|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి నవంబర్ 10 ఎపిసోడ్: కుయిలిని చంపింది భర్త రంజిత్- నిరూపించిన రాజ్- కావ్య కోరికల బకెట్ లిస్ట్- చీకట్లో రాజ్ వంట

Published: 09-11-2025, 9:56 PM
బ్రహ్మముడి నవంబర్ 10 ఎపిసోడ్: కుయిలిని చంపింది భర్త రంజిత్- నిరూపించిన రాజ్- కావ్య కోరికల బకెట్ లిస్ట్- చీకట్లో రాజ్ వంట

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 10 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. రాజ్, కావ్యల తెలివితేటలతో కుయిలి హత్య కేసులో అసలు నిందితుడు రంజిత్ అని నిరూపితమైంది. రాహుల్ జైలు నుంచి విడుదలవ్వగా, రుద్రాణికి రంజిత్ షాక్ ఇచ్చాడు. కావ్య బకెట్ లిస్ట్, రాజ్ వంట ఆకట్టుకున్నాయి.

Key Points

1

రాజ్, కావ్య సీక్రెట్ కెమెరాతో రంజిత్ కుయిలిని చంపినట్టు నిరూపించారు.

2

రంజిత్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో రాహుల్ జైలు నుంచి విడుదలయ్యాడు.

4

కావ్య తన కోరికల బకెట్ లిస్ట్‌ను రాజ్ ముందుంచగా, అతను చీకట్లో వంట చేస్తాడు.

కుయిలి హంతకుడు రంజిత్: రాజ్, కావ్య ప్రూఫ్

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 10 ఎపిసోడ్‌లో కుయిలి ఇంటికి వెళ్లిన రాజ్, కావ్య సీక్రెట్ కెమెరాను తీసుకొస్తారు. రుద్రాణితో డీల్ మాట్లాడుతున్న రంజిత్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్సైకి వీడియో చూపిస్తారు. అందులో కుయిలిని కర్రతో కొట్టి చంపేస్తాడు రంజిత్. దాంతో రాహుల్‌ను జైలు నుంచి విడుదల చేస్తారు ఎస్సై.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పోలీస్ స్టేషన్‌లో ఉన్న రాహుల్ దగ్గరికి రుద్రాణి, స్వప్న వెళ్తారు. స్వప్న చీదరించుకుంటే నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్ము అని రాహుల్ అంటాడు. భార్య చెప్పింది విన్నావా, నీ తల్లి మాటే నమ్మి ఇక్కడికి తెచ్చుకున్నావ్ అని స్వప్న అంటుంది.

రేయ్ నువ్వు ఎవరి కాళ్లు పట్టుకోవట్లేదు. ఎంత ఖర్చు అయినా సరే నిన్ను బయటకు తీసుకొస్తాను అని రుద్రాణి అంటుంది. ఇది నీ తల్లి మానసిక స్థితి. అడ్డదారిలో వెళ్లి నిన్ను కాపాడుతానంటుంది. ఇక మీరు మారరు అని స్వప్న అంటుంది. వాడికి శిక్ష పడితే నువ్వు కూడా భర్త లేని ఆడదానిలా రోడ్డు మీద పడాల్సి వస్తుంది. కావాలంటే నువ్వు రహదారిలో బయటకు తీసుకురా అని రంజిత్‌కు కాల్ చేస్తూ వెళ్తుంది రుద్రాణి.

రాహుల్ విడుదల: రుద్రాణికి రంజిత్ షాక్

మరోవైపు కుయిలి ఇంటికి రాజ్, కావ్య చేరుకుంటారు. కుయిలి ఇంట్లో పోలీసులు ఉండటంతో ఆగిపోతారు. ఇంట్లో క్లూస్ మిస్ అవ్వకుండా ఉండేందుకు ఇలా పోలీసులను ఉంచుతారని రాజ్ అంటాడు. మరి ఇప్పుడు లోపలికి ఎలా వెళ్లడం అని కావ్య అంటే.. రాజ్‌కు కిటికి కనిపిస్తుంది. రాజ్ చిటికే వేస్తాడు. అంతే కట్ చేస్తే రాజ్, కావ్య కిటికీలో నుంచి దిగుతూ కుయిలి ఇంట్లో ఉంటారు.

ఈ ఒక్క సాక్ష్యం చాలు రాహుల్‍‌ను బయటకు తీసుకురావడానికి అని కావ్య అంటుంది. ఇద్దరు బయలుదేరుతారు. మరోవైపు పోలీస్ స్టేషన్ ఎదుట రుద్రాణిని రంజిత్ కలుస్తాడు. రెండు కోట్లు అడుగుతాడు. అంత డబ్బు లేదని, డబ్బు తీసుకుని మోసం చేస్తే రుద్రాణి డౌట్ పడుతుంది. ఇప్పుడు నన్ను నమ్మడం తప్పా ఇంకో ఆప్షన్ ఉందా అని రంజిత్ అంటాడు.

ఒక్కటి కాదు చాలా ఉన్నాయని రాజ్, కావ్య ఎంట్రీ ఇస్తారు. రాహుల్‌ను బయటకు తీసుకురాడానికి అసలు సాక్ష్యం ఉంది. మరి నిన్ను బయట పడేయడానికి ఏముంది అని రంజిత్‌కు ఆప్షన్స్ ఇస్తాడు రాజ్. కుయిలిని చంపింది రాహుల్ కాదు వీడు అని రుద్రాణికి చెబుతుంది కావ్య. అన్నీ పోలీసుల ముందే తేలుస్తాను అని రంజిత్‌ను పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్తాడు రాజ్ .

కావ్య కోరికల బకెట్ లిస్ట్: రాజ్ వంట

ఇప్పుడు అప్పు తీరాలంటే కోటి రూపాయలు కావాలి అని కుయిలి అంటుంది. డబ్బు వచ్చి సంతోషంగా ఉండాలిగా అన్న రంజిత్ రాహుల్ కొట్టిన వీడియోను కుయిలికి చూపిస్తాడు. ఇదేందుకు తీశావ్ అని కుయిలి అడుగుతుంది. డబ్బు వస్తుంది నీకు కాదు నాకు. నువ్వు ఇప్పుడు చచ్చిపోతే ఈ కేసును అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదిస్తా అని కుయిలిని కర్రతో కొట్టి చంపేస్తాడు రంజిత్ .

అదంతా చూసిన ఎస్సై షాక్ అవుతాడు. రాహుల్‌ను బయటకు వదిలి వీడిని లోపల వేయండని కానిస్టేబుల్‌కు చెబుతాడు ఎస్సై. రాహుల్ వచ్చి థ్యాంక్స్ చెబుతాడు. తప్పు చేయలేదు కాబట్టి బయటపడేశాం. తప్పు చేసిన ప్రతిసారి మాత్రం కాపాడలేమని రాజ్ అంటాడు. ఇకనైనా మారి మంచి భర్త, తండ్రిగా ఉండు అని కావ్య అంటుంది.

బ్రహ్మముడి తాజా ట్విస్టులు

అదేంటీ అత్త అలా అంటావ్. వరుసకు రాహుల్ బామ్మర్ది అయిన నాకు తమ్ముడిలాంటివాడే అని రాజ్ అంటాడు. తర్వాత ఇంట్లో అంతా రాహుల్‌ను తిడతారు. అంతకంతకు దిగజారుతూనే ఉన్నావ్ అని ఇందిరాదేవి అంటుంది. చేసిన తప్పును ఒప్పుకుని క్షమించమని అంటున్నాను. ఇక ఇంకో తప్పు చేయను అని రాహుల్ అంటాడు.

మీరు నన్ను తిట్టడంలో అర్థం ఉంది. అలా నేను చేసుకున్నాను. బంగారం లాంటి భార్యను కాదనుకున్నా. రాజ్, కావ్య వల్లే బయటపడ్డాను. కానీ, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చేతులెత్తి దండం పెడతాడు రాహుల్. క్షమించాల్సింది నీ భార్య. నీలో వచ్చిన మార్పును ఎలా చూపిస్తావో నువ్వే తేల్చుకో అని కావ్య అంటుంది.

ఈ ఎపిసోడ్‌లో రాజ్, కావ్యల సాహసం, రంజిత్ కుట్రలు, రుద్రాణి ఆశలు నిరాశల మధ్య బ్రహ్మముడి కథ మరింత ఆసక్తికరంగా మారింది. రానున్న ఎపిసోడ్‌లలో ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.