
Kajal The India Story: కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే లీడ్ రోల్స్‌లో వస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ సోషియో-పొలిటికల్ థ్రిల్లర్ ‘ది ఇండియా స్టోరీ’ (The India Story). దేశంలో ఎన్నో ప్రాణాలను ముంచేస్తున్న ఆహార కల్తీ, వ్యవసాయంలో కెమికల్స్, పురుగుమందుల మితిమీరిన వాడకం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది.
Kajal The India Story: మనం ప్రతిరోజూ తినే ఆహారం ఎంత వరకు సురక్షితం? పంటపొలాల నుంచి మన ప్లేట్లలోకి ఎలాంటి విషం వచ్చి చేరుతోంది? కార్పొరేట్ కంపెనీల నిర్లక్ష్యం సామాన్యుల జీవితాలను ఎలా బలి తీసుకుంటోంది? సరిగ్గా ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన, సమాజంలో ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడని ఒక విపత్తు చుట్టూ తెరకెక్కిన సినిమానే ‘ది ఇండియా స్టోరీ’.
జీ స్టూడియోస్ సమర్పణలో, ఎమ్ఐజీ ప్రొడక్షన్స్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ (Slow Poison in Progress) అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ పెట్టారు. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ , శ్రేయాస్ తల్పడే నటించారు.
జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల
ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. “నిజం కోసం ఒక పోరాటం.. ప్రతి కుటుంబం కోసం ఒక యుద్ధం” అంటూ మేకర్స్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మనల్ని సాకుతున్న భూమే.. మనల్ని మింగేస్తే?
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇందులో సినిమా సీన్లు కాకుండా, దేశంలో జరుగుతున్న ఆహార కల్తీ, పురుగుమందుల దాడుల గురించిన రియల్ న్యూస్ ఫుటేజ్, డేటా కార్డ్‌లను ఉపయోగించి ఆడియన్స్‌లో ఒక తెలియని భయాన్ని, ఆలోచనను రేకెత్తించారు.
సరికొత్త కాంబినేషన్‌లో ఎమోషనల్ డ్రామా
నిశాంత్ భాగవత్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు మంగేష్ ధాక్డే అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. సమాజానికి ఒక కన్నువిప్పులా మారబోతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


