|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాక్సాఫీస్ షేక్.. 8 రోజుల్లోనే 60.5 కోట్లు.. ఫస్ట్ యానిమేటెడ్ సినిమాగా హిస్టరీ.. క్యూ కడుతున్న ఆడియన్స్.. అదిరే క్రేజ్

Published: 02-08-2025, 10:13 AM
బాక్సాఫీస్ షేక్.. 8 రోజుల్లోనే 60.5 కోట్లు.. ఫస్ట్ యానిమేటెడ్ సినిమాగా హిస్టరీ.. క్యూ కడుతున్న ఆడియన్స్.. అదిరే క్రేజ్

యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన 8 రోజుల్లోనే రూ.60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి, రికార్డులు సృష్టించింది. పాజిటివ్ టాక్ సినిమాకు మరింత బ్రహ్మరథం పడుతోంది.

Key Points

1

8 రోజుల్లో రూ.60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!

2

భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన యానిమేటెడ్ సినిమా!

4

పాజిటివ్ టాక్ తో థియేటర్లు నిండిపోతున్నాయి!

రూ.60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు

యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. థియేటర్లకు వచ్చిన ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ తో ఈ మూవీ అదరగొడుతోంది. రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. ఇండియాలో రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. ఈ మూవీకి థియేటర్లు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. మౌత్ టాక్ తో ఈ మూవీ జనాలకు మరింత రీచ్ అవుతోంది.

మహావతార్ నరసింహ మూవీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. కోట్లకు కోట్లు ఖాతాలో వేసుకుంటోంది. థియేటర్లలో రిలీజైన 8 రోజుల్లో ఈ సినిమా రూ.60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఇండియాలోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన యానిమేటెడ్ ఫిల్మ్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. దేశంలో మరే యానిమేటెడ్ సినిమా సొంతం చేసుకుని రికార్డును మహావతార్ నరసింహా దక్కించుకుంది.

రికార్డులను బద్దలు కొడుతోంది

మరోవైపు అమెరికాలోనూ ఈ మూవీ కలెక్షన్ల సునామీని చూపిస్తోంది. అక్కడ వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిందని అక్కడి ప్రొడక్షన్ సంస్థ వెల్లడించింది.

నరసింహా అవతారం నేపథ్యంగా పౌరాణిక యాక్షన్ చిత్రంగా ఈ కన్నడ యానిమేటెడ్ మహావతార్ నరసింహా తెరకెక్కింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది సినిమా. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తో కలిసి క్లీం ప్రొడక్షన్స్ ఈ యానిమేటెడ్ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి. జులై 25, 2025న ఈ మూవీ రిలీజైంది. పాజిటివ్ టాక్ తో క్రమంగా థియేటర్లు పెంచుకుంటూ పోతోంది. రూ.20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. ఇప్పటికే రూ.60.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

అమెరికాలోనూ విజయం

రాక్షస రాజు హిరణ్యకశిపుడిని నరసింహా అవతారంలో మహా విష్ణువు ఎలా సంహరించడానే కథ అందరికీ తెలిసిందే. ఇందులో విష్ణువును ఆరాధించే హిరణ్యకశిపుడి తనయుడు ప్రహ్లాదుడి కథ కూడా తెలుసు. ఇదే కథను ఇప్పుడు మహావతార్ నరసింహా యానిమేటెడ్ సినిమాగా తీసుకొచ్చారు. దీనికి అశ్విన్ కుమార్ డైరెక్టర్. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఈ యానిమేటెడ్ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లాయి.

తన సోదరుడు హిరణ్యాక్షుడిని వరాహ అవతారంలో ఉన్న విష్ణువు సంహరించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు రాక్షస రాజు హిరణ్యకశిపుడి. ఘోరమైన తపస్సుతో అపారమైన శక్తులు పొందుతాడు. ఈ శక్తులతో మూడు లోకాలను పరిపాలించి, చివరికి తానే దేవుడినని ప్రకటించుకుంటాడు. అతని ఐదేళ్ల కొడుకు ప్రహ్లాదుడు, ధర్మానికి ప్రతీకగా నిలుస్తూ తండ్రికి ఎదురు తిరుగుతాడు. ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ విష్ణుమూర్తి ఎప్పటికప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. చివరకు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు.

మహావతార్ నరసింహ యానిమేటెడ్ సినిమా అద్భుతమైన వీఎఫ్ఎక్స్ మరియు కథతో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తోంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ విజయాలు సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.