|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సెప్టెంబర్ 15 ఎపిసోడ్: రాజ్ ఫస్ట్ లవ్ స్వప్న కాదు కావ్యే- బయటపడ్డ నిజం-కావ్యకు పిల్లలు పుట్టరని చెప్పిన అప్పు

Published: 16-09-2025, 10:43 AM
బ్రహ్మముడి సెప్టెంబర్ 15 ఎపిసోడ్: రాజ్ ఫస్ట్ లవ్ స్వప్న కాదు కావ్యే- బయటపడ్డ నిజం-కావ్యకు పిల్లలు పుట్టరని చెప్పిన అప్పు

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 15 ఎపిసోడ్ లో వినాయక చవితి వేడుకలు ప్రధానంగా జరుగుతాయి. రాజ్ తన మొదటి ప్రేమ గురించి వెల్లడించడం, స్వప్న, కావ్యల మధ్య సంఘటనలు, రేవతి ప్రవేశం వంటి ఘటనలు కథను ఉత్కంఠభరితంగా మారుస్తాయి.

Key Points

1

వినాయక చవితి వేడుకల్లో ఆసక్తికరమైన డ్యాన్స్ ప్రదర్శనలు

2

రాజ్ మొదటి ప్రేమ రహస్యం బయటపడింది!

4

రేవతి అకస్మాత్తుగా కనిపించడంతో ఆశ్చర్యం

వినాయక చవితి వేడుకలు

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో వినాయక చవితి వేడుకల్లో రుద్రాణి పార్టీ అరెంజ్ చేస్తుంది. రాహుల్, స్వప్న డ్యాన్స్ చేస్తారు. ప్రకాశం, ధాన్యలక్ష్మీ డ్యూయెట్ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తారు. అపర్ణ, సుభాష్‌కు మనసులో ఉన్న ప్రేమను చూపించాలని అని వస్తే స్వరాజ్ మీద ఉన్న ప్రేమను చూపిస్తారు. అది చూసి రేవతి ఎమోషనల్ అవుతుంది.

అప్పు, కల్యాణ్ డ్యాన్స్ చేస్తారు. రాజ్‌కు మొదటి ప్రేమను తెలియజేయాలి అని వస్తుంది. మీరు మొదట ప్రేమించింది మా అక్కను. అది నిజాయితీగా చెప్పండి అని కావ్య అంటుంది. ప్రేమ గొప్పదా, పెళ్లి గొప్పదా అని అందరిని అడిగిన రాజ్ పెళ్లి గురించి గొప్పగా చెబుతాడు. కావ్యతో జరిగిన పెళ్లి, తనను దూరం పెట్టడం, కావ్య తనకోసం రావడం వంటివి అన్ని గొప్పగా చెబుతాడు రాజ్ .

నువ్విచ్చిన ప్రేమను పదింతలు చేసి ఇస్తాను. భవిష్యత్తులో కన్నీరు రానివ్వను. ఇంత చేసిన పెళ్లి గొప్పదంటాను. ఇక మొదటి ప్రేమ గురించి అంటే.. మన కంపెనీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు వినాయక చవితి వేడుకలు చేస్తున్నప్పుడు నీడలో డ్యాన్స్ చేస్తున్న ఓ బాపు బొమ్మను చూశాను. తనను చూడాలనుకున్నాను. తనపైన ప్రేమ కలిగింది. అది ఎవరో వెళ్లి చూడాలనుకున్న. అప్పుడే డ్యాన్స్ చేస్తున్న స్వప్నను చూశాను అని రాజ్ చెబుతాడు.

రాజ్ మొదటి ప్రేమ రహస్యం

అది నేను కాదు రాజ్. ఆరోజు నిన్ను ఇంప్రెస్ చేయాలంటే డ్యాన్స్ చేయాలనుకున్నా. దానికి ఒకరి సహాయం తీసుకున్నా. చీకట్లో డ్యాన్స్ చేస్తుంటే అది చూసి నువ్వు మనసు పారేసుకుంది ఎవరినో కాదు మా కావ్య మీదే. తనే నాకు డ్యాన్స్ నేర్పించింది అని స్వప్న అసలు నిజం చెబుతుంది. అంటే నేను మొదట ప్రేమించింది, మొదటగా పెళ్లి చేసుకుంది నిన్నే అన్నమాట అని కావ్యను హగ్ చేసుకుంటాడు రాజ్.

నీ ప్రేమ నిజంగా చాలా గొప్పదిరా. మేమంతా నీకు స్వప్నకు పెళ్లి చేయాలని చూసినా కావ్యతోనే నీ పెళ్లి జరిగింది అని సీతారామయ్య అంటాడు. వావ్ సూపర్ ఈ రకంగా ఓ నిజం బయటపడింది. రాజ్ మొదటి ప్రేమ కావ్య అని తెలిసింది అని రుద్రాణి అంటుంది. ఇక ఇప్పుడు మిగిలింది మన గెస్ట్ మాత్రమే అని రుద్రాణి అంటుంది. రేవతికి సోలోగా డ్యాన్స్ చేయాలని వస్తే.. తనకు రాదని చెబుతుంది రేవతి.

తోడుగా నేను చేస్తాను అని రుద్రాణి అంటుంది. వైరల్ సాంగ్‌కు రుద్రాణి డ్యాన్స్ చేస్తూ చేస్తూ రేవతి ముసుగు తీస్తుంది. రేవతిని చూసి అంతా షాక్ అవుతారు. రేవతి ఇక్కడ ఏం చేస్తున్నావ్. ఎందుకు వచ్చావ్. రాధలా వేషాలు వేయడం ఏంటీ. మీ అమ్మ మాట అంటే లెక్కలేదా. వదినను బాధ పెట్టడానికి వచ్చావా. ఆస్తి కోసమా అని రుద్రాణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.

రేవతి యొక్క అకస్మాత్తుగా ప్రవేశం

అక్కను తీసుకొచ్చింది నేను అని రాజ్ అంటే.. సపోర్ట్ చేసింది నేనని కావ్య, ఒప్పుకుందని మేమని కల్యాణ్ , స్వప్న అంటారు. మీరంతా కలిసి వదినను మోసం చేయాలనుకుంటున్నారా. అంతా కలిసి వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారా అని పెద్ద డ్రామా చేస్తుంది రుద్రాణి. ఇక చాలు ఆపవే నీ నాటకాలు. రేవతికి పెళ్లి చేసుకోమ్మని సలహా ఇచ్చింది నువ్వు కాదా. చిన్న వయసులో తప్పుడు సలహాలు ఇచ్చింది ఎవరు అని రుద్రాణి బాగోతం బయటపడెతుంది ఇందిరాదేవి.

తర్వాత అపర్ణ కాళ్ల మీద క్షమించమని రేవతి అడుగుతుంది. అపర్ణ క్షమిస్తుంది. తల్లీకూతుళ్లు ఇద్దరు కలిసిపోతారు. అంతా సంతోషంగా ఉంటారు. కావ్యకు పిల్లలు పుట్టరన్న విషయం త్వరగా చెప్పమని అప్పుకు డాక్టర్ చెబుతుంది. దాంతో ఇంట్లో అంతా కావ్యకు ఎవరు పుడతారని మాట్లాడుకుంటే అప్పును కావ్య అడుగుతుంది. నీకు ఎవరు పుట్టరక్కా అని నిజం చెబుతుంది అప్పు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరికి రాజ్ మొదటి ప్రేమ కావ్య అని బయటపడింది. స్వప్న నిజం చెప్పడంతో వారిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. అయితే రేవతి ప్రవేశంతో కథలో కొత్త ట్విస్ట్ ఏర్పడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.