
బ్రహ్మముడి సీరియల్‌కు సంబంధించిన తాజా ప్రోమోలో రేవతి గుట్టు బయటపడుతుంది. రుద్రాణి చేసిన పన్నాగం, అపర్ణ, రాజ్ మరియు కావ్యల ప్రతిచర్యలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ప్రోమోలో చూపించిన సంఘటనలు సీరియల్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి.
Key Points
రుద్రాణి రేవతిని బయటపెట్టేందుకు పార్టీలో ఆట ఆడుతుంది.
రేవతిని కూతురుగా అంగీకరించడంపై అపర్ణ, రుద్రాణి మధ్య ఘర్షణ.
రాజ్, కావ్య రేవతిని రక్షించేందుకు ప్రయత్నిస్తారు.
అపర్ణ కోపంతో రుద్రాణిని ప్రశ్నిస్తుంది.
రుద్రాణి యొక్క కుట్ర
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రేవతి ముసుగు తీయించి ఎలాగైన బయటపెట్టాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. అందుకోసం పార్టీ పేరు చెప్పి వాడుకుంటుంది. ప్రతి ఒక్కరు డబ్బాలోని చిట్టీ తీసి అందులో ఏది ఉంటే అది చేయాలని, లేకుంటే తాను శిక్షిస్తానని రుద్రాణి చెబుతుంది. దానికి ప్రకాశం, సుభాష్ కౌంటర్స్ వేస్తారు.
తర్వాత రుద్రాణి తండ్రి సీతారామయ్యతో గేమ్ స్టార్ట్ చేస్తుంది. సీతారామయ్యకు డైలాగ్ వస్తే.. ఇద్దరు ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పి ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు సీతారామయ్య. ఆ తర్వాత భార్య అలక తీర్చే భర్తగా స్వప్న, రాహుల్ డ్యాన్స్ చేస్తారు. వీరిలాగే, అప్పు-కల్యాణ్, ప్రకాశం-ధాన్యలక్ష్మీ, సుభాష్-అపర్ణ డ్యాన్స్ చేస్తారు.
రాజ్, కావ్య కూడా సంతోషంగా రొమాంటిక్‌గా డ్యాన్స్ చేసి అలరిస్తారు. ఇక చివరిగా మిగిలింది గెస్ట్ రాధగారే అని రేవతికి డబ్బా ఇస్తుంది. అందలో నుంచి రేవతి ఓ చిట్టీ తీస్తే డ్యాన్స్ వస్తుంది. దానికి రేవతి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. నువ్వేం ఇబ్బందిపడకు, ఇది నీ ఇల్లే అనుకో. కావాలంటే నీకు సపోర్టింగ్‌గా నేను కూడా డ్యాన్స్ చేస్తాను అని రుద్రాణి అంటుంది.
దాంతో మధ్యలో రేవతి నిల్చుంటుంది. రేవతి చుట్టూ రుద్రాణి డ్యాన్స్ చేస్తూ చేస్తూ సడెన్‌గా రేవతి మొహంపై ఉన్న పరదా తీసేస్తుంది. దాంతో అందరికి రేవతి కనిపిస్తుంది. రేవతిని చూసి సీతారామయ్య ఇంటిల్లిపాది షాక్ అవుతారు. రేవతి నువ్వేంటీ ఇక్కడ. అసలు ఇక్కడ ఏం చేస్తున్నావ్. స్వరాజ్ తల్లిగా నువ్వెందుకు వచ్చావ్. అంటే, స్వరాజ్ నీ కొడుకేనా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది రుద్రాణి.
అపర్ణ మరియు రుద్రాణి మధ్య ఘర్షణ
రేవతికి సమాధానం ఇచ్చే గ్యాప్ కూడా ఇవ్వకుండా అపర్ణకు కోపం తెప్పించేలా మాట్లాడుతుంది రుద్రాణి. దాంతో రుద్రాణిని అడ్డుకున్న రాజ్ ఇందులో తన తప్పేం లేదంటాడు. తానే ఇలా ప్లాన్ చేసి అక్కను తీసుకొచ్చినట్లు చెబుతాడు. దానికి అవును అత్తయ్య, వదినా మీకు దూరంగా ఉంటూ నరకం చూస్తుంది. ఇలాగైనా మీతో పండుగ పూట కాసేపు గడపుతుందని ఆయన ఇలా చేశారని భర్తకు సపోర్ట్ చేస్తుంది కావ్య .
ఓహో ఇది మీ ఇద్దరి పనా అని అపర్ణ అంటుంది. అవును మమ్మీ. అక్క ఎవరు లేనివాళ్లలా దూరంగా బతుకుతోంది. ఇంతమంది ఉండి అక్కను అలా ఒంటరిగా వదిలేయాలా. అలా వదలడం నాకు ఇష్టం లేదు అని రాజ్ గట్టిగా చెబుతాడు. దాంతో ముసుగు వేసుకుని వదినను మోసం చేసిన కూడా మీ అక్కను క్షమించమని అంటున్నావా రాజ్ అని అపర్ణ కోప్పడేలా మాట్లాడుతుంది.
కానీ, అపర్ణ మాత్రం పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. రేవతిని నేను ముందే చూశాను అని అపర్ణ చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మరి ముందే తెలిసి ఎందుకు బయటపెట్టలేదు అని రుద్రాణి అంటుంది. అత్తయ్య, కావ్య, కల్యాణ్, మావయ్య అందరితో రేవతి మాట్లాడేటప్పుడే నేను తన మొహం చూశాను. మమ్మల్ని నా కూతురు ఎంత మిస్ అవుతుందో అర్థం చేసుకుని కనీసం ఇలా అయిన తనకు సంతోషాన్ని ఇవ్వాలనుకున్నాను అని అపర్ణ చెబుతుంది.
రాజ్ మరియు కావ్య ప్రతిస్పందన
తన ముసుగు తీయకుంటే మాతో గడిపి, తన కొడుకుకు అమ్మమ్మ ప్రేమ చూపించి తీసుకెళ్లిపోతుంది. అది అక్కడితో ముగుస్తుంది. అందుకే చెప్పలేదు అని అపర్ణ అంటుంది. అలా కూతురు మీద తల్లి ప్రేమ బయటపడుతుంది. ఇంత ప్రేమ దాచుకుని ఇంకా ఎందుకమ్మా అక్క మీద కోపం. ఇంటికి కూతురిలా అంగీకరించు అని రాజ్ నచ్చజెపుతాడు.
సుభాష్, ప్రకాశం, సీతారామయ్య, ఇందిరాదేవి, ధాన్యలక్ష్మీ అంతా కూడా రేవతికి సపోర్టింగ్‌గా మాట్లాడుతారు. దాంతో కన్నతల్లి మనసు కరిగి రేవతిని కూతురిగా అంగీకరిస్తుంది అపర్ణ. ఇక తల్లిని మనసారా కౌగిలించుకుంటుంది రేవతి. అదంతా చూసి తట్టుకోలేకపోతుంది రుద్రాణి. ముసుగు తీసి రేవతిని ఛీ కొట్టించి బయటకు పంపించాని స్కెచ్ వేస్తే ఇలా బెడిసికొట్టిందేంటని ఉక్రోశంతో ఊగిపోతుంది రుద్రాణి.
ఇంతలో రాహుల్ వచ్చి రేవతి అక్కను బయటకు పంపిస్తానని చెప్పి ఇంట్లోకి వచ్చేలా చేశావ్. రేపు కావ్య, అప్పుకు పిల్లలు పుడితే వాళ్లే వారసుల్లా పెరుగుతారు అని రాహుల్ అంటాడు. అది మాత్రం జరగనివ్వను. అనుకుంది ఏది జరగలేదు కాబట్టి ఇక మన టార్గెట్ కావ్య, అప్పునే. వాళ్ల కడుపు పోగొట్టేలా చేసి నీ కూతురినే ఇంటి వారసురాలిగా చేస్తాను అని రుద్రాణి అంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
చివరగా రేవతి వ్యక్తిత్వం బయటపడిన తర్వాత కుటుంబంలో తలెత్తిన సంక్షోభం, ప్రతి ఒక్కరి ప్రతిస్పందనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ట్విస్ట్ తో సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతుంది.


