|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి ప్రోమో: కావ్య భర్త ఎవరో తెలుసుకున్న రామ్- రుద్రాణికి షాక్ ఇచ్చిన అపర్ణ- బెడిసికొట్టిన యామిని ప్లాన్

Published: 23-08-2025, 11:11 PM
బ్రహ్మముడి ప్రోమో: కావ్య భర్త ఎవరో తెలుసుకున్న రామ్- రుద్రాణికి షాక్ ఇచ్చిన అపర్ణ- బెడిసికొట్టిన యామిని ప్లాన్

బ్రహ్మముడి సీరియల్ తాజా ప్రోమోలో ఆసక్తికరమైన ట్విస్టులు కనిపిస్తున్నాయి. రాజ్ మద్యం సేవనం, కావ్య ప్రతిస్పందన, అపర్ణ వెల్లడించిన రహస్యం మరియు యామిని ప్లాన్‌లో చిక్కులు కథను ఉత్కంఠభరితం చేస్తున్నాయి.

Key Points

1

రాజ్‌కు యామిని మందు అలవాటు చేస్తుంది.

2

కావ్య రోడ్డున పడి ఉన్న రాజ్‌ను ఇంటికి తీసుకువెళుతుంది.

4

రుద్రాణి యామిని ప్లాన్ బెడిసికొట్టినట్లు భావిస్తుంది.

రాజ్ మద్యపానం

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్‌కు యామిని మందు అలవాటు చేస్తుంది. నీ బాధ పోడానికి ఇదే సరైన మందు అని చెబుతుంది. దాంతో మందుకు బానిస అవుతాడు రాజ్ . పీకల్లోతు తాగి రోడ్డుపై అందరితో గొడవ పెట్టుకుంటాడు.

అక్కడే చెప్పులను దిండు చేసుకుని రాజ్ పడుకుంటాడు. అటుగా కారులో వెళ్తున్న కావ్య రోడ్డు మీద ఎవరో పడుకున్నారని, బుద్ధి చెప్పాలనుకుంటుంది. కానీ, అది రాజ్ అని తెలిసి షాక్ అవుతాడు. నన్నెందుకు ఇంత మోసం చేశారని కావ్య నిలదీసి అలాగే, అక్కడ రోడ్డుమీదే పడుకుంటాడు.

దాంతో రాజ్‌ను కావ్య కారులో తీసుకెళ్తుంది. భర్తని ఒడిలో కూర్చెబెట్టుకుని ఇంటికి తీసుకెళ్తుంది కావ్య. ఇంటికి రాజ్‌ను తీసుకురావడం చూసి ఇంట్లోవాళ్లంతా షాక్ అవుతారు. ఏమైందని అడుగుతారు. దాంతో రాజ్ చేసింది, తాగింది అంతా కావ్య చెబుతుంది. అపర్ణ, సుభాష్ ఇద్దరు కుమిలిపోతారు. ఏనాడు తాగని నా కొడుకు ఇలా తూలడం ఏంటండి అని కన్నీళ్లు పెట్టుకుంటారు.

కావ్య చర్యలు

రాజ్ కోసం యామిని ఇంటికి వస్తుంది. నానా రభస చేసి కావ్యను నిందించి రాజ్‌ను తీసుకెళ్లిపోతుంది యామిని. యామిని ఇంట్లో రాజ్ మెట్లపై తాగి స్పృహ లేకుండా తాగుబోతులా పడిపోతాడు. మరోవైపు కావ్యను రుద్రాణి నిందిస్తుంది. ఇదంతా నీవల్లే జరిగిందని సూటిపోటి మాటలు అంటుంది.

అదంతా చేసింది కావ్య కాదు నువ్వు. రాజ్‌కు నువ్ నిజం చెప్పడం వల్లే వాడు ఇలా అయిపోయాడని ఇందిరాదేవి అంటుంది. ఇక యామిని ఇంట్లో రాజ్ ఉండకూడదు. వీలైనంత త్వరగా రాజ్‌‌ను వాళ్ల దగ్గరి నుంచి తీసుకురావాలి. ఏం చేసైనా వాడికి నచ్చజెప్పుకుంటాను. వాడి మనసు మార్చి వాన్ని మళ్లీ దారిలోకి తెచ్చుకుంటాను అని అపర్ణ అంటుంది.

ఆ దేవుడు మీద బారం వేసి కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేరా అని రామ్‌కు నిజం చెప్పేస్తాను అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య, రుద్రాణి షాక్ అవుతారు. కావ్యకు రాజ్ దూరంగా ఉండి ఆస్తి దక్కుతుందని ప్లాన్ వేసి రాజ్‌కు నిజం చెప్పిన రుద్రాణికి అపర్ణ పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్లు అవుతుంది.

అపర్ణ రహస్యం

అపర్ణ ఎక్కడ రాజ్‌కు నిజం చెబుతుందో అని భయపడిన రుద్రాణి వెంటనే యామినికి కాల్ చేసి జరిగింది చెబుతుంది. నువ్వెందుకు రాజ్‌కు తాగడం నేర్పించావ్. ఇప్పుడు రాజ్‌ను చూసి తట్టుకోలేక నిజం చెబుతామంటున్నారు. అప్పుడు నీ సంగతి బయటపడిపోతుంది. నీ ప్లాన్ బెడిసికొట్టినట్లు అయింది. వెంటనే ఏదోటి చేయు అని రుద్రాణి అంటుంది.

దాంతో రాజ్ దగ్గరికి వెళ్లి కావ్య గురించి మరింత రెచ్చగొట్టి చెబుతుంది యామిని. అది విని తట్టుకోలేని రాజ్ దుగ్గిరాల ఇంటికి యామినితో కలిసి వస్తాడు. కళావతి అంటూ గట్టిగా అరుస్తాడు. అంతా హాల్లోకి వస్తాడు. నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు. అసలు ఎవరితో తిరిగి అని రాజ్ అంటుంటే వెంటనే అపర్ణ ఒక్కటి లాగిపెట్టి కొడుతుంది.

కావ్య నువ్ తాళి కట్టిన భార్యరా. కావ్య కడుపులో బిడ్డకు తండ్రివి నువ్వే. నన్ను అమ్మ అని పిలవడం కాదురా.. నేను నీ కన్నతల్లిని అని రాజ్‌కు నిజం చెప్పేస్తుంది అపర్ణ. దాంతో అంతా షాక్ అవుతారు. యామినికి బిత్తరపోతుంది. కావ్యను ఇంకా ఇరికిద్దామని తీసుకొస్తే ఇలా రివర్స్ అయిందేంటి అని యామిని అనుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

అపర్ణ నిజం బయటపెట్టడంతో కుటుంబంలో తీవ్ర సంక్షోభం ఏర్పడుతుంది. యామిని ప్లాన్ విఫలమై ఆమె భవిష్యత్తు అనిశ్చితంగా మారుతుంది. కావ్య, రామ్ మరియు రుద్రాణి జీవితాలలో కొత్త మలుపులు రానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.