
📌 Key Points
- దీపికా పదుకొనే, ఆలియా భట్, శ్రద్ధా కపూర్ కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.
- ఈ ఫోటోలలో హీరోయిన్లు సిగరెట్లు కాల్చుతూ, మద్యం సేవిస్తూ కనిపించారు.
- ముఖ్యంగా దీపిక సిగరెట్ కాల్చుతూ, శ్రద్ధా కపూర్ మద్యం గ్లాసు పట్టుకుని కనిపించారు.
- ఈ ఫోటోలు ఒరిజినల్ కాదని, AI సృష్టించినవి లేదా పాతవి అనే వాదనలు ఉన్నాయి.
బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు దీపికా పదుకొనే, ఆలియా భట్, శ్రద్ధా కపూర్ కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో వారు సిగరెట్లు కాల్చుతూ, మద్యం సేవిస్తూ కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి రేపింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
బాలీవుడ్ స్టార్స్ పార్టీ ఫోటోలు వైరల్
బాలీవుడ్ ఇండస్ట్రీ పేరు వినగానే కండల వీరుడు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ ముఖాలే అందరికీ గుర్తుకు వస్తాయి. అదే హీరోయిన్లు అనేసరికి దీపికా, అలియా భట్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్లను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ అగ్ర హీరోయిన్ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకే చోట చేరి, ఎంజాయ్ చేస్తున్నట్లు పలు ఫోటోలు బయటకు వచ్చాయి. మందు తాగుతూ, సిగరెట్ కాల్చుతూ ఈ ముగ్గురు హీరోయిన్లు ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ ఫోటోలలో ఉంది.
దీపిక, ఆలియా, శ్రద్ధల మందు, సిగరెట్ రచ్చ
ముఖ్యంగా దీపిక సిగరెట్ కాల్చుతూ, రింగులు తీస్తున్నారు. అటు మందు గ్లాసు పట్టుకుని శ్రద్ధా కపూర్ ఫోజ్ ఇచ్చింది. ఇక మధ్యలో కూర్చున్న ఆలియా భట్ సిగ్గుపడుతూ కనిపించింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే వీటిపై రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. డబ్బులు బాగా అయ్యాయి.. అందుకే ఇలా చిందులు వేస్తున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఇవి ఒరిజినల్ ఫోటోలు కావని..AI ద్వారా క్రియేట్ చేసినవని చెబుతున్నారు. ఇక మరికొందరైతే, పాత ఫోటోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
ఫోటోల వెనుక అసలు నిజం: అభిమానుల రకరకాల కామెంట్స్
Similar News : నిధి హాట్ ఫోటో వైరల్..చెమటలు పెట్టిస్తోందిగా
ఈ ఫోటోలు ఎంతవరకు నిజం అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, దీపిక, ఆలియా, శ్రద్ధల ఈ రచ్చ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వాటి వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.


