|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Actor Govinda : బాలీవుడ్ స్టార్ గోవిందాకు తీవ్ర అస్వస్థత.. హుటాహుటీన ఆస్పత్రికి తరలింపు..

Published: 11-11-2025, 10:41 PM
Actor Govinda : బాలీవుడ్ స్టార్ గోవిందాకు తీవ్ర అస్వస్థత.. హుటాహుటీన ఆస్పత్రికి తరలింపు..

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని తన నివాసంలో స్పృహతప్పి పడిపోవడంతో హుటాహుటీన జుహు క్రిటికేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Key Points

1

బాలీవుడ్ నటుడు గోవిందా తన నివాసంలో అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు.

2

జుహులోని క్రిటికేర్ ఆస్పత్రికి హుటాహుటీన తరలించిన కుటుంబ సభ్యులు.

4

గతంలో లైసెన్స్డ్ రివాల్వర్ ప్రమాదంలో గోవిందా కాలికి బుల్లెట్ గాయమైంది.

గోవిందా అస్వస్థత: ఆస్పత్రికి తరలింపు

Actor Govinda : బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. ముంబై జుహులోని తన నివాసంలో నిన్నరాత్రి సమయంలో స్పృహతప్పి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహటీన ఆయన్ను.. తన నివాసానికి సమీపంలోని క్రిటికేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఆరోగ్య పరిస్థితిపై స్నేహితుడి ప్రకటన

గోవింద ఆస్పత్రిలో చేరిన విషయంపై ఆయన స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ ప్రకటన చేశారు. ‘‘గోవిందాను ఆయన నివాసానికి సమీపంలోనే ఉన్న క్రిటికేర్ ఆస్పత్రిలో చేర్చించాం. అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. చాలా వరకు రక్త పరీక్షలు చేయించాం. వాటి రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

గతంలోనూ గోవిందాకు ప్రమాదం

గత సంవత్సరం 61ఏళ్ల గోవింద తన లైసెన్స్ కలిగిన రివాల్వర్ ను తప్పుగా కాల్చడంతో అతని కాలికి బుల్లెట్ గాయమైంది. దీంతో అతని మోకాలి కింద గాయంతో జుహులోని తన ఇంటికి సమీపంలోని క్రిటికేర్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. ఆ సమయంలో గంటసేపు శస్త్రచికిత్స తరువాత వైద్యులు బుల్లెట్ ను బయటకు తీసిన విషయం తెలిసిందే. అప్పట్లో అతను మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద తన లైసెన్స్ పొందిన రివాల్వర్ ను అల్మారాలో పెడుతుండగా అది కిందపడి పేలిందని, దీంతో అతని గాయాలైనట్లు తెలిపారు.

గోవిందా ఆరోగ్యం నిలకడగా ఉండటం అభిమానులకు ఊరటనిచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. గోవిందా ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.