
📌 Key Points
- కల్యాణ్ అప్పును దొంగలా బయటకు పంపించి, ప్రకాశం, ధాన్యలక్ష్మిలను అబద్ధాలతో ఏమార్చాడు.
- రాహుల్ అవార్డు ఫంక్షన్‌కు వెళ్లిన రాజ్, తన చేతి గడియారాన్ని కాస్ట్‌లీ గిఫ్ట్‌గా ఇచ్చాడు.
- రాజ్ ప్రోత్సాహం పేరుతో రాహుల్‌ను వాడుకోవాలని, తొక్కేయాలని అనుకుంటున్నట్లు రాహుల్ భావించాడు.
- కళావతి సమస్య పూర్తిగా తీరిపోయిందని, బిడ్డను కనగలదని రాజ్ ఇంట్లో శుభవార్త చెప్పాడు.
బ్రహ్మముడి డిసెంబర్ 15 ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. కల్యాణ్ అప్పును రహస్యంగా బయటకు పంపించి తల్లిని, ప్రకాశంను ఏమార్చాడు. రాహుల్‌కు రాజ్ కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చి ప్రోత్సహించాడు. కళావతి సమస్య పరిష్కారంతో ఇంట్లో సంతోషం నెలకొంది. ఈరోజు ఎపిసోడ్‌లో జరిగిన సంఘటనల పూర్తి వివరాలు.
కల్యాణ్ బాగోతం: అప్పును రహస్యంగా పంపించి తల్లిని ఏమార్చిన వైనం
బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 15 ఎపిసోడ్‌లో అప్పును ఇంట్లో ఎవరికి తెలియకుండా దొంగలా బయటకు పంపిస్తాడు కల్యాణ్. అది ప్రకాశం చూసి నిలదీస్తాడు. అప్పుకు జ్వరం అని నమ్మిస్తాడు. రాహుల్ అవార్డ్ ఫంక్షన్‌కు రాజ్, కావ్య వెళ్తారు. రాహుల్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇస్తాడు రాజ్. నిన్ను తొక్కేస్తానని రాహుల్ అనుకుంటాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కళావతి సమస్య పూర్తిగా తీరిపోయిందని రాజ్ చెబుతాడు. ఇంట్లో అంతా సంతోషిస్తారు. నెల రోజులు గురువు గారు చెప్పిన మందులు వాడితే కళావతి సంతోషంగా బిడ్డను కంటుందని చెప్పారని రాజ్ అంటాడు. రుద్రాణి నమ్మదు. దాంతో రిపోర్ట్స్ చూపిస్తాడు రాజ్. ఇక కళావతి ధైర్యంగా ఇంటి వారసుడిని ఇస్తుందని రాజ్ అంటాడు.
రాహుల్‌కు అవార్డ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారని స్వప్న చెబుతుంది. దాంతో ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పవేంట్రా అని కంగ్రాట్స్ చెబుతారు రాజ్, కావ్య. నువ్ అవార్డ్ తీసుకుంటుంటే మేము రాకుండా ఉంటామా అని కావ్య అంటుంది. మరోవైపు అప్పుతో నువ్వు ఒక్కదానివే ఎవరికి చెప్పకుండా వెళ్లు. నాకు వర్క్ ఉంది. కానీ, ఇంట్లో మ్యానేజ్ చేస్తాను. నువ్వు బెడ్ రూమ్‌లో ఉన్నట్లు మ్యానేజ్ చేస్తానని కల్యాణ్ అంటాడు.
రాహుల్‌కు రాజ్ కాస్ట్‌లీ గిఫ్ట్- ప్రోత్సాహంతో కూడిన హెచ్చరిక
కారులో అప్పును ఎక్కించి పంపిస్తాడు కల్యాణ్. అది ప్రకాశం చూస్తాడు. వీడేంటీ అప్పును దొంగలా కారులో ఎక్కిస్తున్నాడు. ఏమైందని అనుకుంటాడు. మరోవైపు ధాన్యలక్ష్మీ అప్పుకు జ్యూస్ ఇస్తానంటే కల్యాణ్ ఇస్తానంటాడు. అప్పు బెడ్ రూమ్‌లో ఉందంటాడు. తర్వాత బాత్రూమ్‌లో ఉందంటాడు కల్యాణ్. అది విన్న ప్రకాశం వీడేంటీ అబద్ధం చెబుతున్నాడనుకుంటాడు.
అప్పు ఇంట్లోనే ఉందని, నీకు మతిమరుపు అని, వెళ్లి చిలుక జోస్యం చెప్పించుకోమని కన్‌ఫ్యూజ్ చేస్తాడు కల్యాణ్. దాంతో ఇదేంటీ అప్పు ఇంట్లోనే ఉందా. జ్యూస్ గ్లాస్ తీసుకెళ్తున్నాడంటే ఇంట్లోనే ఉండి ఉంటుందని ప్రకాశం అనుకుంటాడు. తర్వాత రాహుల్ అవార్డ్ ఫంక్షన్‌కు రాజ్, కావ్య వెళ్తారు. రాహుల్ భలే ప్లాన్ చేశావురా అని రాజ్ అంటే.. కంగారుపడతాడు.
ఇదేరా బిజినెస్ బాగా ప్లాన్ చేసుకున్నావ్ అని రాజ్ మెచ్చుకుంటాడు. రాజ్ చేతికి ఉన్న వాచ్‌ను రాహుల్‌కు గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఎందుకు అని రాహుల్ డ్రామా చేస్తాడు. ఇలాగే ట్రై చేస్తే ఏదో ఒకరోజు నాకు ఈక్వల్‌గా మార్కెట్‌లో నిలబడతావ్. ఈ అవార్డ్స్ మన కష్టానికి గుర్తింపు అని రాజ్ ఎంకరేజ్ చేస్తాడు. నీతో ఈక్వల్‌గా కాదురా నిన్ను వాడుకుంటూ నీకన్నా బాగా ఎదుగుతాను. నువ్వు నిస్సహాయస్థితిలో చూస్తూ ఉండిపోతావ్ అని రాహుల్ మనసులో అనుకుంటాడు.
కళావతి సమస్యకు పరిష్కారం లభించిందా?
రాహుల్ తిండి, నిద్ర మానేసి కష్టపడేవాడు. కొత్త డిజైన్స్ చేయించేవాడు. రాహుల్ కష్టాన్ని మాటల్లో చెప్పలేను అని స్వప్న చెబుతుంది. నీలో వచ్చిన మార్పు ముందు ఈ అవార్డ్స్ చాలా చిన్నవి అని రాజ్ అంటాడు. ఇప్పుడేముందిరా అందరిముందు నీ పెళ్లాం వేసిన డిజైన్స్ నావి అని చెబుతుంటే అప్పుడు ఉంటుంది అసలైన షాక్ అని రాహుల్ అనుకుంటాడు.
రాహుల్‌కు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇస్తున్నట్లు ప్రకటించి డిజైన్స్ చూపిస్తారు. అవి చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
మొత్తంగా, బ్రహ్మముడి డిసెంబర్ 15 ఎపిసోడ్ కుటుంబ సంబంధాలు, రహస్యాలు, ప్రోత్సాహాలతో నిండి ఉంది. కల్యాణ్ మోసం, రాజ్ ఉదారత, కళావతికి శుభవార్తతో కథనం మరింత ఉత్కంఠగా మారింది. తదుపరి ఏం జరుగుతుందో చూడాలి.


