ్మర్ సీజన్‌ను ప్రభాస్ ‘స్పిరిట్’, మహేష్ బాబు – రాజమౌళిల ‘వారణాసి’ చిత్రాలు లాక్ చేసుకున్నాయి. వాటికి ‘రాకా’ కి ఎక్కువ గ్యాప్ ఉండటం చాలా అవసరం. పైగా ‘వారణాసి’ చిత్రం రాజమౌళి మేకింగ్ కావడంతో, ‘రాకా’ విజువల్స్ ని దాంతో పోల్చడం ఖాయం. అందుకే అట్లీ అండ్ టీమ్ ప్రతి ఫ్రేమ్‌ను చాలా జాగ్రత్తగా, లేట్ అయినా లేటెస్ట్‌గా ప్లాన్ చేయాల్సి వస్తోందట.
డిసెంబర్ కానుకగా క్రిస్మస్ సీజన్‌లో రిలీజ్ అయ్యే అవకాశం
ఇక ప్రసెంట్ ఉన్న ఈక్వేషన్స్ ని చూస్తే ‘రాకా’ చిత్రం 2027 వేసవికి రావడం కష్టమే అనిపిస్తోంది. భారీ చిత్రాల పోటీని తట్టుకుంటూ, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పక్కాగా పూర్తి కావాలంటే వచ్చే ఏడాది (2027) డిసెంబర్ కానుకగా క్రిస్మస్ సీజన్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా, బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా పుకార్లను నమ్మి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అటు అట్లీతో ‘రాకా’, ఇటు లోకేష్‌తో #Bunny23.. రెండూ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించే ప్రాజెక్టులే అనడంలో ఎలాంటి సందేహం లేదు.


