|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి జులై 26 ఎపిసోడ్: ఆవిరైన రేవతి ఆశలు- కూతురికి కరిగిపోయిన సుభాష్- మనవడిని అపర్ణ చూసేలా రాజ్ స్కెచ్

Published: 25-07-2025, 10:44 PM
బ్రహ్మముడి జులై 26 ఎపిసోడ్: ఆవిరైన రేవతి ఆశలు- కూతురికి కరిగిపోయిన సుభాష్- మనవడిని అపర్ణ చూసేలా రాజ్ స్కెచ్

బ్రహ్మముడి సీరియల్‌లోని ఈరోజు ఎపిసోడ్‌లో, రేవతి తన కుటుంబాన్ని కలవడానికి వస్తుంది. అయితే, అపర్ణ ఆమెను క్షమించే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సుభాష్ కూతురి ప్రేమతో కరిగిపోతాడు. రాజ్, అపర్ణ మనవడిని చూసేలా ప్రయత్నం చేస్తాడు.

రేవతి మరియు అపర్ణ మధ్య సంఘర్షణ

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రేవతి పుట్టింటికి వస్తే అపర్ణ కోప్పడుతుంది. కావాలనే ప్లాన్ చేసి నాటకం ఆడి వచ్చిందేమో. నేను ఆరోజే చెప్పాను నువ్ అడుగు పెట్టడం అంటే నేను చచ్చినరోజే. ఏంటీ చూస్తున్నావ్. నేను చచ్చాననుకుని వచ్చావా అని అంటుంది.

అత్తయ్య నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. ఆవిడ మీ కూతురు అని. నాకు ఆవిడ ఎవరో తెలియదు. అలాగే, నేను ఎవరో ఆమెకు తెలియదు. అందుకే నా మాట కాదనలేక వచ్చిందని కావ్య అంటుంది. అవును ఆంటీ మమ్మల్ని కాపాడిన ఆవిడను ఇలా అవమానించడం కరెక్ట్ కాదని స్వప్న అంటుంది. ఎప్పుడో జరిగిన గొడవకు ఇప్పుడు అవమానించడం ఏంటీ. మీ కూతురు అయితే ఇవాళ మంచిరోజున క్షమించవచ్చుగా అని కావ్య అంటుంది.

మరీ బాగుంది. ఆరోజు రేవతి ఏం చేసిందో తెలుసా అని చెబుతూ రెచ్చగొట్టేలా చేస్తుంది రుద్రాణి. ఇది తల్లీకూతుళ్లకు సంబంధించింది అని కావ్య అంటే మరు నీకేంటీ సంబంధం. నీకంటే రేవతి తెలియదు. కానీ, రేవతికి మాత్రం తెలుసుగా తను ఫోన్‌లో మాట్లాడింది తల్లితో అని. అప్పుడు నిజం చెప్పొచ్చుగా అని రుద్రాణి అంటుంది. వాళ్లిద్దరు విడిపోవాలని అనుకుంటున్నారా. మీకు విడగొట్టాలనే ఉన్నట్లుందని రాజ్ అంటాడు.

ఇందిరాదేవి కూడా రుద్రాణిని తిడుతుంది. రేవతి ఇన్నాళ్లుగా శిక్ష అనుభవిస్తూనే ఉంది. కావ్య తెలియకుండా చేసింది. ఇదంతా దేవుడు చేశాడనుకోవచ్చుగా. నువ్ ఒక్కదానివి క్షమిస్తే నీ కూతురు దగ్గరికి వచ్చి అంతా సంతోషంగా ఉండొచ్చు అని ఇందిరాదేవి అంటుంది. రేవతి గారిని క్షమించమని కావ్య అంటుంది. నెత్తినపెట్టుకున్నందుకు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావే అని అపర్ణ అంటుంది.

సుభాష్ యొక్క భావోద్వేగ ప్రయాణం

నువ్ నన్ను అర్థం చేసుకున్నావ్ అనుకున్నా. కానీ, నువ్ కూడా బాధపెట్టావే. కోడలివి అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను క్షమిస్తున్నాను. కానీ, దీన్ని మాత్రం ఎప్పటికీ క్షమించను. ఇన్నాళ్లుగా నేను అనుభవించిన బాధకు, నాన్న పడిన నరకానికి ఏం బదులిస్తావ్ అని అపర్ణ అంటుంది. అమ్మా నేను చేసింది తప్పే. ఇప్పటికీ తలుచుకుని బాధపడుతున్నాను. నేను తప్పు చేశానని రాలేదు. మీరు కూతురుగా నన్ను క్షమిస్తారని వచ్చాను. నా కొడుకుకు వాడి కుటుంబాన్ని ఇవ్వాలని వచ్చానని రేవతి అంటుంది.

నా ముద్దుల కూతురు తప్పు చేయలేదట. ఇప్పుడు దీన్ని క్షమించాలా అని అపర్ణ అంటుంది. ప్రకాశం, ధాన్యలక్ష్మీ నచ్చ జెప్పాలని చూస్తారు. కానీ, అపర్ణ మాట వినదు. దీన్ని ఎప్పటికీ క్షమించను. నువ్ కోరుకున్నది జరగదు. నువ్ నీ కొడుకు ఈ ఇంటికి సంబంధం లేకుండానే పెరుగుతాడు. ఒకవేళ వాడు అమ్మమ్మ గురించి అడిగితే అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పు. అప్పుడు నేను చాలా సంతోషపడతాను. వెళ్లు ఇక్కడి నుంచి అని కోపంగా అరుస్తుంది అపర్ణ.

దాంతో రేవతి, జగదీష్ బాధగా వెళ్లిపోతారు. రేవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జగదీష్ ఓదారుస్తాడు. తర్వాత రాత్రిపూట రేవతితో ఉన్న ఫొటో చూస్తూ బాధపడుతుంది అపర్ణ. సుభాష్ వచ్చి అడుగుతాడు. తప్పు చేశావేమో అనిపిస్తుంది. ఇన్నాళ్ల తర్వాత కూతురు వస్తే అవమానించి తప్పు చేశావ్ అని సుభాష్ అంటాడు. మనకు అలా ద్రోహం చేయొచ్చా అని అపర్ణ అంటుంది.

రాజ్ యొక్క ప్రణాళిక

ఇంట్లో అంతా మనం కలవాలని కోరుకున్నారు అని సుభాష్ అంటాడు. అసలు మీరు ఏమనుకుంటున్నారు అని అపర్ణ అడిగితే సుభాష్ సైలెంట్‌గా ఉంటాడు. మీ మౌనమే చెబుతుంది. మీకు కూడా కలవాలని ఉందని. మీరు కూతురి ప్రేమకు కరిగిపోయారని దాని పేదరికం చూడాలని లేకపోతే ఎన్నో కోట్లు అయినా ఇవ్వండి. కానీ, దాన్ని క్షమించాలని లేదు అని అపర్ణ అంటుంది. నీకు నిజంగా మన అమ్మాయి మీద ప్రేమ చచ్చిపోయిందా అని సుభాష్ అడుగుతాడు.

దాని ప్రేమ చంపుకోలేను. అది చేసిన ద్రోహం భరించలేను. ఈ బాధను మోయాల్సిందే అని అపర్ణ అంటుంది. మరోవైపు కావ్య, రాజ్‌ను ఇందిరాదేవి తిడుతుంది. నేను చేసింది అంతా వృథా చేశారు. తన కోపం మొత్తం తీర్చుకునేలా చేశారు. మళ్లీ అపర్ణ, రేవతిని కలవడం కుదురుతుందా అని అంటుంది. మాకోసం కాకపోయినా మా కొడుకు కోసం వచ్చామని జగదీష్ అంటాడు.

నాకు ఎదురుచూసే ఆశ లేదు. ఈరోజుతో తేలిపోయింది. ఇక బతికి ఉన్నంతకాలం ఈ బాధ పడాల్సిందే అని రేవతి అంటుంది. తర్వాత అపర్ణకు మనవడిని చూపిస్తే దగ్గరవుతుందని రాజ్ ప్లాన్ వేస్తాడు. గుడికి అపర్ణను రప్పించి తన ఫ్రెండే మనవడు అని తెలిసేలా ప్లాన్ చేస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరిగా, అపర్ణ తన నిర్ణయం గురించి ఆలోచిస్తుంది. రేవతి యొక్క భవిష్యత్తు మరియు కుటుంబ సమన్వయం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.