
బ్రహ్మముడి నవంబర్ 17 ఎపిసోడ్‌లో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. 20 లక్షల డబ్బు పోగొట్టుకున్న రాహుల్ గాయాలతో ఇంటికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దొంగతనంపై సుభాష్ సాక్ష్యం కీలక మలుపు తిప్పగా, స్వప్న కావ్యతో పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తుంది. రాహుల్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
Key Points
రాజ్ పంపిన 20 లక్షల డబ్బును రాహుల్ పోగొట్టుకుని దెబ్బలతో ఇంటికి వస్తాడు.
రాహుల్ టెండర్ ఆఫీస్‌కు వెళ్లలేదని ప్రకాశం చెప్పడంతో రాజ్ షాకవుతాడు.
సుభాష్ దొంగతనం జరిగిందని సాక్ష్యం చెప్పి రాహుల్‌ను నిర్దోషిగా నిరూపిస్తాడు.
స్వప్న తాను పడిన ఆవేదనను కావ్యతో పంచుకుని, ఆమెకు థ్యాంక్స్ చెబుతుంది.
రాహుల్ డబ్బు దొంగతనం, గాయాలతో ఇంటికి
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 17 ఎపిసోడ్‌లో రాహుల్‌కు 20 లక్షలు చెక్ ఇచ్చి డబ్బులు విత్ డ్రా చేసుకుని రమ్మని రాజ్ పంపిస్తాడు. కానీ, అక్కడ రాహుల్ నుంచి 20 లక్షల క్యాష్ బ్యాగ్ దొంగతనం చేస్తారు. టెండర్ ఆఫీస్‌కు వెళ్లడు. దాంతో ఇంట్లోవాళ్లు రాహుల్‌ను తప్పు బడతారు. రాహుల్ దెబ్బలతో ఇంటికి వస్తాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నాసిరకం చీర కట్టావేంటీ. అస్సలు బాగోలేదని ధాన్యలక్ష్మీ అంటుంది. నాకు బాగుంది. ఈ చీర రాహుల్ నాకు తెచ్చిన చీర అని స్వప్న చెబుతుంది. నా భర్త తన కష్టార్జితంతో తెచ్చిన చీర. అందుకే కట్టుకున్నా అని స్వప్న అంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి వేరే చీర కట్టుకోమని చెబుతాడు.
దానికి రాహుల్ ఎందుకు అని డౌట్ పడతారు. వాడే చేయాలి అని రాజ్ గట్టిగా చెబుతాడు. థ్యాంక్స్ చెబుతాడు రాహుల్. ప్రతి మనిషి మారడానికి అవకాశం ఇవ్వాలని కావ్య చెప్పిందని రాజ్ అంటాడు. ఎవరు డౌట్ పడకండి. రాహుల్ తనకు ఇచ్చిన పని పూర్తి చేస్తాడు అని కావ్య అంటుంది. టైమ్‌కు టెండర్ పూర్తి చేయాలి. లేకుంటో చాలా నష్టం వస్తుందని రాజ్ అంటాడు.
దొంగతనం నిజమని సుభాష్ సాక్ష్యం, స్వప్న పశ్చాత్తాపం
నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని రాహుల్ వెళ్తాడు. ప్రకాశం కూడా వెళ్లిపోతాడు. వేరే పని ఉందని సుభాష్ బయటకెళ్లిపోతాడు. కావ్య దగ్గరికి వెళ్లిన స్వప్న రాహుల్‌ను నమ్మి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతుంది. నా సమస్యను చిటికెలా తీర్చేశావ్. చెల్లివి అంటే నువ్వేనే అని స్వప్న అంటుంది. తాను ఇన్నిరోజులు పడిన ఆవేదన చెప్పుకుంటుంది స్వప్న .
రాహుల్ కిందపడిపోయి ఆగిపోతాడు. మరోవైపు కావ్య కోసం స్కూటీ తీసుకొస్తాడు రాజ్. బండి నడపాలని అన్నావ్‌గా పదా అని రాజ్ అంటాడు. నేను నడపాలనుకుంది స్కూటీ కాదు. బుల్లెట్ అని కావ్య అంటుంది. దానికి షాక్ అయిన రాజ్ అది నడపడం చాలా కష్టమని రాజ్ అంటాడు. మీరున్నారుగా నేర్పించడానికి అని కావ్య అంటుంది. దాంతో అంతా రాజ్‌ను నేర్పించమంటారు.
ఇంతలో రాజ్‌కు ప్రకాశం కాల్ చేసి రాహుల్ ఇంకా టెండర్ ఆఫీస్‌కు రాలేదని చెబుతాడు. దానికి షాక్ అయిన రాజ్ నేను చూసుకుంటానంటాడు. ఇంట్లో వాళ్లు అడిగితే.. రాహుల్ టెండర్ ఆఫీస్‌కు వెళ్లలేదని చెబుతాడు. అనుకుందే జరిగిందని ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవి మాటలు అంటారు. తొందరపడకండి అని కావ్య అంటుంది. రాహుల్‌ను నమ్మితే 20 లక్షలు పట్టుకుని మాయమయ్యాడు అని ఇందిరాదేవి అంటుంది.
కావ్య, రాజ్ మద్దతు: రాహుల్ మారతాడా?
అతి కష్టం మీద దొంగలను పట్టుకుని ఒక్క రూపాయి పోకుండా డబ్బు తిరిగి తీసుకొచ్చాను అని రాహుల్ అంటాడు. ఇది నమ్మేలా ఉందా అని ధాన్యలక్ష్మీ అంటుంది. నా దగ్గర మాత్రం సాక్ష్యం లేదని రాహుల్ అంటాడు. ఇదో కొత్తరకం నాటకం అయి ఉంటుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. నాటకం కాదు. నిజమే అని సుభాష్ ఎంట్రీ ఇస్తాడు. రాహుల్ చెప్పింది నిజమే అని, వాళ్లను రాహుల్ వెంబడించడం నేను చూశాను అని సుభాష్ సాక్ష్యం చెబుతాడు.
రాహుల్ వెంట దొంగలు పడింది, అది సుభాష్ చూసింది, దొంగల నుంచి రాహుల్‌ను సుభాష్ కాపాడింది అంతా చెబుతాడు. దాంతో ఇంట్లోవాళ్లు రాహుల్‌ను నమ్ముతారు. తర్వాత రాహుల్‌కు ఇంకో అవకాశం ఇవ్వాలి కదా అని కావ్య అంటుంది. రాహుల్‌కు అవకాశం ఇస్తే వాడుకునే టైప్ కాదు ఆడుకునే టైప్ అని రాజ్ అంటాడు.
బ్రహ్మముడి సీరియల్‌లో రాహుల్ దొంగతనం వ్యవహారం ఉత్కంఠను రేపింది. సుభాష్ సాక్ష్యంతో నిజం బయటపడగా, స్వప్న మార్పుతో కావ్య సంతోషిస్తుంది. రాజ్, కావ్యల మద్దతుతో రాహుల్ తన తప్పులను దిద్దుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.


