|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘బొమ్మరిల్లు’ సీక్వెల్‌లో సాయి కుమార్, ఆది! దిల్ రాజు మాస్ అప్‌డేట్!!

Published: 13-01-2026, 10:23 PM
షాకింగ్: 'బొమ్మరిల్లు' సీక్వెల్‌లో సాయి కుమార్, ఆది! దిల్ రాజు మాస్ అప్‌డేట్!!
  • దిల్ రాజు సంచలన ప్రకటన: ‘బొమ్మరిల్లు’ సీక్వెల్‌లో సాయి కుమార్, ఆది సాయి కుమార్!
  • ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్ పాత్రలలో తండ్రీ కొడుకులుగా మెరవనున్న సాయి కుమార్, ఆది.
  • ‘బొమ్మరిల్లు’ చిత్రానికి 20 ఏళ్ళ తర్వాత సీక్వెల్.. యూత్ లో భారీ అంచనాలు!
  • సాయి కుమార్, ఆది కాంబోలో వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా?

టాలీవుడ్ లో ఒక సంచలనం! ‘బొమ్మరిల్లు’ సినిమాకు సీక్వెల్ రాబోతుందా? నిర్మాత దిల్ రాజు ఒక భారీ ప్రకటన చేశారు. ఈ సినిమాలో సాయి కుమార్ మరియు ఆది సాయి కుమార్ నటిస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

దిల్ రాజు సంచలన ప్రకటన!

20 ఏళ్ళ క్రితం యూత్ ను ఉర్రూతలూగించిన సినిమా బొమ్మరిల్లు.. ఎన్నో ఆశలతో కాలేజీ కెరీర్ పూర్తి చేసి..తనకు నచ్చిన జీవితం.. అంద్భుతంగా ప్లాన్ చేసుకోవాలి అనకునే యువకుడి కథ ఇది. అటువంటి ఆలోచనలు ఉన్న యంగ్ స్టార్ కు.. అంతకు మించిన ఆలోచనలు ఉన్న తండ్రి ఉంటే..? ఆ తండ్రి తన కొడుకు జీవితాన్ని తనకు నచ్చినట్టుగా.. తీర్చిదిద్దాలి అనుకుంటే.. ఆ తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ ఎలా ఉంటుందో చూపించిన సినిమా బొమ్మరిల్లు.

ఈసినిమాలో తండ్రి, కొడుకు ఇద్దరు మంచివారే.. ఇద్దరి ఆలోచనలు మంచివే… కానీ ఇద్దరి మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ వల్ల… తేడా వస్తుంటుంది. తండ్రి మాటకు ఎదురు చెప్పలేక.. తనకు నచ్చిన దారిలో నడవలేక హీరో ఎంత ఇబ్బందిపడ్డాడు అనేది.. బొమ్మరిల్లు సినిమా ద్వారా అద్భుతంగా చూపించాడు దర్శకుడుు భాస్కర్. ఇక ఈసినిమా అప్పటి యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. బ్లకా్ బస్టర్ హిట్ అయ్యింది. తల్లీ తండ్రులు పిల్లల గురించి ఆలోచించాలని మెసేజ్ తోపాటు.. తల్లీ తండ్రులకు పిల్లలు గౌరవం ఇవ్వాలని తెలిసేలా చేసింది బొమ్మరిల్లు.

తండ్రీ కొడుకులుగా సాయి కుమార్, ఆది?

ఇక బొమ్మరిల్లు సినిమా వచ్చి 20ఏళ్లు అవుతున్నా..ఆ ప్రభావం ఇప్పటికీ పోలేదు. మంచి సినిమాలు చూసే ఆడియన్స్ మూవీ ప్లే లిస్ట్ లో బొమ్మరిల్లు ఎప్పుడూ ఉంటుంది. కాగా ఈసినిమా ఎన్నిసార్లు టీవీలో వచ్చినా.. కదలకుండా చూస్తుంటారు సినీ ప్రియులు. అయితే బొమ్మరిల్లు సినిమాకు సీక్వెల్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ఈసినిమా సీక్వెల్ పై నిర్మాత దిల్ రాజు ఓ సందర్భంలో అప్ డేట్ ను అందించారు. బొమ్మరిల్లు సీక్వెల్ ఉంటుందని. దానికి కాస్త టైమ్ పడుతుందని ఆయన అన్నారు. అప్పటి జనరేషన్ కు ఆ కథ సూట్ అయ్యింది.. ఇక ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇప్పటి వారికి తగ్గట్టుగా.. అద్భుతమైన కథ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు.

కథ సెట్ అయితే మాత్రం బొమ్మరిల్లు 2 కు ఎక్కువ టైమ్ పట్టదు. రీసెంట్ గా సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ కు సబంధించిన సినిమా ఈవెంట్ లో.. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సాయి కుమార్, ఆది మంచి తండ్రి కొడుకులు.. ఒకే మాట మీద ఉంటారు. బొమ్మరిల్లు 2 సినిమా చేస్తేమటుకు.. ప్రకాశ్ రాజ్, సిద్ధార్థ్ పాత్రలలో ఈసారి సాయి కుమార్, ఆది సాయి కుమార్ నటిస్తారు.. వారితోనే ఈసినిమా సీక్వెల్ చేస్తాను అని అన్నారు. దిల్ రాజు సరదాకు అన్నా.. పబ్లిక్ గా ఆమాట అనేసరికి .. నెక్ట్స్ బొమ్మరిల్లులో సాయి కుమార్, ఆయన తనయుడిని చూడబొతున్నామని పిక్స్ అయ్యారు.

‘బొమ్మరిల్లు’ సీక్వెల్.. యూత్ లో అంచనాలు!

సినిమా ఈవెంట్ లో దిల్ రాజు ఇలా మాట్లాడటం పెద్ద చర్చకు దారి తీసింది. సాయి కుమార్, ఆదితో బొమ్మరిల్లు 2 ను నిజంగా దిల్ రాజు ప్లాన్ చేశారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక బొమ్మరిల్లు సినిమా ఒకప్పుడు హీరో సిద్ధార్థ్ కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. బాయ్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సిద్దు… ఇక్కడ పెద్ద స్టార్ కాలేకపోయాడు .. కాని బొమ్మరిల్లు తరువాత అతని దశ తిరిగిపోయింది టాలీవుడ్ లో వరుస ప్రేమ కథ సినిమాలో నటిస్తూ.. లవర్ బాయ్ ఇమేజ్ సాధించాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఫామ్ లోలేదు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా.. పెద్దగా వర్కౌట్ అవ్వడలేదు.

దిల్ రాజు గారి ప్రకటనతో ‘బొమ్మరిల్లు’ సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. సాయి కుమార్, ఆది సాయి కుమార్ ల కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.