|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సెప్టెంబర్ 18 ఎపిసోడ్:రాజ్‌కు కల్యాణ్ శిక్ష- కావ్య, బిడ్డల తలరాత మారుస్తానన్న రాజ్-తన ప్రాణం బలిస్తానంటూ శపథం

Published: 17-09-2025, 9:46 PM
బ్రహ్మముడి సెప్టెంబర్ 18 ఎపిసోడ్:రాజ్‌కు కల్యాణ్ శిక్ష- కావ్య, బిడ్డల తలరాత మారుస్తానన్న రాజ్-తన ప్రాణం బలిస్తానంటూ శపథం

బ్రహ్మముడి సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య ఆరోగ్యంపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. కల్యాణ్ తన సమస్యను రాజ్‌తో పంచుకుంటాడు. రాజ్, కావ్య, బిడ్డల భవిష్యత్తును మార్చడానికి ప్రతిజ్ఞ చేస్తాడు.

Key Points

1

కల్యాణ్, రాజ్‌తో ప్రధాన సమస్యను చర్చించడానికి బయటకు వెళ్తాడు.

2

కావ్య గర్భవతి, కానీ ఆమె ఆరోగ్యం ప్రమాదంలో ఉంది.

4

రాజ్ తన సోదరుడికి మద్దతు ఇస్తూ, ఈ కష్ట సమయంలో అతనితో ఉంటాడు.

కల్యాణ్‌కు తీవ్రమైన సమస్య

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌తో మాట్లాడాలని బయటకు వెళ్దామంటాడు కల్యాణ్. ఇంతలో కావ్య పిలిచి ఎక్కడికి అని అడుగుతుంది. కల్యాణ్ మాట్లాడాలని ఉందంటే బయటకు వెళ్తున్నామని రాజ్ చెబుతాడు. అదేదో ఇంట్లో మాట్లాడితే సరిపోతుంది కదా అని కావ్య అంటుంది.

ఇక్కడే మాట్లాడే విషయం అయితే బయటకు ఎందుకు వెళ్తాం. మాట్లాడే చిన్న విషయం కాదు. చెప్పెంత ధైర్యం లేదని కల్యాణ్ అంటాడు. అన్నదమ్ములు కలిసి ఏ గూడుపుఠాని చేయట్లేదుగా. మళ్లీ ఏదైనా బ్యాడ్ న్యూసా. ఇంట్లో ఎప్పుడు మంచి రోజులు ఎక్కువగా ఉండవి కదా. మళ్లీ ఏదైనా ఉపద్రవం ముంచుకొచ్చిందా అని కావ్య అంటుంది.

అవును వదినా ఉపద్రవమే ముంచుకొచ్చింది. అది చెప్పలేకే అన్నయ్యను బయటకు తీసుకెళ్తున్నా అని కల్యాణ్ మనసులో అనుకుంటాడు. సైలెంట్‌గా ఉంటావేంటీ.. ఏమైనా మీ అన్నదమ్ములకు పర్సనల్స్ మాకెందుకు. త్వరలో నాన్నలు కాబోతున్నారు. పెద్దవాళ్లు కాబోతున్నారు. మాకెందుకు అని కావ్య అంటుంది. ఏంటే నా తమ్ముడిని దెప్పి పొడుస్తున్నావ్. మాకు మాకు పర్సనల్స్ ఉంటాయి అని రాజ్ తమ్ముడికి సపోర్ట్ చేస్తాడు.

తర్వాత ఇద్దరి కూతుళ్ల కోసం డ్రెస్ తీసుకున్నవి ఇస్తాడు రాజ్. అబ్బో. ఇంకా భూమ్మీదకే రాలేదు. అప్పుడే షాపింగా అని కావ్య అంటుంది. రాజ్, కల్యాణ్ బయటకు వెళ్తారు. బయటకు రమ్మన్నావంటే పర్సనల్ ప్రాబ్లమ్ అయింటుందని రాజ్ గెస్ చేస్తాడు. అవును అని కల్యాణ్ అంటాడు. చెప్పడానికి ధైర్యం చాలట్లేదు అంటే.. మీ వదిన చెప్పినట్లు సెకండ్ సెటప్ పెట్టావా ఏంటీ. లేదులే. నువ్వు అలా చేస్తే అప్పు నిన్ను పప్పు పప్పు చేస్తుందని రాజ్ అంటాడు.

కావ్య ఆరోగ్యం ప్రమాదంలో

రాజ్‌ను కారు ఆపమంటాడు కల్యాణ్. రాజ్ ఆపుతాడు. ఏంట్రా నీ ప్రాబ్లమ్. ఏమైందని రాజ్ నిలదీస్తాడు. చెబితే నువ్వు ఎలా తీసుకుంటావో అర్థం కావట్లేదు. ధైర్యం చాలట్లేదు. రెండు రోజుల క్రితం అప్పు నేను హాస్పిటల్‌కు వెళ్లాం. అప్పుకు సమస్య ఉందని, అప్పుకు బిడ్డను క్యారీ చేసేంత శక్తి తనకు లేదని వెంటనే అబార్షన్ చేయాలని చెప్పారు అని కల్యాణ్ చెబుతాడు.

ఒకవేళ 9 నెలలు క్యారీ చేస్తే తన ప్రాణానికే ప్రమాదమని చెప్పారు, తనను కాపాడే అవకాశం లేదని, ఆలస్యం చేస్తే అబార్షన్ చేసే ఛాన్స్ కూడా ఉండదని చెప్పారు అని కావ్య సమస్యను అప్పు సమస్యగా చెబుతాడు కల్యాణ్. ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నయ్య. నా స్థానాల్లో నువ్వుంటే ఏం చేస్తావ్. ఎలాంటి నిర్ణయం తీసుకుంటావ్ అని కల్యాణ్ అడుగుతాడు.

డాక్టర్ చెప్పినట్లు చేయడం మంచిదనిపిస్తుంది. ఎలాగైనా అప్పును ఒప్పించడం కరెక్ట్ అనిపిస్తుందని రాజ్ అంటాడు. అయితే, ఒప్పించు అన్నయ్య. వదినకు ఆ నిజాన్ని నువ్వు చెప్పు. ప్రాబ్లమ్ వచ్చింది అప్పుకు కాదు. వదినకు అని కల్యాణ్ అసలు నిజం చెబుతాడు. దాంతో రాజ్ షాక్ అవుతాడు. డాక్టర్ చెప్పింది అంతా కల్యాణ్ చెబుతాడు. వదినకు నిజం చెప్పలేక లోలోపల ఏడ్చాం అని కల్యాణ్ అంటాడు.

వదినకు ఈ నిజం చెప్పి వదినను ఒప్పించి కాపాడు అన్నయ్య అని కల్యాణ్ అంటాడు. నిజం చెప్పాలని చెప్పి ఇంత పెద్ద శిక్ష వేశావేంట్రా. నా నోటీతో చెబితే ఎలా తట్టుకుంటుంది. ఆ పిచ్చిది ఏమైపోతుందిరా. ఎందుకురా నాకు ఈ విషయాన్ని చెప్పావ్ అని ఏడుస్తాడు రాజ్. మరోవైపు ఎన్నాళ్లకు ప్రశాంతంగా ఉన్నాం అని ఇందిరాదేవి అంటుంది.

రాజ్‌ ప్రతిజ్ఞ

అపర్ణను ఫ్రెండ్ అని పిలవాలా, అమ్మమ్మ అని పిలవాల అని స్వరాజ్ అడుగుతాడు. ఫ్రెండ్ అంటే బయటివాడిలా మిగిలిపోతావ్, అమ్మమ్మ అంటే ఇంటివాడివి అవుతావ్ నువ్వే ఆలోచించుకో అని ఇందిరాదేవి అంటుంది. నేను ఇంటివాడిని. ఈ ఇంటికి కాబోయే వారసుడుని. మావయ్య తర్వాత రాజును నేనే అని స్వరాజ్ అంటాడు. అలా కావాలంటే మీ అత్తయ్యను అడిగి బిడ్డను కనివ్వమను. పెద్దయ్యాక దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి రాజ్ అయిపో అని ఇందిరాదేవి అంటుంది.

అయితే, ఓకే. అత్తయ్య నాకు వెంటనే ఓ పెళ్లాన్ని కనివ్వు అడుగుతాడు స్వరాజ్. దాంతో అంతా నవ్వుతారు. ఇంతలో రాజ్, కల్యాణ్ వస్తారు. అన్నదమ్ముల మధ్య సీక్రెట్స్ చాలా ఉన్నాయని వాళ్లని కావ్య దెప్పి పొడుస్తుంది. రాజ్ కృష్ణుడి దగ్గరకు వెళ్లి కోపంగా చూస్తాడు. కావ్యకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావ్. నీకంటే మా కోర్టులో బెటర్ అనిపిస్తుంది. మా కళావతి చేసిన తప్పేంటీ అని దేవుడుని నిలదీస్తాడు రాజ్.

కావ్య జీవితంలో జరిగినవన్నీ చెబుతూ నిందిస్తాడు రాజ్. నిన్ను నమ్ముకునేవాళ్లకే శిక్ష వేయడమే నీ చట్టమే అయితే, ఒక ప్రాణానికి బదులు మరో ప్రాణం కావాలనేదే నీ ధర్మం అయితే దానికి బలి అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కావాలంటే నా ప్రాణం తీసుకో. వాళ్లిద్దరి ప్రాణాలు నిలబెట్టు. నా కష్టంతో వాళ్ల తలరాతలు మారుస్తాను. ఈ ప్రయాణంలో నీ సాయం వద్దు. న్యాయం మాత్రం చేయి అని దండం పెట్టుకున్న రాజ్ శపథం చేసి వెళ్లిపోతాడు.

మరోవైపు కల్యాణ్‌ను బావగారు ఎలా రియాక్ట్ అయ్యారని అడుగుతుంది అప్పు. పడుకున్న కావ్య దగ్గరికి వెళ్లి నీకు మన బిడ్డకు ఏలాంటి ఆపద రానివ్వను. విధిరాతకు ఎదురెళ్తున్న నాకు ఏమైనా సరే. మాటిస్తున్నా అని చేయి పట్టుకుంటాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

కావ్య ఆరోగ్యం, బిడ్డ భవిష్యత్తు గురించి తీవ్రమైన సంక్షోభం నెలకొంది. రాజ్ తన సోదరుడికి అండగా నిలిచి, ఈ కష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.