|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడిలో దారుణం: కావ్య బిడ్డకు ముప్పు! రుద్రాణి, రేఖల భయంకర ప్లాన్ ఇదే!

Published: 29-12-2025, 10:32 PM
బ్రహ్మముడిలో దారుణం: కావ్య బిడ్డకు ముప్పు! రుద్రాణి, రేఖల భయంకర ప్లాన్ ఇదే!
  • రాజ్ కావ్యపై ప్రేమ చూపడం చూసి రేఖ తీవ్ర అసూయకు లోనయ్యింది.
  • రాజ్ రేఖ డిప్రెషన్ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఆమెతో మాట్లాడాడు.
  • ఇందిరాదేవి కావ్య ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపింది, ఆమె ఆహారం, మందుల గురించి ఆరా తీసింది.
  • రుద్రాణి, రేఖలు కలిసి కావ్య కడుపులోని బిడ్డ చనిపోయేలా కషాయంలో పసరు కలిపే కుట్ర పన్నారు.

బ్రహ్మముడి డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో ఉత్కంఠత పెరిగింది. రాజ్, కావ్యల మధ్య ప్రేమ, రేఖ అసూయ నాటకీయతను సృష్టించాయి. అయితే, రుద్రాణి, రేఖలు కావ్య కడుపులోని బిడ్డకు హాని కలిగించే భయంకరమైన కుట్రకు పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

రాజ్, రేఖల మధ్య అనుబంధం

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో కావ్య మీద రాజ్ చూపించే ప్రేమను చూసి ఓర్వలేకపోతుంది రేఖ. వెళ్లి మందు తాగుతుంటే రాహుల్ తిడుతుంటాడు. రాజ్ వెళ్లి అడిగితే రేఖ బ్రేకప్ గురించి చెబుతాడు రాహుల్. దాంతో రేఖపై రాజ్ కన్సర్న్ చూపిస్తాడు. అంతా కావ్యపై ప్రేమ చూపిస్తుంటే సహించలేకపోతుంది రేఖ.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ బావను నాకు ఇచ్చి పెళ్లి చేసుంటే నాకు ఈ గతి పట్టేదా. నీవల్లే నా జీవితం ఇప్పుడు ఇలా తగలబడింది అని రేఖ అరిచి వెళ్లిపోతుంది. తర్వాత రేఖ మందు తాగుతుంటే రాహుల్ తిడుతుంటాడు. రాజ్ వచ్చి ఎందుకు తిడుతున్నావని అడుగుతాడు.

అదంతా ఈజీ కాదు బావ. కానీ, ట్రై చేస్తాను అని రేఖ అంటుంది. మరుసటి రోజు ఉదయం కావ్యను రాజ్ నడిపిస్తూ ప్రేమ చూపిస్తుంటే రేఖ చూసి జెలసీ ఫీల్ అవుతుంది. ఇంకో రెండు రౌండ్స్ నడవమని రాజ్ చెబితే నడవలేనని కావ్య అంటుంది. జ్యూస్ తీసుకొస్తాను. తాగి నడు అని వెళ్లి జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తుంటే రేఖ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది.

కావ్యపై రేఖ అసూయ

అది చూసి ఇవి వేసుకుంటే డిప్రెషన్ పోదు. నువ్వు పోతావ్ అని ట్యాబ్లెట్స్ పక్కన పడేస్తాడు రాజ్. పరిస్థితులను మనమే మార్చుకోవాలని, మనుషులతో కలువు. యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేయు. ఇలాంటి జ్యూస్ తాగు అని రాజ్ చెబుతాడు. దాంతో ఆ జ్యూస్ తీసుకుని తాగుతుంది రేఖ. ఈ జ్యూస్ నాకోసమేనా బావ అని పదే పదే అడుగుతుంది రేఖ . అలాగే అనుకో అని రాజ్ అంటాడు.

సుభాష్, ప్రకాశం ఆఫీస్‌కు వెళ్లడానికి ఫీల్ అవుతారు. స్కూల్ పిల్లాళ్ల మారం చేస్తారు ఇద్దరు. ఇంతలో కావ్య వస్తే భోజనం చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని ఇందిరాదేవి అడుగుతుంది. లేదని కావ్య చెబితే.. పని మనిషికి చెప్పి పంపించాను అని అపర్ణ చెబుతుంది. ఈ పని మనిషి ఏం చేస్తుందని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు రేఖ చెప్పిన పాస్తా చేస్తుంది పని మనిషి.

కావ్య బిడ్డకు ముప్పు: రుద్రాణి, రేఖల ప్లాన్

ఇందిరాదేవి వాళ్లు వెళ్లు అడుగుతారు. రేఖ చెప్పింది, పాస్తా చేయరావట్లేదని పని మనిషి అంటుంది. ఇంతలో రేఖ వచ్చి పాస్తా రెడీనా అని అడుగుతుంది. నువ్వు వండుకోవే. లేదా దానికి వచ్చిన వంటలు చేయించుకో. ఫస్ట్ కావ్యకు ఇవ్వాలి. కావ్య ఆరోగ్యం ముఖ్యం. పని మనిషి టైమ్‌ను వేస్ట్ చేయకు అని గద్దిస్తుంది ఇందిరాదేవి . దాంతో కోపంగా రేఖ వెళ్లిపోతుంది.

దాంతో రాజ్‌ను రేఖ హగ్ చేసుకుంటుంది. అదంతా కావ్య చూస్తుంది. రాజ్ కావ్యను చూసి భయపడిపోతాడు. ఏమైందే అని ఇందిరాదేవి అడుగుతుంది. జరిగింది చెబుతుంది కావ్య. తర్వాత కావ్య కడుపులో పిండం చనిపోయేలా కషాయంలో పసరు మందు కలుపుతారు తల్లీ కూతురు రుద్రాణి, రేఖ. ఆ కషాయాన్ని తాగమని కావ్యకు ఇస్తాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌లో రేఖ అసూయ, రుద్రాణి కుట్రతో కథ మరింత ఉత్కంఠగా మారింది. కావ్య బిడ్డకు ముప్పు పొంచి ఉన్న ఈ పరిణామం ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తుంది. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.