
బ్రహ్మముడి సెప్టెంబర్ 30 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. కావ్య కడుపులో బిడ్డను చంపడానికి రాజ్ జ్యూస్‌లో అబార్షన్ మాత్రలు కలిపాడు. అయితే, జ్యూస్‌పై అనుమానపడ్డ కావ్య.. దాన్ని టెస్ట్ చేయిస్తానని చెప్పి రాజ్‌కు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈ షాకింగ్ పరిణామాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
Key Points
కావ్య కడుపులోని బిడ్డను చంపడానికి రాజ్ జ్యూస్‌లో అబార్షన్ మాత్రలు కలిపాడు.
రాజ్‌ను కల్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకుండా జ్యూస్ తీసుకెళ్తాడు.
జ్యూస్‌పై అనుమానం వచ్చిన కావ్య రాజ్‌ను నిలదీసి అసలు నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.
జ్యూస్‌ను టెస్ట్ చేయిస్తానని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు, తదుపరి ఏం జరుగుతుందో చూడాలి.
కావ్యకు జ్యూస్‌లో అబార్షన్ మాత్రలు కలిపిన రాజ్
బ్రహ్మముడి ఈరోజు అంటే 839వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కావ్య కడుపులో బిడ్డను చంపడానికి రాజ్ తెగించేస్తాడు. కావ్యకు ఇచ్చిన జ్యూస్ లో అబార్షన్ ట్యాబ్లెట్లు కలుపుతాడు. ఆ జ్యూస్ కావ్య తాగేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.
రాజ్‌ను మరోసారి దెప్పిపొడిచిన కావ్య
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ కావ్య తన గదిలో పిల్లల పోస్టర్లు అంటించే సీన్ తో మొదలవుతుంది. రాజ్ దగ్గర నిజం రాబట్టమని చెప్పి ఇందిరాదేవి వెళ్లిపోతుంది. ఇంటికి వచ్చిన రాజ్ , కల్యాణ్ ఆ పోస్టర్లు చూసి షాక్ తింటారు.
జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చిన వాళ్లు చెప్పకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి బిడ్డను చంపాలని చూశారని, ఇవి చూస్తే అయినా వాళ్లలో మార్పు వస్తుందేమో అని రాజ్ ను కావ్య రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అటు కల్యాణ్ ను కూడా అప్పుతో ఇలాగే చేస్తున్నావా అని కావ్య అడుగుతుంది. అయినా బిడ్డను ప్రేమగా చూసుకునే భర్త ఉన్నాడు కాబట్టి తన చెల్లికి అలాంటి పరిస్థితి రాదులే అని రాజ్ ను మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.
జ్యూస్‌లో అబార్షన్ ట్యాబ్లెట్లు కలిపిన రాజ్..
జ్యూస్‌పై అనుమానపడ్డ కావ్య, అసలు నిజం
ఇంతలో రత్తాలు కనిపించడంతో తనకు ఈ టైమ్ కు జ్యూస్ ఇవ్వమని చెప్పాను కదా అని కావ్య అంటుంది. అది విని రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంత రెచ్చిగొట్టినా ఈయనలో ఏం స్పందన లేదేంటి అని కావ్య అనుకుంటుంది. అటు కిచెన్ లోకి వెళ్లి జ్యూస్ చేస్తున్న రత్తాలును పంపించేసి తాను జ్యూస్ చేస్తాడు రాజ్.
ఆ తర్వాత అందులో అబార్షన్ ట్యాబ్లెట్ కలపడానికి సిద్ధమవుతాడు. కన్న తండ్రిగా బిడ్డలను కాపాడాల్సింది పోయి తన చేతులతోనే ఇలా చేస్తున్న పరిస్థితికి రాజ్ చాలా బాధపడతాడు. జ్యూస్ లో ట్యాబ్లెట్ వేయబోతుండగా కల్యాణ్ వచ్చి అడ్డుకుంటాడు. వదినకు నిజం తెలిస్తే ఎప్పటికీ క్షమించదని అంటాడు. అయినా వినకుండా రాజ్ అందులో ట్యాబ్లెట్ వేసి జ్యూస్ తీసుకెళ్తాడు.
జ్యూస్‌పై అనుమానపడ్డ కావ్య.. రాజ్ నాటకం
జ్యూస్ రాజ్ తీసుకురావడంతో కావ్య అనుమానంగా చూస్తుంది. మీరెందుకు జ్యూస్ తీసుకొచ్చారని అడుగుతుంది. కడుపులో బిడ్డ అవసరం లేదు కానీ తన ఆరోగ్యం గురించి ఎందుకంత పట్టింపు అని నిలదీస్తుంది. అనుమానంగానే రాజ్ చేతిలోని జ్యూస్ గ్లాస్ తీసుకుంటుంది.
దానిని సందేహంగా చూస్తుంది. తన కడుపు పోగొట్టడానికి ఇందులో ఏదో కలిపారని అనుమానంగా ఉందని రాజ్ తో కావ్య అంటుంది. దీంతో అతడు షాక్ తింటాడు. కావ్యతో ఆ జ్యూస్ తాగించడానికి నాటకమాడతాడు. రివర్స్ లో అవును.. అందులో అబార్షన్ ట్యాబ్లెట్లు కలిపాను అని సీరియస్ గా చెబుతాడు. అయినా మీరు మరీ మీ చేతులతో బిడ్డను చంపేంత దుర్మార్గుడు కాదులే అని కావ్య అంటుంది.
కావ్య ప్లాన్ తెలుసుకొని రాజ్ షాక్
తానేదో సరదాకి అలా అంటే.. ఎందుకంత సీరియస్ అవుతారు.. తాగుతానులే అని తాగబోతుంటే కావ్యకు ఫోన్ వస్తుంది. మీ పార్శిల్ వచ్చిందంటూ ఓ డెలివరీ ఏజెంట్ ఫోన్ చేస్తాడు. అతనికి అడ్రెస్ చెప్పడానికి ఆ జ్యూస్ రాజ్ చేతికి ఇచ్చి బయటకు వెళ్తుంది. పార్శిల్ తీసుకొని వచ్చిన తర్వాత రాజ్ చేతుల్లో జ్యూస్ అలాగే ఉండటం చూసి.. తీసుకొని తాగేస్తుంది.
అన్నయ్య చేస్తున్న పని సరిగా లేదు.. వదినను జ్యూస్ తాగకుండా అడ్డుకోవాలని కల్యాణ్ అనుకుంటాడు. పైనుంచి అతడు పరుగెత్తుకుంటూ కిందికి వస్తాడు. రాజ్ గదిలోకి వచ్చే సమయానికి కావ్య జ్యూస్ మొత్తం తాగేస్తుంది. వదిన అంటూ గట్టిగా అరిచి, జ్యూస్ మొత్తం తాగేశావా అని కల్యాణ్ అడుగుతాడు. మీ అన్నయ్య అంత ప్రేమగా తీసుకొస్తే మొత్తం తాగకుండా ఎలా ఉంటాను అని వెళ్లిపోతుంది.
రాజ్‌ను నిలదీసిన కల్యాణ్.. పెద్ద ట్విస్టే ఇచ్చిన రాజ్
రాజ్ ను కల్యాణ్ బయటకు తీసుకెళ్తాడు. అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా అని నిలదీస్తాడు. వదిన ఆ జ్యూస్ తాగేసింది.. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేస్తానని అంటాడు. ఏం అవసరం లేదంటూ రాజ్ పెద్ద ట్విస్టే ఇస్తాడు. జ్యూస్ గ్లాసు మార్చేశానని చెబుతాడు. తన చేతులతో బిడ్డను చంపనన్న కావ్య మాటలు విని ఆమె బయటకు వెళ్లిన సమయంలో ట్యాబ్లెట్లు కలిపిన జ్యూస్ గ్లాసు మార్చేసి.. మరొకటి తీసుకొచ్చానని అంటాడు.
అది విని కల్యాణ్ ఊపిరి పీల్చుకుంటాడు. ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లిన కావ్య అక్కడ మరో జ్యూస్ గ్లాసు ఉండటం చూస్తుంది. అనుమానంతో దానిని టెస్టుకు పంపిస్తుంది. అందులో అబార్షన్ ట్యాబ్లెట్లు ఉన్నాయని తెలుసుకుంటుంది. తాను డెలివరీ తీసుకోవడానికి వెళ్లినప్పుడు జ్యూస్ గ్లాసు మార్చడం చూస్తుంది. అబార్షన్ ట్యాబ్లెట్లు కలిపితే చివరి నిమిషంలో ఎందుకు మార్చినట్లు అని సందేహిస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు విషయం తెలుస్తుందనుకొని అందుకు సిద్ధమవుతుంది. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మొత్తానికి కావ్య వ్యూహంతో రాజ్‌కు అనుకోని షాక్ తగిలింది. జ్యూస్ టెస్ట్‌తో అసలు నిజం బయటపడనుండగా, రాజ్ తదుపరి అడుగు ఏం వేస్తాడు? కావ్య పరిస్థితి ఏంటి? అనే అంశాలు రాబోయే ఎపిసోడ్‌లో మరింత ఆసక్తి రేపుతున్నాయి.


