
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో రాజ్ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. కావ్య అబార్షన్ చేయించుకోనని పట్టుబట్టడంతో, రాజ్ జ్యూస్‌లో అబార్షన్ ట్యాబ్లెట్ కలపాలని ప్లాన్ చేశాడు. ఈ పరిణామం కుటుంబ సభ్యులను షాక్‌కు గురి చేసింది. కల్యాణ్ ఆపలేకపోయాడు.
Key Points
బ్రహ్మముడి ప్రోమోలో రాజ్, కావ్య గర్భాన్ని తొలగించాలని ప్లాన్ చేశాడు.
కావ్య తాగే జ్యూస్‌లో అబార్షన్ ట్యాబ్లెట్ కలపాలని రాజ్ నిర్ణయించుకున్నాడు.
రాజ్ నిర్ణయాన్ని అపర్ణ, సుభాష్, ధాన్యలక్ష్మీ సహా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు.
తన బిడ్డను కాపాడుకోవడానికి కావ్య ఎవరి మాట వినకుండా పట్టుదలగా నిలబడింది.
రాజ్ నీచపు ప్లాన్: కావ్య అబార్షన్ కోసం
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో అబార్షన్ చేయకుంటే కావ్య చనిపోతుందన్న నిజాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పినట్లుగా కల కంటాడు రాజ్. నిజం చెబితే కావ్య ఒప్పుకోదని, తనకు ఏమైనా జరుగుతుందనే రాజ్ భయపడతాడు. మరోవైపు అంతా రాజ్‌ను నిందిస్తుంటారు.
కావ్యను ఎందుకు అబార్షన్ చేసుకోమంటున్నావని, పిల్లల సంగతి తాము చూసుకుంటామని, ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నావని అపర్ణ, సుభాష్, ధాన్యలక్ష్మీ నానా మాటలు అంటారు. ఇదే సమయం అనుకుని రాజ్‌ను నెగెటివ్ చేసి తాను మంచి పేరు తెచ్చుకోవాలని రాహుల్ కూడా డ్రామా చేస్తాడు.
నువ్వు కావ్యకు క్షమాపణలు చెప్పాలి. బిడ్డ ప్రాణం తీసే హక్కు మనకు లేదు అంటూ డైలాగ్స్ కొడతాడు రాహుల్. నేనేమైనా సమస్యల్లో ఉన్నానని చెప్పానా నీకు. నేను ఏం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉందని రాహుల్‌కు కౌంటర్ ఇస్తాడు రాజ్. ఏది ఏమైనా కళావతి అబార్షన్ చేయించుకోవాల్సిందే అని మొండిపట్టు పడతాడు రాజ్.
జ్యూస్‌లో అబార్షన్ ట్యాబ్లెట్ కలిపిన రాజ్
కావ్య కూడా రాజ్ మాట వినదు. నేను తల్లిని. నాకు కూడా హక్కు ఉంది. నేను నా బిడ్డను ఏమాత్రం చంపుకోను అని కావ్య అంటుంది. అయితే, నీకు నేను కావాలో ఆ బిడ్డ కావాలో తేల్చుకో అని గట్టిగా చెబుతాడు రాజ్. అయినా కూడా కావ్య వినదు. నేను కూడా చెబుతున్నాను వినండి. నాకు నా బిడ్డే ముఖ్యం. నా బిడ్డను ఏ ఒక్కరి కోసం చంపుకోను. ఆఖరికి ఆ దేవుడు వచ్చి చెప్పిన అబార్షన్ చేయించుకోను అని కావ్య ధీటుగా చెబుతుంది.
నేను చెప్పిన వినవు కదా. అయితే నాకు కూడా నువ్వు అవసరం లేదు. ఇన్నాళ్లు నాకోసం పరితపించిన నీకు ఈ బిడ్డ ఇప్పుడు ఎక్కువైనప్పుడు నేను నీకు దూరంగా ఉండటమే కరెక్ట్ అని రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. రాజ్ మాటలకు అంతా షాక్ అవుతారు. మళ్లీ కావ్య జీవితం మొదటికి వచ్చిందని అపర్ణ వాళ్లు బాధపడుతుంటారు.
కావ్య బంధం ఇలా ముక్కలైంది ఏంటని, రాజ్ ఎందుకు అలా ప్రవరిస్తున్నాడని ఫీల్ అవుతుంటారు ఇంట్లోవాళ్లు. తనను పణంగా పెట్టి బ్లాక్ మెయిల్ చేసిన కూడా కావ్య వినకపోవడంపై రాజ్ అసహనంగా ఉంటాడు. ఏం చేసి కావ్యను బతికించుకోవాలని ఆలోచిస్తుంటాడు. కావ్యకు చెప్పకుండా అబార్షన్ చేయడమే మంచిది, కానీ, అలా ఎలా చేయాలని అనుకుంటాడు రాజ్.
కుటుంబం ఆందోళన, కల్యాణ్ నిస్సహాయత
అప్పుడే రాజ్‌కు అబార్షన్ ట్యాబ్లెట్ ఐడియా వస్తుంది. కావ్య తాగే జ్యూస్‌లో అబార్షన్ ట్యాబ్లెట్స్ కలిపితే బిడ్డ చనిపోతుందని అలా చేయాలని అనుకుంటాడు రాజ్. కావ్య కోసం పనిమనిషి రత్తాలు జ్యూస్ తయారు చేస్తుంటుంది. అక్కడికి వెళ్లిన రాజ్ తన భార్య కోసం తానే జ్యూస్ కలిపిస్తానంటాడు. దాంతో రత్తాలు వెళ్లిపోతుంది. కావ్య తాగే జ్యూస్‌లో అబార్షన్ ట్యాబ్లెట్స్ కలుపుతుంటాడు రాజ్.
అదంతా కల్యాణ్ చూస్తుంటాడు. అబార్షన్ ట్యాబ్లెట్స్ కలిపిన జ్యూస్‌ను కావ్య దగ్గరికి తీసుకెళ్లి ఇస్తాడు రాజ్. నేను అడిగింది పనిమనిషిని అయితే తమరు తీసుకొచ్చారు ఏంటీ అని కావ్య అంటుంది. ఎవరిని అడిగితే ఏంటీ. ఏ.. నేను తీసుకురాకూడదా. నేను జ్యూస్ ఇవ్వకూడదా అని రాజ్ అంటాడు. దాంతో కావ్య ఆ జ్యూస్ తీసుకుని తాగుతుంది.
అయితే, తన అన్నయ్య మోసం చేసి అబార్షన్ చేయించడం నచ్చని కల్యాణ్ కావ్య జ్యూస్ తాగడాన్ని ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ, కల్యాణ్ వచ్చేలోపే కావ్య జ్యూస్ తాగేస్తుంది. దాంతో కల్యాణ్ ఆపలేకపోతాడు. కావ్య జ్యూస్ తాగడం చూసి ఎంత పని చేశావ్ అన్నయ్య, అబార్షన్ కోసం ఇంత నీచంగా చేస్తావా అన్నట్లుగా రాజ్‌ను కల్యాణ్ చూస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
రాజ్, కావ్యల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. కావ్య గర్భంపై రాజ్ తీసుకున్న ఈ నిర్ణయం సీరియల్‌లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి. ఈ పరిణామం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.


