
📌 Key Points
- కావ్య నిజం చెబుతోందని నమ్మిన కుటుంబ సభ్యులు, డీఎన్ఏ టెస్ట్‌కు అంగీకారం!
- మంత్రి ధర్మేంద్రను ఉసిగొల్పిన రుద్రాణి, టెస్ట్ ఆపాలని కుట్ర!
- పాప, కావ్యల శాంపిల్స్ సేకరించిన డాక్టర్, 24 గంటల్లో రిపోర్ట్స్!
- రిపోర్ట్స్‌పై రాజ్, కావ్యల మధ్య సవాల్, ఫలితం కోసం ఉత్కంఠ!
బ్రహ్మముడి సీరియల్‌లో సంచలనం! కావ్య నిజం చెప్పిందో లేదో తేల్చేందుకు డీఎన్ఏ టెస్ట్! రాజ్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!
డీఎన్ఏ టెస్ట్‌కు రాజ్ గ్రీన్ సిగ్నల్!
బ్రహ్మముడి సీరియల్ జనవరి 22 ఎపిసోడ్‌లో కావ్య చెప్పేదాంట్లో నిజముందని ఇంట్లోవాళ్లంతా నమ్ముతారు. డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే నిజమేంటో బయటపడుతుందని అప్పు చెబుతుంది. అందుకు కావ్యను ఒప్పించి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు రాజ్. మరోవైపు కావ్య వాళ్లను ఆపాలని మంత్రిని ఉరిగొల్పుతుంది రుద్రాణి.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య చెప్పినదాంట్లో నిజం లేదని మనమెందుకు ఆలోచించకూడదు అని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. నాకు కూడా కళావతి మాటల్లో నిజమనిపిస్తుంది, కానీ, ఆ పాప మన పాప కాదని చెప్పడానికి ఏదో ఒక సాక్ష్యం ఉండాలిగా డాక్టర్స్‌ని అడిగితే ఒప్పుకోరు, ఈ సమస్య చాలా పెద్దది అని రాజ్ అంటాడు.
మంత్రిని ఉసిగొల్పుతున్న రుద్రాణి!
నువ్వు చెప్పింది నిజమనిపిస్తుంది, నీ మాటల్లో నిజమనిపిస్తుందని, డీన్‌ఏ టెస్ట్ చేపిద్దాం, దాని ద్వారా ఈ పాప మన బిడ్డ కాదో తేలుతుంది అని చెబుతాడు రాజ్. నిజనిజాలు నిగ్గు తేల్చాలని అనుకుంటున్నా అని రాజ్ అంటాడు. దానికి సరేనంటుంది కావ్య. మరోవైపు డీఎన్‌ఏ టెస్ట్ గురించి మంత్రి ధర్మేంద్రకు రుద్రాణి చెబుతుంది.
మరోవైపు డాక్టర్ డీఎన్ఏ టెస్ట్ కోసం పాపది, కావ్యది శాంపిల్స్ తీసుకుంటాడు. 24 గంటల్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్పి వెళ్లిపోతాడు డాక్టర్. రేపు వచ్చే డీఎన్ఏ రిపోర్ట్స్‌కు నేను కట్టుబడి ఉంటాను, నువ్వు కట్టుబడి ఉంటావా అని రాజ్ అడుగుతాడు. కచ్చితంగా నా నమ్మకమే నిజం అవుతుందని కావ్య అంటుంది. మ్యాచ్ అవ్వకపోతే మన బిడ్డ ఎక్కడున్నా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అని రాజ్ అంటాడు.
రిపోర్ట్స్ కోసం ఎదురుచూపులు!
మన సంతోషం, బాధ రేపు వచ్చే డీఎన్ఏ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉందని అపర్ణ అంటుంది. మరుసటి రోజు ఉదయం అంతా డీఎన్ఏ రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అంతా టెన్షన్ పడుతుంటే కావ్య మాత్రం తను అనుకున్నట్లుగా వస్తాయంటుంది. ఇంతలో రాజ్‌కు డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్ట్స్ గురించి మేసెజ్ వస్తుంది.
డీఎన్ఏ రిపోర్ట్స్ రాజ్ జీవితాన్ని మార్చేస్తాయా? కావ్య నిజాన్ని నిరూపించగలదా? బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరగబోతుందో చూడటానికి వేచి ఉండండి! మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


