|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి ఆగస్ట్ 22 ఎపిసోడ్: రుద్రాణితో కావ్య నాటకం- ఇంటికి తాగొచ్చిన రామ్- కావ్య నీ భార్య అని రాజ్‌కు చెప్పిన అపర్ణ

Published: 21-08-2025, 10:17 PM
బ్రహ్మముడి ఆగస్ట్ 22 ఎపిసోడ్: రుద్రాణితో కావ్య నాటకం- ఇంటికి తాగొచ్చిన రామ్- కావ్య నీ భార్య అని రాజ్‌కు చెప్పిన అపర్ణ

బ్రహ్మముడి సీరియల్‌లోని ఆగస్ట్ 22 ఎపిసోడ్‌లో రుద్రాణి, కావ్యల మధ్య జరిగే నాటకం, రామ్ మద్యం సేవించి ఇంటికి రావడం, అలాగే అపర్ణ చేసిన ఒక కీలక వెల్లడి చూడదగినవి. ఈ ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్టులు, టర్న్స్ ఉన్నాయి.

Key Points

1

రుద్రాణి రాజ్‌ను కళావతి గర్భవతి అని నమ్మించే ప్రయత్నం చేస్తుంది.

2

రాజ్ కళావతి ప్రెగ్నెన్సీని నమ్మకపోవడంతో కావ్య విషాదంలో మునిగిపోతుంది.

4

ఇందిరాదేవి, అపర్ణ కళావతి గర్భవతి అని నిజం చెప్పి రాజ్‌ను షాక్ అయ్యేలా చేస్తారు.

రుద్రాణి నాటకం

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అమెరికా వెళ్తున్నట్లు నాటకం ఆడుతున్న రాజ్‌ను రుద్రాణి కలుస్తుంది. కళావతి కాకుండా మీరు వచ్చారేంటీ అని రాజ్ అంటే.. తను రాలేదు. నిన్ను ఫేస్ చేయలేదు. నిజం చెప్పలేదు. నేను కూడా చెప్పలేను అని రుద్రాణి అంటుంది.

నిజం చెప్పనప్పుడు ఎందుకు వచ్చారు అని రాజ్ వెళ్లిపోతుంటే.. కళావతి కడుపుతో ఉందని రుద్రాణి చెబుతుంది. దాంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయి ఆగిపోతాడు. కళావతి కడుపుతో ఉంది. ఆ నిజం చెప్పలేక. నీతో పెళ్లికి ఒప్పుకోలేక బాధపడుతుంది అని రుద్రాణి చెబుతుంది. ఇంతలో కావ్య వస్తుంది. నువ్ ప్రెగ్నెంటా అని రాజ్ అడుగుతాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది.

నన్ను క్షమించు కళావతి. రామ్‌ను ఆపేందుకు నిజం చెప్పక తప్పలేదు అని రుద్రాణి అంటుంది. కానీ, రాజ్ మాత్రం తెగ నవ్వుతాడు. ప్లాన్ అదిరిపోయింది కళావతి గారు. దీనికి సూత్రధారి మీరేనా. మీరు కడుపుతో ఉన్నారంటే నేను ఎలా నమ్ముతాను. పెళ్లి కాకుండా మీలాంటి వారు కడుపుతో ఉన్నారంటే నమ్మడానికి నేను ఏమైనా పిచ్చోడుని అనుకున్నారా అని రాజ్ అంటాడు.

అయ్యో రామ్ గారు నిజం. నేను కడపుతో ఉన్నాను. మీతో పెళ్లికి ఒప్పుకోకపోడానికి, మీకు దూరంగా ఉండటానికి కారణం ఇదే. నేను తల్లిని కాబోతున్నాను. ఇక నమ్మడం నమ్మకపోవడం మీ చేతుల్లో ఉంది అని కావ్య చెప్పి ఏడుస్తూ వెళ్లిపోతుంది. రామ్ షాక్ అయి అలాగే ఉంటాడు. రుద్రాణి కూడా వెళ్లిపోతుంది. తర్వాత రామ్ వెళ్లి అపర్ణ, ఇందిరాదేవిని కలుస్తాడు.

రుద్రాణి గారేంటీ కళావతి ప్రెగ్నెంట్ అంటున్నారు. కళావతి కూడా అదే నిజమంటున్నారు. తనకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటీ. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నాకు ఇలా అబద్ధం చెప్పిస్తోంది కదా. నేను అసహ్యించుకోవాలనే కదా ఇలా రుద్రాణితో కలిసి నాటకం ఆడిస్తుంది. చెప్పండి నానమ్మా అని రాజ్ అంటాడు. కళావతి చెప్పింది నిజమేరా. కళావతి కడుపుతో ఉంది అని ఇందిరాదేవి చెబుతుంది.

రాజ్‌కు నిజం తెలుస్తుందా?

నీకు నిజం చెప్పలేక, మోసం చేయలేక నీతో పెళ్లి వద్దనుకుంది. కానీ, నువ్ దూరంగా వెళ్లిపోతున్నావని తెలిసి ఉండలేక నిజం చెప్పింది అని ఇందిరాదేవి అంటుంది. ఇది మీకు ముందే తెలుసా అని రాజ్ అడిగితే తెలుసు అంటారు. టైమ్ చూసి చెప్పాలనుకున్నాం. కానీ, ఇలా చెప్పాల్సి వస్తుందనుకోలేదు అని ఇందిరాదేవి అంటుంది. ఆపండి.. మీరు నన్ను మోసం చేశారు. మిమ్మల్ని అమ్మా అని, నానమ్మ అని పిలిచాను. కొడుకును ఎలా మోసం చేయాలనిపించింది అని రాజ్ అంటాడు.

నన్ను ఇన్ని రకాలుగా మోసం చేస్తారనుకోలేదు. అన్ని తెలిసి ఎలా మోసం చేస్తారు. కళావతికి ప్రెగ్నెన్సీ వస్తే నాకు ఎందుకు చెప్పలేదు. నేను తన వెంటపడుతున్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు అని రాజ్ నిలదీస్తాడు. సరే మీ దగ్గర సమాధానం లేదు. ఈ ఒక్కదానికైనా సమాధానం చెప్పండి. కళావతి గారి ప్రెగ్నెన్సీ కారణం ఎవరు. ఎవరి వల్ల వచ్చిందని రాజ్ అడుగుతాడు.

అపర్ణ, ఇందిరాదేవి సైలెంట్‌గా ఉండటంతో అసలు కళావతి గారికైనా ఆ విషయం తెలుసా. చెప్పరు, ఏది చెప్పరు. కానీ మోసం బాగా చేస్తారు. కళావతి గారెకి నా మాటగా చెప్పండి. కళావతి గారు నన్ను మోసం చేశారో, లేదా మోసపోయారో నాకు తెలియదు. కానీ, కళావతి గారి కడుపుకు కారణం అయిన వారు తెలిసేవరకు నేను క్షమించను. తన మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉందని చెప్పండి అని రాజ్ వెళ్లిపోతాడు.

తర్వాత రుద్రాణిని వాడికి నిజం ఎందుకు చెప్పావ్ అని ఇంటిల్లిపాది నిలదీస్తారు. నిన్ను ఎవరే నిజం చెప్పమని చెప్పారు అని అడుగుతుంది ఇందిరాదేవి. ధాన్యలక్ష్మీ, స్వప్న మాటలంటారు. ఆపుతారా. తప్పు తను చేస్తే నన్ను అంటారేంటీ. రాజ్ అమెరికా వెళ్తే ఎవరు ఆపట్లేదు. రాజ్‌ను చూసి గుండె తరుక్కుపోయింది. వాడికేదైనా చేయాలనిపించి, దూరం అవుతున్న వాళ్లను దగ్గర చేయాలని చెప్పాను అని రుద్రాణి అంటుంది.

నువ్ దగ్గర చేయడానికి కాదు ఇంకా దూరం చేయాలని చేశావా అని ఇందిరాదేవి అంటుంది. అలా అయితే గతం కూడా చెప్పేదాన్ని కదా. మంచి చేయాలని చూసిన నాకు చివాట్లు పెడతారా అని ఏడుస్తున్నట్లుగా వెళ్లిపోతుంది రుద్రాణి. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అని అపర్ణ అంటుంది. ఇక ఆయన నన్ను అసహ్యించుకుంటూనే ఉంటారు. ఆయన దృష్టిలో నేను తప్పు చేసినదాన్ని అని కావ్య అంటుంది.

కావ్య యొక్క విషాదం

మరోవైపు రాజ్ బాధలో ఉంటాడు. ఇప్పుడు మీరెళ్లి బావను ఓదార్చండి. నా పెళ్లి గురించి మాట్లాడి ఒప్పించండి అని తల్లిదండ్రులకు చెబుతుంది యామిని. దాంతో రాజ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతారు. నీకోసం మేమున్నాం. ప్రాణంగా ప్రేమిస్తున్నా నా కూతురు ఉంది. నా కూతురును పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి అని యామిని తండ్రి అంటాడు.

లేదు నేను యామినిని పెళ్లి చేసుకోలేను. కళావతి గారిని నేను ప్రేమించాను. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. తను నన్ను మోసం చేసి ఉండొచ్చు. కానీ, తప్పు మాత్రం ఎప్పటికీ చేయదు అని రాజ్ వెళ్లిపోతాడు. అలా యామిని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. రాజ్ ఇలా అంటాడేంటని యామినితో చెబుతారు. ఆశ మమ్మీ. బావ మనసు ముక్కలు అయింది. దాన్ని ఇంకా తుక్కు తుక్కు చేస్తే నావాడు అవుతాడు అని యామిని అంటుంది.

తర్వాత రాత్రి దుగ్గిరాల ఇంటికి రామ్ తాగి తూలుతూ వెళ్తాడు. కళావతి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని కావ్యను నిలదీస్తాడు రాజ్. కావ్య సైలెంట్‌గా ఉండిపోతుంది.

నువ్ చెప్పకుంటే యామిని అన్నట్లు ఎవరితోనో రాజ్ అంటుంటే అపర్ణ చెంప చెల్లుమనిపిస్తుంది. కళావతి నీ భార్య, నువ్ నా కొడుకువి అని నిజం చెబుతుంది అపర్ణ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరికి కళావతి గర్భవతి అనే నిజం వెలుగులోకి వచ్చి రాజ్‌ను షాక్‌కు గురిచేస్తుంది. ఈ ట్విస్ట్‌తో బ్రహ్మముడి సీరియల్‌లో మరింత ఉత్కంఠ మొదలవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.