|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రియల్ లవ్ గురించి ఎవరూ చెప్పలేదు.. అప్పుడు తొందరపడ్డా.. ఇప్పుడు నాలా నేనుంటున్నా: సమంత సంచలన పోస్ట్

Published: 28-09-2025, 10:14 AM
రియల్ లవ్ గురించి ఎవరూ చెప్పలేదు.. అప్పుడు తొందరపడ్డా.. ఇప్పుడు నాలా నేనుంటున్నా: సమంత సంచలన పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన జీవితం, ప్రేమ, స్వీయ అన్వేషణ గురించి చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 20ల్లో తొందరపడిన తీరు, 30ల్లో తనలా తాను మారిన వైనం గురించి సమంత తన భావాలను పంచుకుంది. ఈ సంచలన పోస్ట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

సమంత తన 20, 30ల జీవితం గురించి పెట్టిన సుదీర్ఘ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.

2

20ల్లో ఇతరులకు తగినట్లు కనిపించేందుకు తొందరపడ్డానని వెల్లడి.

4

ప్రతి అమ్మాయి తనను తాను స్వీకరించి, ప్రశాంతత పొందాలని ఆకాంక్ష.

సమంత ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇన్ స్టాగ్రామ్ పోస్టు వైరల్ గా మారింది. ఇవాళ (సెప్టెంబర్ 28) ఆమె తన ఇన్ స్టా అకౌంట్లో ఓ లెంగ్తీ పోస్టు పెట్టింది. 20, 30ల్లో తన జీవితం, రియల్ లైఫ్, ఇప్పుడు ఉంటున్న తీరు గురించి వివరించింది. ఈ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత ఇప్పుడ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఆదివారం ఇన్ స్టాగ్రామ్ లో సమంత ఓ వీడియోతో పాటు పెద్ద పోస్టును కూడా పెట్టింది. ‘‘నిన్న అవ్ని రంభియా (మేకప్ ఆర్టిస్ట్), నేను చాలా మాట్లాడుకున్నాం. అది నన్ను ఆలోచింపజేసింది. ముప్పైల తర్వాత అంతా డౌన్ మాత్రమే అని ప్రపంచం చెప్తుంది. మీ మెరుపు మసకబారుతుంది, మీ అందం జారిపోతుంది. మీరు పరిపూర్ణ ముఖం, పరిపూర్ణ శరీరం, పరిపూర్ణ జీవితం కావాలని సమయం అయిపోయినట్లుగా ఇరవైల్లో పరుగెత్తాలి’’ అని సమంత స్టార్ట్ చేసింది.

‘‘నా ఇరవైల జీవితం బిగ్గరగా, రెస్ట్ లేకుండా, తొందరపడుతూ గడిపా. తగినట్లు కనపడటానికి, తగినంతగా ఫీల్ కావడానికి, తగినంతగా ఉండటానికి తొందరపడ్డా. తద్వారా నేను లోపల ఎంత కోల్పోయానో ఎవరూ చూడలేదు. నేను అప్పటికే సంపూర్ణంగా ఉన్నానని ఎవరూ చెప్పలేదు. ఆ ప్రేమ నాకు ఎవరూ చెప్పలేదు… నిజమైన ప్రేమ ఎవరూ చెప్పలేదు… నేను ఎప్పుడూ ఉండకూడని వ్యక్తిగా నన్ను మెలితిప్పకుండా, నేను ఉన్నట్లుగా నన్ను కనుగొంటాను’’ అని పేర్కొంది.

20ల్లో తొందరపాటు, 30ల్లో ప్రశాంతత

‘‘అప్పుడు నా ముప్పైలు వచ్చాయి. ఏదో మృదువుగా ఉంది. ఏదో తెరుచుకుంది. నేను పాత తప్పుల బరువును మోయడం మానేశా. అన్నిట్లో ఫిట్ గా కుదురుకోవాలనే ప్రయత్నాన్ని మనేశా. నేను ప్రపంచానికి చూపించింది, నేను నిశ్శబ్దంగా జీవించింది.. ఈ రెండు జీవితాలను గడపడం మానేశా. సడెన్ గా నేను పబ్లిక్ లో ఎలా ఉన్నానో ఎవరూ చూడనప్పుడు అలాగే ఉంటున్నా. నేను అనుభవించిన అత్యంత సజీవమైన విషయం ఇది’’ అని సమంత పోస్టులో రాసుకొచ్చింది.

‘‘ప్రతి అమ్మాయికి ఇది కావాలని కోరుకుంటున్నా. నేను ఆమె సంపూర్ణతను కోరుకుంటున్నా. ఆమె పరిగెత్తడం ఆపివేసి, చివరకు తన ఇంటికి వచ్చినప్పుడు కలిగే శాంతిని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు పూర్తిగా మీలా మీరే ఉన్నప్పుడు… క్షమాపణ లేకుండా, మారువేషం లేకుండా ఉన్నప్పుడు మీరు కేవలం మిమ్మల్ని మీరు విడిపించుకోరు, మీరు మొత్తం ప్రపంచాన్ని విముక్తి చేస్తారు’’ అని సమంత ముగించింది.

రియల్ లవ్, తనను తాను తెలుసుకోవడం

సమంత రూత్ ప్రభు గతంలో నాగచైతన్య ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ 2015 లో డేటింగ్ ప్రారంభించారు. ఈ జంట అక్టోబర్ 6, 2017 న గోవాలో ఒక క్రైస్తవ వేడుకలో వివాహం చేసుకుంది. ఆ తరువాత మరుసటి రోజు హిందూ వివాహం జరిగింది. వారు అక్టోబర్ 2021 లో విడిపోతున్నట్లు ప్రకటించారు. తరువాత సంవత్సరం విడాకులు తీసుకున్నారు.

చైతన్య 4 డిసెంబర్ 2024 న అన్నపూర్ణ స్టూడియోలో శోభితను వివాహం చేసుకున్నాడు. సమంత ఏమో రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

సమంత తన నిజమైన భావాలను పంచుకుంటూ, ప్రతి అమ్మాయి తనను తాను అంగీకరించి, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంది. ఈ పోస్ట్ ఆమె వ్యక్తిగత ప్రయాణాన్ని తెలియజేస్తూ, స్వీయ అన్వేషణకు, నిజమైన ప్రేమకు ప్రాధాన్యతను ఇచ్చేలా స్ఫూర్తినిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.