
📌 Key Points
- లేటెస్ట్ ప్రోమోలో బిడ్డకు గుండె సమస్య ఉందని చెప్పిన డాక్టర్ అనురాధ!
- మంత్రి ఇంటికి వెళ్ళిన డాక్టర్ చక్రవర్తి కిడ్నాప్!
- బిడ్డ రిపోర్ట్స్ చూసి షాక్ అయిన డాక్టర్, ఆపరేషన్ ఖర్చు గురించి వెల్లడి
- కన్నబిడ్డను దక్కించుకోవడానికి కావ్య పోరాటం ప్రారంభం!
బ్రహ్మముడి సీరియల్‌లో సంచలన ట్విస్ట్! బిడ్డల మార్పిడి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. డాక్టర్ అనురాధ నిజాలు చెప్పడంతో కావ్య పోరాటం మొదలైంది. రాబోయే ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందో చూడాలి!
కావ్యకు షాక్ ఇచ్చిన డాక్టర్ అనురాధ
బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కావ్య వాళ్లు తీసుకొచ్చిన పాపకు ఉన్న గుండె సమస్య గురించి లేడి డాక్టర్ అనురాధ చెబుతుంది. దాంతో కావ్య డాక్టర్‌తో గొడవ పెట్టుకుంటుంది. తర్వాతి రోజు అనురాధ దగ్గరికి వచ్చి తల్లిగా ఆలోచించమని వేడుకుంటుంది. దాంతో కావ్యతో చేతులు కలుపుతుంది డాక్టర్ అనురాధ.
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో మంత్రి ఇంటికి వెళ్లి నిలదీసిన డాక్టర్ చక్రవర్తి తలపై కొట్టి బంధిస్తాడు ధర్మేంద్ర. చంపకుండా, నిజం బయటపడకుండా ఉండేందుకు చక్రవర్తిని కిడ్నాప్ చేస్తాడు మంత్రి. ఇకనుంచి హాస్పిటల్‌కు చక్రవర్తి రాడని హెడ్ నర్స్ నీలవేణికి కాల్ చేసి చెబుతాడు ధర్మేంద్ర .
పాప రిపోర్ట్స్ చూడమని రాజ్ కోరడంతో అనురాధ చూస్తుంది. పాప రిపోర్ట్స్ చూసిన డాక్టర్ అనురాధ షాక్ అవుతుంది. అసలు పాపకు ఎందుకు అలా అయిందని రాజ్ అడిగితే.. పాపకు హైపో ప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ అనే గుండె సమస్య ఉంది. దీని వల్ల బ్లడ్ పంపింగ్ సరిగా జరగదు. ఊపిరి అందదు అని డాక్టర్ అనురాధ చెబుతుంది. మరి ఇప్పుడు ఎలా అని రాజ్ అడిగుతాడు.
బిడ్డల మార్పిడిపై ఎంక్వైరీ షురూ!
ఆపరేషన్ చేయాలని, దానికి చాలా ఖర్చు అవుతుందని, ఆపరేషన్ చేసిన కూడా పాప బతుకుతుందని గ్యారెంటీ ఇవ్వలేమని డాక్టర్ అనురాధ చెబుతుంది. దాంతో రాజ్, కావ్య కంగారుపడతారు. ఇంతలోనే తనకు జరిగింది గుర్తు చేసుకున్ కావ్య ఒక్కసారిగా డాక్టర్ అనురాధపై విరుచుకుపడుతుంది.
రాజ్ కూడా కావ్యను ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ, కావ్య వినదు. డాక్టర్‌పై కోపంగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నా పాపను నాకు ఇచ్చి ఈ పాపను వారికే ఇచ్చేయండి. ఇందుకే బిడ్డలను మార్చారని కావ్య రచ్చ రచ్చ చేస్తుంది. దాంతో కావ్యను రాజ్ బలవంతంగా తీసుకెళ్తాడు. డాక్టర్ అనురాధ డిస్టర్బ్ అయిపోతుంది.
తర్వాత ఇంటికెళ్లిన రాజ్, కావ్యలను అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్ వాళ్లు పాపకు ఏమైందని అడుగుతారు. దాంతో పాపకు ఉన్న గుండె సమస్య గురించి చెబుతారు. దానికి అంతా ఒక్కసారిగా షాక్ అయి బాధపడతారు. పాప పుట్టిందని సంతోషించాలా, కావ్య పరిస్థితి, బిడ్డ అనారోగ్యం చూసి ఏడవాల అర్థం కావట్లేదని కుమిలిపోతారు.
కన్నబిడ్డ కోసం కావ్య ఉగ్రరూపం
నా కన్నబిడ్డను పట్టుకుందామని వెళ్తున్నా అని కావ్య చెబుతుంది. స్వప్న, అప్పు వద్దని వారిస్తారు. కానీ, కావ్య మాత్రం వినకుండా వెళ్తుంది. వెళ్లి డాక్టర్ అనురాధను కలుస్తుంది కావ్య. తన పాప మిస్సింగ్ గురించి అనురాధకు చెబుతుంది. కానీ, అనురాధ మాత్రం వినదు.
ఒక్కసారి మీరు పేషంట్లకు వైద్యం చేసే డాక్టర్‌గా కాకుండా బిడ్డకు ప్రాణం పోసే తల్లిగా ఆలోచించండి. ఈ అమ్మ వేదన ఏంటో మీకు అర్థం అవుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. ప్లీజ్ డాక్టర్ నాకు సహాయం చేయండి అని చేతులు జోడించి మొక్కుతూ ప్రాధేయపడుతుంది కావ్య .
కళావతి బిడ్డను పట్టుకునేందుకు, ఆస్పత్రిలో బిడ్డలను మార్చడంపై ఎంక్వైరీ చేసేందుకు కావ్యతో చేతులు కలుపుతుంది లేడి డాక్టర్ అనురాధ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కావ్య తన బిడ్డను తిరిగి పొందుతుందా? డాక్టర్ అనురాధ సహాయం చేస్తుందా? బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరుగుతుందో చూడటానికి వేచి ఉండండి! మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


