
📌 Key Points
- కావ్యకు పాప పుట్టిన ఆనందం ఆవిరి: రుద్రాణి కుట్రతో బిడ్డల మార్పిడి!
- సాక్ష్యాలతో రాజ్ నిర్దోషి అని నిరూపించిన అప్పు: ఊహించని ట్విస్ట్!
- మంత్రి కూతురుగా కావ్య పాప: బ్రహ్మముడి సీరియల్‌లో సంచలన మార్పులు!
- తన బిడ్డ తనది కాదని కావ్య ఆందోళన: ఏం జరగనుందో చూడాలి!
బ్రహ్మముడి సీరియల్‌లో ఒక ఊహించని మలుపు తిరిగింది! రుద్రాణి తన కుట్రలతో బిడ్డలను తారుమారు చేసింది. అప్పు రాజ్ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించడంతో కథ మరింత ఉత్కంఠగా మారింది. ఈ సీరియల్ అభిమానులకు ఇది ఒక షాకింగ్ అప్డేట్.
రుద్రాణి ప్లాన్: బిడ్డలను మార్చేసిన వైనం!
బ్రహ్మముడి సీరియల్ జనవరి 15 ఎపిసోడ్‌లో కావ్యకు పాప పుడుతుంది. పాప బరువు తక్కువ ఉందని ఇంక్యూబెటర్‌లో పెడతారు. అక్కడ బిడ్డలను మార్చేస్తుంది రుద్రాణి. మరోవైపు రాజ్‌ను సాక్ష్యాలతో నేరం చేయలేదని నిరూపిస్తుంది అప్పు. మరోవైపు తన దగ్గర ఉన్న పాప తనకు పుట్టలేదని కావ్య గోల చేస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో డాక్టర్‌తో కావ్య కోపరేట్ చేస్తుంది. ఆపరేషన్ చేయమని రాజ్ అంటాడు. కానీ, డాక్టర్ కోప్పడుతుంది. క్రిమినల్ ఉండగా ఆపరేషన్ చేయలేం, మా హాస్పిటల్‌కు చెడ్డపేరు వస్తుందని డాక్టర్ అంటుంది. నా భార్య బిడ్డకు ప్రాణం పోయాలంతే ప్రాణాలతో ఉండాలి. నా భార్య ప్రాణం నేనే. అందుకు నేనే ఇక్కడే ఉండాలి అని వేడుకుంటాడు రాజ్ .
నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఆఫ్ డ్యూటీలో ఉన్న నాకు ఆర్డర్స్ వచ్చాయంటే ఎంత ప్రెజర్ ఉందో తెలుసుకోండి అని అప్పు అంటుంది. అంత డ్యూటీ చేయాలనుకుంటే రాజ్‌ను బయటకు తీసుకురమ్మని ఇంట్లో వాళ్లు అంటారు. రాజ్ బయటకు వచ్చాక అరెస్ట్ చేస్తామని కానిస్టేబుల్స్ అంటారు. నేను నా అత్తింటి వాళ్ల ముందు దోషిలా నిలబడ్డాను. రెండు నిండు ప్రాణాలు కాపాడటానికి నా కుటుంబానికి సహకరించాను. సారీ. మా బావ బయటకు రాగానే అరెస్ట్ చేసి తీసుకెళ్లండి అని అప్పు చెబుతుంది.
రాజ్ నిర్దోషిగా నిరూపణ: అప్పు సాహసం!
బావ ఇంట్లోకి పర్మనెంట్‌గా ఉండాలంటే అరెస్ట్ కావాలి. ఏదోటి చేసి బయటకు తీసుకొస్తా అని అప్పు అంటుంది. మరోవైపు రాజ్ సమక్షంలోనే కావ్యకు డెలివరి చేస్తారు. ఇంకోవైపు మినిస్టర్ ధర్మేంద్ర భార్య తులసికి కూడా డెలివరి చేస్తారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అప్పు రాజ్ కేసు ఫైల్ ఇవ్వమంటుంది. తర్వాత శాండీ సెల్ ఓపెన్ చేయమంటుంది అప్పు.
ఎఫ్ఐఆర్ తీసుకురమ్మని జనవరి 6న రాజ్‌ను కలిసిన శాండీ జనవరి 10న గోల్డ్ అమ్మినట్లు చెప్పాడు. కానీ, జనవరి 10న మా బావ ఆఫీస్‌కే వెళ్లలేదు. ఆరోజు మా ఇంట్లో మాకు సీమంతం చేశారు. కావాలంటే మీరు వీడియోలు, ఫొటోలు చూడొచ్చు అని చెప్పి కల్యాణ్‌తో చూపిస్తుంది అప్పు. అవి చూసిన ఎస్సై శాండీ అబద్ధం చెప్పాడని నమ్ముతాడు.
వీడితోనే నిజం రప్పించమని ఎస్సై అంటాడు. ఇదంతా ఎవరు చేయించమన్నారు అని అప్పు అడుగుతుంది. కానీ, శాండీ మాత్రం రాహుల్ తో జరిగింది గుర్తు చేసుకుంటాడు. వెనుక ముందు ఎవరు లేరు. పగతోనే ఇదంతా చేశానని చెప్పమని రాహుల్ చెప్పింది గుర్తు చేసుకుంటాడు శాండీ. అలాగే చెబుతాడు శాండీ.
కావ్య ఆవేదన: నా బిడ్డ నాకు దక్కలేదా?
కావ్య కు పాప పుట్టిందని, కాసేపట్లో చూడొచ్చు అని ఇంట్లోవాళ్లకు నర్స్ చెబుతుంది. మరోవైపు తులసి పాప ఏడవట్లేదు అని డాక్టర్స్ కంగారు పడతారు. పాపను అర్జంట్‌గా ఇంక్యూబెటర్‌లో పెట్టమని డాక్టర్ చెబుతాడు. తర్వాత ధర్మేంద్ర దగ్గరికి వెళ్లిన రుద్రాణి వాళ్ల పాప చనిపోయిందని, పాపను మార్చాలని చెబుతుంది.
దానికి మంత్రి ధర్మేంద్ర ఒప్పుకుంటాడు. కావ్య బిడ్డను మార్చి తులసి దగ్గర, తులసి బిడ్డను కావ్య దగ్గర పెడుతుంది రుద్రాణి. పాపను చూసిన కావ్య తనకు పుట్టిన బిడ్డ కాదని గోల చేస్తుంది. మంత్రి కూతురుగా కావ్య పాప పెరుగుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. రుద్రాణి ప్లాన్ ఏమిటి? కావ్య తన బిడ్డను కనుగొంటుందా? రాజ్ ఎలా బయటపడతాడు? మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి!


