
📌 Key Points
- ఇందు ఆస్తి పేపర్లపై బలవంతంగా సంతకం చేయడంతో రేఖ బ్యాచ్ సంబరాలు. ఇది ప్లాన్ విజయమా?
- నందు ఊహించని ఎంట్రీతో రేఖ ప్లాన్‌కు భారీ బ్రేక్, కథలో సంచలన ట్విస్ట్ ఖాయం.
- రాజు, అపర్ణ కలిసి రేఖకు బుద్ధి చెప్పేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ వెనుక అసలు రహస్యం.
- వారసురాలిని అంటూ ఇందు నిజం చెప్పడంతో కథలో కొత్త మలుపు, ఉత్కంఠ రేపుతోంది.
తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ నుండి ఊహించని ట్విస్ట్! ఇందు ఆస్తి పేపర్లపై సంతకం చేయగా, నందు ఎంట్రీతో రేఖకు బిగ్ షాక్ తగిలింది. రాజు ప్లాన్ ఏంటి? ఈ ఎపిసోడ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి!
ఇందు ఆస్తి పేపర్లపై సంతకం: రేఖ ప్లాన్ సక్సెస్?
Brahmamudi Serial July 6 Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 6వ ఎపిసోడ్‌లో తన ప్లాన్ సక్సెస్ అయిందని రేఖ బ్యాచ్ సంతోషిస్తారు. ఇందుతో ఆస్తి రాయించుకునేందుకు స్కెచ్ వేసినట్లు రేఖ చెబుతుంది. ఆ మాటలు విన్న స్వాతి వెళ్లి ఇందుకు చెబుతుంది. ఇందుతో ఆస్తి రాయించుకుంటుంది రేఖ. అప్పుడే నందు ఎంట్రీ ఇస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజును ఎందుకు పంపించావని ఇందును నిలదీస్తుంది అపర్ణ. రాజుకు అపర్ణ కాల్ చేస్తే కలవదు. అపర్ణ ఫోన్ లాక్కుని రాజు తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారుగా. ఇక ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకూడదు అని ఇందు వెళ్లిపోతుంది.
అలా అయిపోయిందని రాజు అంటాడు. వదిన చాలా మంచిది. కానీ, అమ్మనాన్న ఎందుకో వదిలేయమంటున్నారు అని వెంకీ అంటాడు. ఆస్తులు ఉన్నవాళ్లకు శత్రువులు ఉంటారని ఆయన భయం. పోవాలని రాసి పెట్టి ఉంటే ఇలా కూడా పోతానుగా అని రాజు అంటాడు. నువ్వు ఏం చేసిన అమ్మ నాన్న పట్టించుకోలేదు. కానీ, ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పట్టించుకుంటున్నారు. ఏం చేసిన వాళ్లు బాధకుండా చేయన్నా అని వెంకీ సలహా ఇచ్చి వెళ్లిపోతాడు.
రాజుకు అపర్ణ కాల్ చేస్తుంది. సొంత అమ్మమ్మ అయితే ఇలా వెళ్లిపోయేవాడివా. పరాయిదానిలా చూశావు. మీరే నిర్ణయం తీసుకుని వెళ్లిపోయావని అపర్ణ అంటుంది. నీ మనవరాలే వెళ్లిపోమ్మందని రాజు అంటాడు. నీవల్లే ఇందు జీవితం బాగుపడింది. ఇప్పుడు నువ్వు వెళ్లి ఇందు జీవితాన్ని చీకటిమయం చేస్తావో లేదా తిరిగి వచ్చి వెలుగులు నింపుతావో నీ ఇష్టం అని అపర్ణ కాల్ కట్ చేస్తుంది.
నందు సడెన్ ఎంట్రీ: రేఖకు దిమ్మతిరిగే షాక్!
మీ అమ్మను మీ నాన్న ఇంట్లోంచి వెళ్లిపోమ్మనప్పుడు అదరలేదు బెదరలేదు. వాకిట్లో ఉండి పోరాటం చేసింది. మీ తాతయ్య వల్ల మళ్లీ ఇంట్లోకి వచ్చిందని తల్లి కావ్య గురించి చెబుతుంది అపర్ణ. ఇప్పుడు తల్లిదండ్రులు అన్నారని రాజును పంపించావ్. రేఖ అంటుందని మమ్మల్ని పంపించేస్తావా. ఇదేనా నువ్వు బంధానికి ఇచ్చే విలువ అని అపర్ణ అడుగుతుంది.
మీ మావయ్య కోపంలో నాలుగు మాటలు అంటే పంపుతావా. చేయాల్సింది అది కాదు. నీ భర్తతో నిలబడి మీ అత్తయ్య, మావయ్య మనసు మారేలా చేయాలి. నీ మీద నమ్మకం కలిగేలా చేయాలని అపర్ణ అంటుంది. నిజంగా పెళ్లి చేసుకుంటే అలాగే చేసేదాన్ని. కానీ, తను అద్దె మొగుడు అని ఇందు మనసులో అనుకుంటుంది. నా స్వార్థం కోసం రాజును వాళ్లకు దూరం చేయలేను. నేనే ఒంటరిగా పోరాడుతాను అని ఇందు అనేసి వెళ్లిపోతుంది.
అసలు నువ్వు అంటున్న గేమ్ ఏంటీ అని భ్రమరాంబ అంటుంది. రేఖ మీద ఉన్న పవర్ అంతా మనమీదకు తీసేసుకుంటాం. ఆస్తి మొత్తం ఇందుతో రాయించుకుంటాం అని రేఖ చెబుతుంది. ఆ మాటలు స్వాతి వింటుంది. ఎలా కుదురుతుందని, ఇందు భర్త సంతకం కూడా కావాలని లాయర్ అన్నారుగా అని భ్రమరాంబ అంటుంది.
రాజు, అపర్ణ ప్లాన్: కథలో బిగ్గెస్ట్ ట్విస్ట్!
అది తెలియకుండానే ప్లాన్ వేశాను అనుకున్నావా. ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుని మన సమస్యలకు స్వస్తి పలుకుతానని రేఖ అంటుంది. ఆ మాటలు విన్న స్వాతి వెళ్లి ఇందుతో కంగారుగా చెబుతుంది. ఆస్తి లాగేసుకునేందుకు రేఖ ఆంటీ ఏదో ప్లాన్ చేస్తుంది. ఇన్నిరోజులు రాజు ఉన్నాడు కాబట్టి ఏం చేయలేదు. రాజు బావ నీ బలం, ధైర్యం. నీకోసం ఏదైనా చేసే మంచి మనిషి. రాజు బావను పంపించి తప్పు చేశావ్. బావకు కాల్ చేసి రప్పించు అని స్వాతి అంటుంది.
నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే బావ అర్థం చేసుకుంటాడు. వెంటనే వస్తాడని స్వాతి అంటుంది. నేను ఫోన్ చేయలేనని. నాకోసం ఇబ్బంది పెట్టలేనని ఇందు చెబుతుంది. మరుసటి రోజు ఇందుతో ఆస్తి రాయించుకునేందుకు పేపర్స్‌పై సంతకం పెట్టమని పెన్ ఇస్తుంది రేఖ. ఇంతలో నందు ఎంట్రీ ఇస్తుంది.
ఎవరి ఆస్తి ఎవరు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నారు అని నందు అంటుంది. ఇందు ఇష్టంగానే పెడుతుంది. తను పెడితే సరిపోతుంది. నువ్వు కూడా పెట్టాలా ఏంటీ అని భ్రమరాంబ అంటుంది. అవును, చిన్నప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోయిన నందును నేనే. వారసురాలిగా నా సంతకం కూడా కావాలని నందు అంటుంది.
బ్రహ్మముడి సీరియల్ కథ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇందు, నందు, రేఖ, రాజు మధ్య జరిగే ఈ నాటకీయ పరిణామాలు ప్రేక్షకులను ఉత్కంఠగా ఉంచుతున్నాయి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి చూడండి!


