|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి ఆగస్ట్ 8 ఎపిసోడ్: తమ్ముడిని కాపాడుకున్న అక్క- రాజ్, కావ్యను కలుపుతానన్న యామిని- ట్విస్ట్ ఇచ్చిన సుభాష్

Published: 07-08-2025, 10:15 PM
బ్రహ్మముడి ఆగస్ట్ 8 ఎపిసోడ్: తమ్ముడిని కాపాడుకున్న అక్క- రాజ్, కావ్యను కలుపుతానన్న యామిని- ట్విస్ట్ ఇచ్చిన సుభాష్

బ్రహ్మముడి సీరియల్‌లోని ఆగస్ట్ 8 ఎపిసోడ్‌లో రాజ్‌కు యాక్సిడెంట్ అవుతుంది. అతనిని అక్క రేవతి కాపాడుతుంది. కావ్య, రాజ్ కలిసి వెళ్ళడం, యామిని, సుభాష్ ప్రయత్నాలతో ఈ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

Key Points

1

రాజ్ యాక్సిడెంట్‌లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు.

2

అక్క రేవతి రాజ్‌ను కాపాడింది.

4

సుభాష్, ఇందిరాదేవిలు రాజ్‌కు నిజం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

రాజ్ యాక్సిడెంట్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అప శకునాలు మాట్లాడకు. కావ్య ఏడుస్తూ వెళ్లింది వాడికేమో అయిందని కాదు. రాజ్ దొరికాడని వెళ్లింది అని ఇందిరాదేవి అంటుంది. అడ్రస్ పెట్టమను, మనం కూడా వెళ్దాం అని సుభాష్ అంటాడు. వాడు కావ్య మీద కోపంతో వెళ్లాడు. ఇప్పుడు మనం వెళ్తే సరిగా మాట్లాడలేరు. వాళ్లు మాట్లాడుకోని అని ఇందిరాదేవి ఆపుతుంది.

ఇక లేట్ చేసి లాభం లేదు అపర్ణ. కావ్య ప్రేమ యాక్సెప్ట్ చేయనందుకే వెళ్లిపోయాడు. అలాంటిది రేపు వాడికి మనమే కన్న తల్లిదండ్రులను తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని సుభాష్ అంటాడు. వీళ్లేంటీ సడెన్‌గా ట్విస్ట్ ఇస్తున్నారు. వెంటనే ఈ విషయం యామినికి పోస్ట్ చేయాలి అని రుద్రాణి అనుకుంటుంది. యామినికి కాల్ చేసి వీళ్లు రాజ్‌కు నిజం చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఆ తర్వాత నువ్వేం చేయలేవు అని రుద్రాణి అంటుంది.

ఏం చేయాలో, ఎలా చేయాలో నేను చూసుకుంటాను అని యామిని అంటుంది. మరోవైపు రేవతి దగ్గరికి వెళ్లి రాజ్ గురించి అడుగుతుంది. నువ్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే రాజ్ రోడ్డు మీద బాధతో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. రాత్రి మేము కారులో వెళ్తుంటే ఓ కారు గుద్దేసి వెళ్లిపోయింది. నేనే కాపాడాను. తలకు చిన్న దెబ్బ తగిలింది. కాస్తా కోలుకున్నాక చెబుతామని ఇప్పటి వరకు ఆగాం అని రేవతి చెబుతుంది.

రేవతి రక్షణ

మీకు చెబుతామంటే రాజ్ ఒప్పుకోలేదు అని రేవతి అంటుంది. రాజ్ మాట్లాడిన మాటలు చెబుతుంది రేవతి . ఉదయం కోపం తగ్గాక చెబుదామని ఆగాను అని రేవతి అంటుంది. దాంతో కోపంగా రాజ్ దగ్గరికి వెళ్లిన కావ్య సరిపోయిందా, ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సింది, ఇంకా పెద్ద దెబ్బలు తగిలేవి అని కావ్య అంటుంది. దారినపోయే దానయ్యగాని నాకేమైనా అయితే మీకేంటీ అని రాజ్ అంటాడు.

మీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. ఒక్కమాట చెబితే ఆస్తులు పోయేవా అని కావ్య తిడుతూనే ఉంటుంది. దాంతో రాజ్ నవ్వుతాడు. లోపల ఇంత ప్రేమ ఉండి నిన్న అలా ఎందుకు మాట్లాడారు. మీరు కూడా నన్ను ఇష్టపడ్డారు కాబట్టే ఇలా వచ్చారు. అరుస్తున్నారు. అధికారం ఉంటుంది. మీ కళ్లు చెబుతున్నాయండి నన్ను ప్రేమిస్తున్నారని అని రాజ్ అంటాడు.

కావ్య వెళ్లిపోతా అని వెళ్లి ఆగిపోతుంది. మా ఇంట్లోవాళ్లకోసం వచ్చాను. వాళ్లకోసమే ఇంటికి తీసుకెళ్తాను. వాళ్ల సంతోషం కోసమే వచ్చాను అని కావ్య అంటుంది. రాజ్ రానన్న కూడా బలవంతగా చేయి పట్టుకుని లాక్కెళ్తుంది కావ్య. అది చూసి రేవతి, జగదీష్ నవ్వుకుంటారు. దుగ్గిరాల ఇంటికి రాజ్‌ను తీసుకెళ్తుంది కావ్య. రాజ్‌ను చూసి అంతా సంతోషించిన ఇంట్లోవాళ్లు గాయం గురించి కంగారుగా అడుగుతారు.

కావ్య, రాజ్ కలుపుదల

రుద్రాణి పుల్లలు పెడుతుంటుంది. కావ్య చేసిన తప్పు వల్లే ఇలా జరిగింది. రాజ్ అఘాయిత్యం చేసుకున్నాడు అని రుద్రాణి అంటుంది. నా మీద నిందలు వేసేందుకునే, తప్పు పట్టేందుకేనా ఇలా చేశారు అని రాజ్‌ను అంటుంది కావ్య . అంతా రాజ్‌ను చెరో మాట అంటారు. మీ అందరి ప్రేమ చూస్తుంటే సంతోషంగానే ఉంది. కానీ, నేను ప్రేమించిన మనిషి కాదనే సరికి తట్టుకోలేకపోయాను అని రాజ్ అంటాడు.

ఇంతలో యామిని వచ్చి నిన్ను ప్రేమిస్తున్న మనిషిని వదిలేసి వెళ్లిపోవాలనుకున్నావా అని డైలాగ్‌లు కొడుతుంది. ఇలా ప్రాణం మీదకు తెచ్చుకుంటానంటే ఊరుకోను బావ. దానికి కారణం అయినవాళ్లను కూడా వదలను అని యామిని కావ్యకు వార్నింగ్ ఇస్తుంది. నువ్వెందుకు బావను రెజెక్ట్ చేశావో కారణం నాకు కావాలి. అది ఎంత పెద్దైన సరే నేను సాల్వ్ చేసి మీ ఇద్దరిని కలుపుతాను అని యామిని అంటుంది.

తర్వాత యామిని ఇంటికి రాజ్ వెళ్తాడు. అసలు కావ్యకు నీ మీద ప్రేమే లేదు బావ అని యామిని అంటుంది. ఉంది. నా మీద తనకు సముద్రమంతా ప్రేమ ఉంది తెలుసా. నన్ను రెజెక్ట్ చేయడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో కచ్చితంగా తెలుసుకుంటాను అని రాజ్ అంటాడు. అక్కిడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరకు కావ్య, రాజ్ కలిసి వెళ్ళడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. సుభాష్, ఇందిరాదేవి ప్రయత్నాలు ఫలించాయా? మరిన్ని ట్విస్టులు రాబోతున్నాయని సూచిస్తుంది ఈ ఎపిసోడ్.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.