|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సెప్టెంబర్ 5 ఎపిసోడ్: కావ్యకు అబార్షన్- కృష్ణుడిని ఇంటి బయటపడేయబోయిన అప్పు- మట్టి వినాయక విగ్రహం చేసిన రాజ్

Published: 05-09-2025, 9:26 AM
బ్రహ్మముడి సెప్టెంబర్ 5 ఎపిసోడ్: కావ్యకు అబార్షన్- కృష్ణుడిని ఇంటి బయటపడేయబోయిన అప్పు- మట్టి వినాయక విగ్రహం చేసిన రాజ్

బ్రహ్మముడి సీరియల్‌లోని ఈరోజు ఎపిసోడ్‌లో కావ్యకు గర్భంలో సమస్యలు తలెత్తుతాయి. అప్పు కృష్ణను ఇంటి నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. రాజ్ మట్టితో వినాయకుడి విగ్రహం చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.

కావ్య గర్భధారణలో సమస్యలు

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య ప్రెగ్నెన్సీ రిపోర్ట్‌లో సమస్య ఉందని, 9వ నెల వరకు బిడ్డను మోయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 7 నెలల్లోనే డెలివరీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు బేబీ సురక్షితంగా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. అలాగే, 9 నెలల వరకు ఆగితే తల్లి ప్రాణాలకే ప్రమాదం అని అప్పు, కల్యాణ్‌తో డాక్టర్ చెబుతుంది.

మరి ఇప్పుడు ఏం చేయాలని డాక్టర్ అడిగితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు అబార్షన్ చేయడం తప్పా ఇంకేం చేయలేం అని డాక్టర్ చెబుతుంది. పెళ్లయిన రెండేళ్లకు తల్లి అయింది. ఎన్నో అవమానాలు పడింది. ఇప్పుడు బిడ్డను కనలేనని తెలిస్తే తట్టుకోలేదు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా చూడండి అని అప్పు అంటుంది. ప్రాణం విలువ మాకు తెలుసు. అయినా మా సుపీరియర్స్‌తో మాట్లాడి చెబుతాను అని డాక్టర్ అంటుంది.

దాంతో అప్పు, కల్యాణ్ వెళ్లిపోతారు. మరోవైపు చిటిక వేస్తూ రాజ్‌తో కావ్య ఆరెంజ్ జ్యూస్ తెప్పిస్తుంది. అవి ఇందిరాదేవి, అపర్ణ కోసం ఇవ్వగానే రాజ్ అరుస్తాడు. పెళ్లాం కడుపుతో ఉందని తెలిసి అన్ని చేస్తున్నావ్. మాకోసం ఎప్పుడైనా చేశావా అని తిడతుంది ఇందిరాదేవి. ఇంతలో కనకం, కృష్ణమూర్తి వచ్చి బంకమట్టి తెప్పించామని చెబుతారు.

అప్పు, కృష్ణ మధ్య సంఘర్షణ

కావ్య వినాయకుడిని చేస్తానంటే నో వద్దని.. కావాలంటే నేను చేస్తానని రాజ్ అంటాడు. రాజ్‌కు సపోర్ట్‌గా కృష్ణమూర్తి, కనకం మాట్లాడుతారు. వినాయకుడి విగ్రహం ఎలా తయారు చేయాలో కృష్ణమూర్తి చెబుతాడు. అరుణాచలంలోని ఎక్కు తొలి మెట్టు అనే పాట పెడతాడు రాజ్. కళావతి అడగ్గానే పాట పూర్తవగానే విగ్రహం పూర్తవుతుందని రాజ్ అంటాడు.

ఎంతో బిల్డప్ ఇచ్చిన రాజ్ ఇప్పుడు ఇది ఎలా చేయాలి అని అడుగుతాడు. దాంతో అంతా నవ్వుతారు. విగ్రహం కోసం రాజ్ మట్టి పిసుకుతాడు. విగ్రహం చేయడానికి రాజ్ కష్టపడతాడు. కావ్య వాళ్లంతా మాటలు అనేసరికి మీరంతా వెళ్లిపోండి, డిస్టర్బ్‌గా ఉందని రాజ్ అంటాడు. అయినా సెటైర్లు వేయడంతో మామగారు అని రాజ్ అరుస్తాడు. దాంతో కృష్ణమూర్తి వాళ్లందరిని ఇంట్లోకి పంపిస్తాడు.

తర్వాత కృష్ణమూర్తి చెప్పిన కొద్ది రాజ్ వినాయకుడి విగ్రహం తయారు చేస్తాడు. విగ్రహం బాగా వచ్చిందని కృష్ణమూర్తి చెబుతాడు. ఇంతలో కావ్య వచ్చి చూసి మురిసిపోతుంది. ఇప్పుడైనా ఒప్పుకో నీ మొగుడు సకలకళావల్లభుడు అని రాజ్ అంటాడు. మా నాన్న సాయంతో బాగా చేశారు అని కావ్య అంటే.. ఇంత కష్టపడి చేస్తే మీ నాన్నకు క్రెడిట్ ఇస్తావా అని కావ్య వెంట పడతాడు రాజ్.

రాజ్ చేసిన మట్టి వినాయక విగ్రహం

వాళ్లు సరదాగా అటు ఇటు తిరుగుతుంటే అప్పు, కల్యాణ్ వస్తారు. రాజ్ , కావ్య ఆనందం చూసి కల్యాణ్, అప్పు బాధపడతారు. కృష్ణుడి దగ్గరికి వెళ్లి మా అక్క జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావ్. అది ఏం తప్పు చేసిందని జరిగినవవన్నీ చెబుతుంది అప్పు. ఇప్పుడు కడుపులో బిడ్డను మా అక్క పాలిట మృత్యుదేవతను చేశావా. ఎందుకు మా అక్కకే ఇన్ని కష్టాలు. నువ్వు అన్నావన్నది నిజం కాదు. ఉండి ఉంటే మా అక్క జీవితం ఇలా ఉండేది కాదు అని అప్పు కోప్పడుతుంది.

లేని నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అన్న అప్పు కృష్ణుడి విగ్రహం పడేయటానికి తీస్తుంది. ఇంతలో కల్యాణ్ వచ్చి ఆపుతాడు. ఏం చేస్తున్నావని కోప్పడుతాడు. దేవుడు ఉన్నది నిజమే అయితే మా అక్కకు ఇలా చేయడు. అసలు దేవుడే లేడు అని అప్పు ఏడుస్తూ అంటుంది. కల్యాణ్ నచ్చజెప్పుతాడు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల నీ ప్రాణాలకు ప్రమాదమని ఎలా చెప్పను కూచి అని అప్పు ఏడుస్తుంది.

ఇప్పుడే వదినకు విషయం చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు ఇంకో ఆప్షన్ చెబుతానన్నారుగా. అప్పటి వరకు నువ్ ఎమోషనల్ అవ్వకు. ఎవ్వరికి చెప్పకు అని కల్యాణ్ అంటాడు. దాంతో ఏడుస్తూ కల్యాణ్‌ను హత్తుకుంటుంది అప్పు . అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్‌లో కావ్య, రాజ్, కృష్ణ మరియు అప్పుల మధ్య సంఘర్షణలు, కష్టాలు చూపించబడ్డాయి. రాజ్ చేసిన వినాయక విగ్రహం కావ్యను ఆకట్టుకుంది. అయితే, కావ్య ప్రెగ్నెన్సీ పరిస్థితి అనిశ్చితంగానే ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.