|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సెప్టెంబర్ 26 ఎపిసోడ్: రాజ్‌కు కల్యాణ్ సలహా- అబార్షన్ తర్వాత కావ్యకు పిల్లలు పుట్టరు-ఇక రాజ్‌కు ఉండని వారసుడు

Published: 25-09-2025, 10:57 PM
బ్రహ్మముడి సెప్టెంబర్ 26 ఎపిసోడ్: రాజ్‌కు కల్యాణ్ సలహా- అబార్షన్ తర్వాత కావ్యకు పిల్లలు పుట్టరు-ఇక రాజ్‌కు ఉండని వారసుడు

బ్రహ్మముడి సెప్టెంబర్ 26 ఎపిసోడ్‌ ఉత్కంఠగా సాగింది. బిడ్డకు ప్రాణం పోస్తే కావ్య ప్రాణాలు పోతాయని రాజ్ నిజం చెప్పాడు. అబార్షన్ చేయించుకుంటే మళ్లీ పిల్లలు పుట్టరని అపర్ణ వెల్లడించగా, కావ్య మాత్రం పుట్టబోయే బిడ్డకోసం ఆవేదన వ్యక్తం చేసింది.

Key Points

1

నిజం చెప్పమని రాజ్‌కు కల్యాణ్ సలహా, రాజ్ నలిగిపోవడంపై ఆవేదన.

2

బిడ్డ పుడితే కావ్య ప్రాణాలకు ముప్పు అని రాజ్, అపర్ణ, సుభాష్‌లకు నిజం చెప్పాడు.

4

పుట్టబోయే బిడ్డకోసం ఎంతగానో ఆశపడ్డానని, అబార్షన్ కు ఒప్పుకోనని కావ్య ఆవేదన.

నిజం బయటపెట్టమని రాజ్‌కు కల్యాణ్ హితవు

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాత్రి చంద్రుడిని చూసుకుంటూ రాజ్ ఉండిపోతాడు. అక్కడికి కల్యాణ్ వచ్చి రాజ్‌తో మాట్లాడుతాడు. ఇంకా ఎన్నిరోజులు నిజం చెప్పకుండా నీలో నువ్వే నలిగిపోతావ్. అందరి దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోతావ్. అందరు నిన్ను మోసగాడిగా చూస్తున్నారు. అది చూస్తే బాధగా ఉంది. ఏం ఉపయోగం లేనప్పుడు నిజం దాచడం వేస్ట్ అన్నా అని కల్యాణ్ అంటాడు.

వదినకు కాకుండా కనీసం అమ్మ నాన్నకు అయినా నిజం చెప్పొచ్చుగా. అమ్మేగా అర్థం చేసుకుంటుంది. నిజం చెబుతావో. లేదా నిందలు మోస్తావో నీ ఇష్టం అని రాజ్‌కు కల్యాణ్ సలహా ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్ మాట్లాడిన దాని గురించి సుభాష్, అపర్ణ మాట్లాడుకుంటారు. తిట్టుకుంటారు. ఇంతలో రాజ్ వస్తాడు. ఏమైందిరా, ఎందుకులా పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నావ్ అని నిలదీస్తుంది అపర్ణ.

నీ బిడ్డను నువ్వే ఎందుకు చంపాలని చూస్తున్నావ్ అని కాలర్ పట్టుకుని అడుగుతుంది అపర్ణ. దాంతో బిడ్డ పుడితో కళావతి చచ్చిపోతుంది అని నిజం చెబుతాడు రాజ్. దాంతో అపర్ణ , సుభాష్ ఇద్దరు షాక్ అవుతారు. డాక్టర్ చెప్పిందంతా చెప్పిన రాజ్ అలా చేస్తే కావ్య ఒప్పుకోదు. ఆ విషయం కళావతికి చెప్పుకోలేక, బిడ్డను కాపాడుకోలేక నరకం చూశాను అని రాజ్ అంటాడు.

కావ్య ప్రాణాలకు ముప్పు: రాజ్ చెప్పిన నిజం

మనం ఆశపడింది నెరవేరదు అంటారుగా. బిడ్డ కోసం ఎంతగానో ఆశపడ్డాను. కానీ, ఆ దేవుడు నా ఆశను ఆవిరి చేశాడు. ఇద్దరిలో కళావతిని కాపాడుకుందామనుకున్నా అని రాజ్ ఏడుస్తూ చెబుతాడు. రాజ్‌ను పట్టుకుని అపర్ణ ఏడుస్తుంది. ఇంత బారాన్ని ఒక్కడివే ఎలా మోస్తున్నావురా అని అపర్ణ అంటుంది. కావ్యకు నిజం చెబుదాం. ఇలాంటివి దాచకూడదు అని అపర్ణ వెళ్తుంది.

కావ్య దగ్గరికి వచ్చిన అపర్ణ రాజ్ నిర్ణయం సరైనదే. అబార్షన్ చేయించుకో అని అపర్ణ అంటుంది. అపర్ణ, సుభాష్‌లను ధాన్యం, ప్రకాశం నిందిస్తారు. ఇప్పుడు నాకు బిడ్డ పుడితే ఎవరికి కష్టం వస్తుంది. ఎవరి ప్రాణాలు పోతాయి చెప్పండి అని కావ్య అంటుంది. నీ ప్రాణాలే పోతాయ్ అని అపర్ణ అరుస్తుంది. ఏమంటున్నారు అత్తయ్య అని కావ్య అడుగుతుంది.

నేను చెప్పేది నిజం. నీ కడుపులో బిడ్డకు ప్రాణం పోస్తే నీ ప్రాణాలే పోతాయ్ అని జరిగింది అంతా అపర్ణ, సుభాష్ చెబుతారు. మీరు చెప్పేదంతా అబద్ధం. నేను నమ్మను, దీనికి ఒప్పుకోను. పుట్టబోయే బిడ్డకోసం ఎంతో ఆశపడ్డాను అని తన ఆవేదన చెప్పుకుంటుంది కావ్య. మీరు మనసులో ఇంకేదో ఉంది. ఇదంతా అబద్ధం కదా. మీరంతా నన్ను మోసం చేస్తున్నారు కదా అని రాజ్‌ను బాధతో అడుగుతుంది కావ్య.

అబార్షన్ చేయించుకోవాలని కావ్యపై అపర్ణ ఒత్తిడి

నేను చెప్పేదంతా నిజం. ఇంతపెద్ద నిర్ణయాన్ని అంత సులువుగా తీసుకున్నాను అనుకున్నావా. ఈ అబార్షన్ జరిగిన తర్వాత నీకు అసలు బిడ్డలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్స్ చెప్పిన తర్వాత కూడా నాకు వారసుడు ఉండడని తెలిసిన తర్వాత కూడా నాకు నువ్వే కావాలని ఇలా చేశాను కళావతి. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్పా ఇంకేది వద్దు. నీ ప్రేమ కావాలి. నీతోనే జీవితాంతం కలిసి బతికి ఉండాలి. ఇంకేది వద్దు అని రాజ్ అంటాడు.

కానీ, నాకు మాత్రం నా బిడ్డే కావాలి. నాకు నా బిడ్డ ప్రాణాలతో కావాలి. మీరన్నది నిజమైనా నా ప్రాణాలు పోతున్నా సరే నా బిడ్డకు జన్మనిస్తాను. ఇప్పుడు చెబుతున్నా వినండి. నాకు ఏం జరిగినా సరే ఈ బిడ్డను నవ మోసాలు మోసి వాడికి ప్రాణం పోస్తాను. దేవుడు అడ్డు వచ్చిన వినను అని కావ్య తెగేసి చెబుతుంది. నీ ప్రాణాలు పోతున్నాయంటే మేము ఒప్పుకోం అని ఇంటిల్లిపాది అంటారు.

మాకోసం కాకపోయినా నీ భర్తకోసమైనా ఆలోచించు. వాడికోసం ఇన్నేళ్లు పడరాని పాట్లు పడ్డావ్. ఇప్పుడు నువ్వు మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్తావా అని అపర్ణ అంటుంది. నాకు నువ్వు ముఖ్యం అని కల్యాణ్ అంటాడు. అంతా బిడ్డను చంపుకోమని చెబుతారు. నా వల్ల కాదు. నా బిడ్డను చంపుకోలేను. నాకంటే నా బిడ్డ ప్రాణమే ముఖ్యం అని కావ్య స్పృహ తప్పి పడిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

బిడ్డను కోల్పోతే మళ్లీ గర్భం దాల్చలేనని కావ్య ఆవేదన వ్యక్తం చేసింది. తన కడుపులోని బిడ్డను కాపాడుకోవాలని దృఢంగా ఉంది. రాజ్, అపర్ణల ఆందోళన, కావ్య మొండిపట్టు ఈ సీరియల్‌లో మరింత నాటకీయతను పెంచాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.