|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బాలీవుడ్ హీరో ఇంట్లో పెను విషాదం! తండ్రి హఠాన్మరణం!!

Published: 17-02-2026, 3:05 PM
షాకింగ్: బాలీవుడ్ హీరో ఇంట్లో పెను విషాదం! తండ్రి హఠాన్మరణం!!
  • బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఇంట తీవ్ర విషాదం, తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూత!
  • సునీల్ మల్హోత్రా గతంలో మర్చంట్ నేవీ కెప్టెన్‌గా విధులు నిర్వర్తించారు, వృద్ధాప్య సమస్యలతో కన్నుమూత.
  • ఫిబ్రవరి 14న ఢిల్లీలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేసిన సిద్ధార్థ్, కియారా అద్వానీ.
  • బాలీవుడ్ ప్రముఖుల సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు, దిగ్భ్రాంతి వ్యక్తం!

బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. ఈ వార్త బాలీవుడ్ లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మన ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. ముఖ్యంగా కరోనా సమయం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది దిగ్గజ నటీ, నటులు మరణించారు. కరోనా, గుండెపోటు, దీర్ఘకాలిక సమస్యల కారణంగా చాలామంది ప్రముఖులు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ( Sidharth Malhotra) తండ్రి సునీల్ మల్హోత్రా ( Sunil Malhotra) మృతి చెందారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. చాలా రోజులుగా అనారోగ్యంతో సునీల్ మల్హోత్రా బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ దీర్ఘ కాలిక అనారోగ్యం కారణంగా ఆయన మరణించారు. ఫిబ్రవరి 14వ తేదీన రాత్రిపూట సునీల్ మల్హోత్రా మరణించారు. కానీ ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు

తన తండ్రి మరణించినట్లు సోషల్ మీడియాలో తాజాగా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పోస్ట్ పెట్టారు. దీంతో విషయం బయటకు వచ్చింది. ఢిల్లీలోనే కుటుంబ సభ్యుల సమక్షంలోనే సిద్ధార్థ్ మల్హోత్రా అంతక్రియలు పూర్తి అయ్యాయి. దీనికి సిద్ధార్థ్ మల్హోత్రా, ఆయన భార్య కియారా అద్వానీ ఇద్దరు కూడా హాజరయ్యారు. సునీల్ గతంలో మర్చంట్ నేవీ కెప్టెన్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. కాగా సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మృతి చెందిన నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

బాలీవుడ్ ప్రముఖుల సంతాపం

A post shared by Viral Bhayani (@viralbhayani)

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి మరణం చాలా బాధాకరం. దీనిపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలు అందిస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.