|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి నవంబర్ 6 ఎపిసోడ్: రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన కావ్య, రాజ్- కుయిలి హత్య- రాహుల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Published: 05-11-2025, 10:53 PM
బ్రహ్మముడి నవంబర్ 6 ఎపిసోడ్: రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన కావ్య, రాజ్- కుయిలి హత్య- రాహుల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

బ్రహ్మముడి నవంబర్ 6 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. కుయిలి పార్టీలో గోల్డ్ బాబుతో రెచ్చిపోయి డ్యాన్స్ చేయగా, రాహుల్ ఆగ్రహానికి గురయ్యాడు. రాజ్, కావ్య చాకచక్యంగా కుయిలి బాగోతాన్ని బయటపెట్టారు. నాటకీయ పరిణామాల మధ్య కుయిలి హత్య జరగడంతో పోలీసులు రాహుల్‌ను అరెస్ట్ చేశారు. ఈ మలుపు సీరియల్‌కు మరింత ఆసక్తిని పెంచింది.

Key Points

1

కుయిలి పార్టీలో గోల్డ్ బాబుతో రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంది.

2

రాహుల్ పీకల్లోతు తాగి అవమానంగా భావించి పడిపోతాడు.

4

కుయిలి హత్య తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రాహుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కుయిలి పార్టీలో డ్రామా

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్‌లో పార్టీలో కుయిలితో గోల్డ్ బాబు డ్యాన్స్ చేస్తాడు. రాహుల్‌ను పక్కన పెట్టడంతో పీకల్లోతూ తాగుతాడు. రాజ్, కావ్య కూడా డ్యాన్స్ చేయడంతో కుయిలికి అనుమానం వస్తుంది. కుయిలి బాగోతం బయటపెట్టి రాహుల్‌ను ఇంటికి తీసుకెళ్తారు. కానీ, పోలీసులు వచ్చి రాహుల్‌ను అరెస్ట్ చేస్తారు.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కుయిలి పార్టీ అరెంజ్ చేస్తుంది. గోల్డ్ బాబు, కుయిలి నాటీ అంటూ మాట్లాడుకుంటారు. పార్టీ సెటప్ అంతా బాగుంది. కానీ, ఒక్కటే తక్కువైంది. పార్టనర్. పార్టనర్ లేకుండా పార్టీ ఎలా ఎంజాయ్ చేసేది అని గోల్డ్ బాబు అంటాడు. దాంతో నేను ఉన్నాగా అని రాహుల్ ముందే గోల్డ్ బాబుతో డ్యాన్స్ చేస్తుంది కుయిలి.

గోల్డ్ బాబు డోస్ పెంచి నాకు ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గింది, నేను వెళ్లిపోతానంటూ గొడవ చేస్తాడు. మందు అయిపోయిందని కుయిలితో పెగ్ కలిపిస్తాడు. నాతో డ్యాన్స్ చేసేవాళ్లు లేరు అని గోల్డ్ బాబు అనడంతో నేనున్నాగా.. ఈ రాత్రంతా నీతోనే డ్యాన్స్ చేస్తానంటుంది కుయిలి. మరి నేను అని రాహుల్ అంటే పక్కకు తోసేస్తుంది కుయిలి. దాంతో రాజ్, కావ్య కుయిలి గురించి చెబుతారు.

రాజ్, కావ్యల ప్లాన్

మా అక్క ఏరోజు అయిన ఇలా ఇంకొకరి ముందు అవమానించిందా అని స్వప్న అంటే.. నీకన్నా కోటీశ్వరుడు దొరికేసరికి కుయిలి ప్లేట్ మార్చింది. కుయిలి నిజంగా కోటీశ్వరరాలు అయితే వాడి డబ్బులు ఇన్వెస్ట్ చేయించడానికి ఇదంతా ఎందుకు చేస్తుందని రాజ్ అంటాడు. దాంతో రాహుల్ కోపంగా వెళ్లి మందు తాగుతుంటాడు. గోల్డ్ బాబు వచ్చి పెగ్ కలపమంటే కలపడు.

దాంతో తేరుకున్న రాజ్, కావ్య ముసలివాళ్లలా మళ్లీ నటిస్తారు. రాహుల్ తాగి పడిపోతాడు. గోల్డ్ బాబు అడిగేసరికి హగ్ ఇచ్చి వెళ్లిపోతుంది కుయిలి. తర్వాత గోల్డ్ బాబు మందు నిజంగానే తాగినట్లు చెతాడు. వెళ్లి రాహుల్ మీదే పడుకుంటాడు గోల్డ్ బాబు. జరిగింది తల్చుకుని కావ్య, రాజ్ నవ్వుకుంటారు. కావ్య నవ్వడం చూసి నిన్ను ఇలా చూసి చాలా రోజులు అయిందని రాజ్ అంటాడు.

ఒకరినొకరు మెచ్చుకుంటారు. తర్వాత ఇద్దరు గొడవపడతారు. మొన్నే కదా మీకన్నా నేను ప్రేమగా చూపించలేను అని. అంతలోనే ప్లేట్ మార్చావా అని రాజ్ అంటాడు. మీరు కూడా ఆడవాళ్లలా ఇంకో ఇంటికి కోడలిగా వెళ్తే తెలుస్తుంది అని వాదిస్తుంది కావ్య. ఈ ఒక్కసారికి క్షమించవే అని రాజ్ ప్రాధేయపడతాడు. దాంతో కావ్య క్షమించి కావాలనే ఆడుకున్నట్లుగా నవ్వుతుంది.

రాహుల్ అరెస్ట్, కుయిలి హత్య

గోల్డ్ బాబు వెళ్లి కుయిలి పక్కన బెడ్ మీద పడుకుంటాడు. కుయిలి చేతిని తనపై పెట్టుకుని పడుకుంటాడు. రాహుల్‌ను రాజ్, కావ్య లేపుతారు. కుయిలి గదిలో గోల్డ్ బాబును చూసినట్లు చెబుతాడు రాజ్. మీరు అబద్ధం చెబుతున్నారు. మీరు చెప్పారని కాదు నాకు నిద్రొస్తుంది. నేను వెళ్లి కుయిలి గదిలో పడుకుంటాను అని రాహుల్ వెళ్తాడు. రాహుల్ వెళ్లి చూసేసరికి గోల్డ్ బాబు, కుయిలి హగ్ చేసుకుని పడుకుంటారు.

రాహుల్ షాక్ అయి అరుస్తాడు. దాంతో కుయిలి లేచి షాక్ అవుతుంది. ఇదంతా ఏంటీ అని అరుస్తుంది. నిద్ర లేచిన గోల్డ్ బాబు రాత్రి తాగిన మత్తులో ఇదంతా జరిగిపోయింది. చూసి చూడనట్లు వదిలేయాలి అని అంటాడు. అసలు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు అని కుయిలి అంటుంది. గుర్తు లేనిదే వాడు నీ మంచంపై ఛీ ఛీ.. అని రాహుల్ అంటాడు.

నేను ఇదంతా చెప్పలేదు రాహుల్ అని కుయిలి అంటుంది. నాతో కూడా ఇదే చెప్పింది. అందుకే కమిట్ అయ్యా. అంటే కాదనలేకపోయిందనుకో అని గోల్డ్ బాబు అంటాడు. ఇక ఇది వద్దు దీనితో సావాసం వద్దు. దీనికి మన ఆస్తిలో చిల్లిగవ్వ ఇచ్చేది లేదు. మేము ఒప్పుకోము అని కావ్య అంటుంది. రాహుల్ అనుమానంగా చూస్తుంటాడు.

మొత్తంగా, బ్రహ్మముడి నవంబర్ 6 ఎపిసోడ్ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచింది. కుయిలి హత్య, రాహుల్ అరెస్ట్ వంటి సంచలన సంఘటనలు సీరియల్ కథనానికి కొత్త మలుపునిచ్చాయి. తదుపరి ఎపిసోడ్‌లో ఏమి జరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.