
బ్రహ్మముడి సీరియల్ లోని ఆగస్టు 12వ తేదీ ఎపిసోడ్ లో అప్పూ గర్భవతి అని తెలుస్తుంది. ఈ వార్తతో కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కానీ, రుద్రాణి ప్రతిస్పందన మాత్రం ఊహించనిది.
Key Points
అప్పూ గర్భవతి అని కుటుంబ సభ్యులకు తెలుస్తుంది.
రుద్రాణి కావ్యను ఆమె గర్భధారణ గురించి నిలదీస్తుంది.
ఇందిరాదేవి రుద్రాణి తీరును తప్పుబడుతుంది.
అప్పూ గర్భధారణ వార్త
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 798వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ చాలా వరకూ అప్పూ, కావ్య ప్రెగ్నెన్సీల చుట్టూనే తిరిగింది. అయితే చివర్లో ఇచ్చిన ట్విస్ట్ తో ఈ సీరియల్ కీలకమైన మలుపు తిరగబోతున్నట్లు స్పష్టమైంది.
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఆగస్టు 12) ఎపిసోడ్ రాజ్ తాను అపార్థం చేసుకున్నానని తెలుసుకోవడంతో మొదలవుతుంది. కళావతిగారికి నిజంగానే క్యాన్సర్ లేదా అని అతడు అంటాడు. రావాలని నువ్వు కోరుకుంటున్నావా అని అపర్ణ అడుగుతుంది. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తాను అనుకుంటానని రాజ్ అంటాడు. ఇలా కాకుండా కాస్త మంచిగా ఆమెను గెలుచుకోవడానికి ప్రయత్నించు అని ఇందిరాదేవి చెబితే.. అలాగే ట్రై చేస్తానంటాడు.
అటు కల్యాణ్ తన రూమ్ లో కూర్చొని కవిత రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు అప్పూ వచ్చి తనకు పుల్లగా తినాలని ఉందని అంటుంది. కిచెన్ లో కిలోల కొద్దీ చింతపండు ఉంటుంది వెళ్లు అని కాస్త ఆగి అసలు విషయం అర్థం చేసుకుంటాడు కల్యాణ్. అంటే నువ్వు తల్లివి కాబోతున్నావా అంటూ అప్పూని ఎత్తుకొని చుట్టూ గాల్లో తిప్పుతాడు.
ఆ తర్వాత విషయాన్ని ఇంట్లో వాళ్లందరికీ చెబుతానంటూ ఉత్సాహంగా వెళ్తాడు కల్యాణ్. అందరూ వచ్చిన తర్వాత అసలు విషయం చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటాడు. చివరికి ఇందిరాదేవి చెవిలో కల్యాణ్ చెబితే.. ఆమె అందరికీ జరిగిన విషయమేంటో చెబుతుంది. దీంతో అందరూ కల్యాణ్, అప్పూ దంపతులకు కంగ్రాట్స్ చెబుతారు.
తన చెల్లెలికి కంగ్రాట్స్ చెప్పిన కావ్య.. ఈ విషయాన్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని అంటుంది. అప్పుడే అప్పూ ఎమోషనల్ అవడం చూసి రుద్రాణి సీన్ లోకి ఎంటరవుతుంది. నిజానికి ఈ ఇంట్లో మొదల పెళ్లయింది రాజ్, కావ్యకు అని.. మొదట ప్రెగ్నెంట్ అవ్వాల్సింది కూడా కావ్యే అని రుద్రాణి అంటుంది. ఆమె మాటలు విని నా కోడలు కూడా అని అపర్ణ అనబోతే కావ్య అడ్డుకుంటుంది.
రుద్రాణి, కావ్య మధ్య వాదన
నా కోడలు ఎప్పటికైనా ప్రెగ్నెంట్ అవుతుందని, అప్పూ ప్రెగ్నెంట్ అయినా కూడా చాలా సంతోషంగా ఉందని అపర్ణ అంటుంది. కావ్యను దారుణంగా అవమానిస్తుంది రుద్రాణి. ఆమె పెళ్లి జరిగినప్పటి నుంచి తాజాగా రాజ్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేయడం వరకూ జరిగిందంతా చెబుతూ కావ్యను నానామాటలంటుంది. దీంతో ఆమె ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇతరులు కాస్త సంతోషంగా ఉంటే చాలు కడుపు మంటతో రగిలిపోతావు.. నీదీ ఒక బతుకేనా అంటూ కూతురిపై మండిపడుతుంది ఇందిరాదేవి.
కావ్య వెళ్లిపోయిన తర్వాత హాల్లో రుద్రాణి మాట్లాడిన తీరును ప్రకాష్, సుభాష్ కూడా తప్పుపడతారు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి సీన్లోకి వస్తుంది. తల్లి కావడం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలని అప్పూతో చెబుతుంది ధాన్యలక్ష్మి. ఇలా జాబ్ చేస్తే అది సాధ్యం కాదని అంటుంది.
దీంతో అప్పూ తాను జాబ్ మానేస్తానని, తన కడుపులో బిడ్డ బయటకు వచ్చే వరకూ లాంగ్ లీవ్ పెడతానని చెబుతుంది. మనస్ఫూర్తిగానే చెబుతున్నావా అని కల్యాణ్ అడుగుతాడు. అవునని అప్పూ అంటుంది. జాబ్ మానేయడం ఒక్కటే కాదు.. తాను చెప్పిన ప్రతి పనీ చేయాల్సిందే అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్లిపోతుంది.
అటు కావ్య బాధపడుతూ ఉండగా అపర్ణ, ఇందిరాదేవి ఆమె దగ్గరికి వెళ్తారు. ఆ రుద్రాణి మాటలకు బాధపడుతున్నావా అని అడుగుతారు. తన దురదృష్టానికి బాధపడుతున్నానని, అప్పూ అదృష్టం తనకు ఎందుకు లేదని బాధపడుతున్నట్లు చెబుతుంది.
అప్పూ తాను ప్రెగ్నెంట్ అని అందరితో ఆనందంగా పంచుకుందని, తాను మాత్రం ఎవరికీ చెప్పుకోలేనని, చివరికి ఆయనకు కూడా చెప్పుకోలేనని బాధపడుతుంది. భారతంలో కుంతిలా తన పరిస్థితి ఉందని, తాను ఏం పాపం చేశానని ఏడుస్తుంది. దీంతో అపర్ణ ఆమెను ఓదారుస్తుంది.
చివరి ట్విస్ట్
అటు అప్పూకి వేడి వేడి పాలు తీసుకొచ్చి ఇస్తాడు కల్యాణ్. అప్పుడే సేవలు చేయడం మొదలుపెట్టావా అని అప్పూ అంటుంది. అది తన బాధ్యత అని కల్యాణ్ అంటాడు. తనకు అమ్మాయి కావాలని, ఆమెను కూడా బాగా పుస్తకాలు చదివించి రచయిత్రిని చేస్తానని కల్యాణ్ అంటాడు. తనకు అబ్బాయే కావాలని, అతన్ని ఓ పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ ను చేస్తానని అప్పూ అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ అమ్మాయి, అబ్బాయి అంటూ గొడవ పడుతూ కూర్చొంటారు.
అప్పూ పుల్లటి మామిడి కాయలు తీసుకొచ్చి కావ్యకు ఇస్తుంది. కడుపుతో ఉన్నవాళ్లు తినాలంటూ ఆమెకు ఇస్తుంది. కావ్య వద్దని చెబుతున్నా బలవంతంగా చేతిలో పెడుతుంది. ఆమె తినబోతుండగా రుద్రాణి వస్తుంది. పుల్లటి మామిడి కాయలు కడుపుతో ఉన్నవాళ్లే తినాలని, అంటే కావ్య కూడా ప్రెగ్నెంటా.. ఆ విషయం తెలిస్తే రాజ్ కు ఏమవుతుందో అని నాటకం ఆడుతున్నారా అని అడుగుతుంది.
దీంతో తామెందుకు నాటకాలు ఆడతాం.. అయినా మామిడి కాయలు ప్రెగ్నెంట్ ఉన్నవాళ్లే తినాలా అంటూ అప్పూ కవర్ చేస్తుంది. అయినా ఇవి తియ్యటి కాయలని చెప్పినా రుద్రాణి వినదు. ఒకటి తిని చూసి పుల్లటివే కదా అంటుంది. అంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ ను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని కావ్యను ఆమె తల్లి నిలదీయడం చూడొచ్చు. తర్వాత ఇందిరాదేవి ద్వారా అసలు విషయం తెలుసుకొని కావ్య ఓదారుస్తుంది. అప్పుడే కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం రుద్రాణికి తెలిసిపోతుంది.
కావ్యను రుద్రాణి నిలదీయడం, ఆమె దుఃఖం, మరియు ఇందిరాదేవి ప్రతిస్పందనతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. చివరి ట్విస్ట్ కథాంశాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.


