
📌 Key Points
- రేఖపై అపర్ణ తిరుగుబాటుతో షాక్ తిన్న కుటుంబ సభ్యులు!
- భూషణ్ దెబ్బకు మెట్లపై నుండి కిందపడ్డ సుభాష్!
- ఇందు, రాజుల గొడవతో ప్రారంభమైన పరిచయం!
- కావ్య కూతురిగా రేఖకు అపర్ణ స్ట్రాంగ్ వార్నింగ్!
బ్రహ్మముడి సీరియల్‌లో సరికొత్త ట్విస్ట్! అపర్ణ రేఖపై తిరుగుబాటు చేయడం సంచలనం రేపుతోంది. మరోవైపు భూషణ్ చేసిన పనికి సుభాష్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. రాజ్, కావ్యలాగే ఇందు, రాజుల పరిచయం గొడవతో మొదలైంది. ఈ ఎపిసోడ్ టాలీవుడ్ ప్రేక్షకులను షాక్‌కి గురిచేసింది.
రేఖపై తిరగబడ్డ అపర్ణ!
Brahmamudi Serial March 5th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 5వ తేది ఎపిసోడ్‌లో రుద్రాణి ఫొటోను ఇందు తుడుస్తుంది. ఇంతలో స్వాతి వచ్చి ఇందును తీసుకెళ్లేందుకు ట్రై చేస్తుంటే రుద్రాణి ఫొటో కింద పడి పగులుతుంది. అది తెలిసి ఇందును రేఖ కొట్టబోతుంది. అపర్ణ ఆపి రుద్రాణి ఏంటో చెబుతూ రేఖపై తిరగబడుతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నీళ్లు పట్టుకునే చోట ఆడవాళ్లందరితో రాజ్ గొడవ పడతాడు. రాజును అంతా చితకబాదుతారు. వాళ్ల నుంచి తప్పించుకుని నీళ్లు పట్టుకుంటాడు రాజు . తర్వాత అందరిని పిలిచి ఇలాగే కొట్టుకుంటే నీళ్లు అయిపోతాయ్ అని చెబుతాడు.
మరోవైపు రుద్రాణి ఫొటో క్లీన్ చేస్తుంది ఇందు. ఇంతలో స్వాతి వచ్చి తన ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పమని అడుగుతుంది. తర్వాత రుద్రాణి వాళ్ల గురించి నానమ్మ చెప్పింది, తిన్నింటివాసాలు లెక్కపెట్టారంటగా అని స్వాతి అంటుంది. ఇంతలో రేఖ పేరు చెప్పి స్వాతిని భయపెడుతుంది స్వాతి. ఇందును రమ్మని చేయి పట్టుకుని లాగుతుంది స్వాతి.
సుభాష్‌ను తోసేసిన భూషణ్!
ఈ పెనుగులాటలో రుద్రాణి ఫొటో కిందపడుతుంది. భ్రమరాంబ వచ్చి కోప్పడుతుంది. ఆ ఫొటో తనవల్లె పడిందని ఇందు చెబుతుంది. ఇంతలో రేఖ వచ్చి పొగరు పెరిగిందని అంటుంది. రేఖకు అంతా భయపడుతుంటారు. మా అమ్మను ఈ ఫొటోలోనే చూసుకుంటున్నాని తెలుసు, అయినా పగులగొట్టావంటే నేనంటే భయం పోయిందా అని రేఖ అంటుంది.
ఇందు కావ్య కూతురన్న విషయం గుర్తుంచుకో. కావ్య బతికి ఉన్నప్పుడు నీ అమ్మను ఏం చేసిందే మర్చిపోకు అని అపర్ణ అంటుంది. ఒక్కసారి కావ్యలో ఉన్న కోపం ఇందులో వస్తే మీ జీవితాలే తలకిందులు అవుతాయ్ అని సుభాష్ అంటాడు. ఇన్నేళ్లు గడిచిన మీలో పొగరు ఇసుమంత తగ్గలేదు. ఈరోజు నా మీదే నోరు లేచిందంటే నా మీద భయం పోయిందన్నమాట, ఇది మా అమ్మ ఫొటో పగలగొట్టడం నచ్చలేదు అని రేఖ అంటుంది.
గొడవతో మొదలైన ఇందు, రాజుల పరిచయం!
ఈ ధైర్యం నచ్చలేదు. చంపేస్తాను.. మీలో పుట్టికొచ్చిన ధైర్యాన్ని ఈరోజే చంపేస్తాను అని రేఖ అంటుంది. దాంతో రేఖ సైగ చేయడంతో భూషణ్ సుభాష్‌ను తీసుకెళ్లి మెట్లపై నుంచి పడేస్తాడు. దాంతో సుభాష్ అరుస్తాడు. సుబ్బు అంటూ ఇందు వెళ్తుంది. ఇందు, అపర్ణ ఇద్దరు కలిసి సుభాష్‌ను లేపి వీల్ చైర్‌లో కూర్చోబెడతారు. మీరు మనుషులా రాక్షసులా అని తిడుతుంది అపర్ణ .
నువ్వు చెప్పింది నిజమే కాస్తా ఆగి ఉండాల్సింది అని అపర్ణ అంటుంది. ఇంతలో స్వాతి వచ్చి నా వల్ల తిట్లు తిన్నందుకు సారీ చెబుతుంది. తర్వాత స్వాతి నవ్విస్తుంది. తన డౌట్ క్లియర్ చేయమని ఇందును తీసుకెళ్తుంది స్వాతి. తర్వాత ఎగ్జామ్‌కు వెళ్తున్న ఇందు కారుకు రాజ్ బైక్‌తో వచ్చి గుద్దుకుంటాడు. యాక్సిడెంట్ అవుతుంది.
బ్రహ్మముడి సీరియల్‌లో రోజుకో ట్విస్ట్ ఎదురుచూస్తూనే ఉంది. రేఖ, అపర్ణ మధ్య వైరం మరింత ముదిరిందా? సుభాష్ పరిస్థితి ఏంటి? ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


