|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సీరియల్: షాకింగ్ ట్విస్ట్! గతం మరిచిన స్వరాజ్, రేఖ రివేంజ్ ప్లాన్ తో దుమ్ము రేపుతోంది!

Published: 26-02-2026, 11:35 PM
బ్రహ్మముడి సీరియల్: షాకింగ్ ట్విస్ట్! గతం మరిచిన స్వరాజ్, రేఖ రివేంజ్ ప్లాన్ తో దుమ్ము రేపుతోంది!
  • హాస్పిటల్‌లో అపర్ణను ఓదారుస్తున్న రేఖ, పాత పగతో రగిలిపోతున్న రేఖ!
  • భర్తకు దెబ్బ తగలడంతో కుమిలిపోతున్న అపర్ణ, దిక్కుతోచని స్థితిలో ఆమె!
  • గతం మర్చిపోయిన స్వరాజ్, కొత్త జీవితం ప్రారంభించే అవకాశం?
  • రేఖ కొత్త ఫ్యామిలీతో దుగ్గిరాల వారి ఆస్తిని కొల్లగొట్టేందుకు ప్లాన్!

బ్రహ్మముడి సీరియల్ లో సంచలన మార్పులు! స్వరాజ్ గతం మర్చిపోవడంతో కథ కొత్త మలుపు తిరిగింది. రేఖ తన పగతో దుగ్గిరాల ఫ్యామిలీని ఎలా టార్గెట్ చేస్తుందో చూడటానికి సిద్ధంగా ఉండండి!

స్వరాజ్ కి గతం మర్చిపోవడం వెనుక అసలు నిజం?

Brahmamudi Serial February 27th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 27 ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో అపర్ణ ఏడుస్తుంటుంది. రేఖ వచ్చి ఓదారుస్తుంది. దాంతో అరిచి రేఖను పంపించేస్తుంది. తనవెంట పడుతున్న బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని కొత్త ఫ్యామిలీతో ఆస్తి లాక్కునేందుకు ప్లాన్ చేస్తుంది రేఖ.

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో సీనియర్ డాక్టర్ వచ్చి సుభాష్ వెన్నుముకకు బలంగా దెబ్బ తగిలిందని, ఇక జీవితాంతం బెడ్ మీదే అని అపర్ణకు చెబుతాడు. ఆపరేషన్ చేయాలంటే కొంత కాలం ఆగాలి. ఆపరేషన్ చేసిన కూడా తిరిగి నడుస్తారని గ్యారెంటీ లేదని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.

ఇంతలో అపర్ణపై రేఖ చేయి వేస్తుంది. అన్యాయం చేసింది దేవుడు కాదు మా అన్నయ్య, మా అమ్మ. తన కడుపున పుట్టినందుకు సిగ్గుగా ఉంది. ఎంత బాధ ఉన్న లైఫ్‌లో ముందుకు వెళ్లాలిగా. మిమ్మల్ని నమ్ముకుని ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీకు తోడుగా నేనున్నాను. మీకు కూతురులా ఉంటాను అని రేఖ అంటుంది.

రేఖ కొత్త ప్లాన్ తో దుగ్గిరాల ఫ్యామిలీకి షాక్!

ఇక చాలు మిమ్మల్ని నమ్మింది చాలు. నిన్ను చూస్తుంటే మీ అమ్మ చేసిందే గుర్తుకు వస్తుంది. నిన్ను ఏం చేయకముందే ఇక్కడి నుంచి వెళ్లిపో అని అపర్ణ అరుస్తుంది. నేను ఎక్కడికి వెళ్లను, ఒంటరి ఆడదాన్ని. జాలి చూపించండి అని రేఖ అంటుంది. చూపించను. మీ అమ్మ కూడా ఇలాగే జాలి చూపించమని చెప్పి నా కుటుంబాన్నే నామరూపం లేకుండా చేసింది. నువ్వు ఉన్న పిల్లలను కూడా చంపేయాలనుకుంటున్నావా. వెళ్లిపో అని అపర్ణ అంటుంది.

బాబుకు ఏం గుర్తు లేదు. ఇలాంటి కేసుల్లో పది పదిహేను రోజుల్లో గతం గుర్తుకు వస్తుంది. నేను ట్యాబ్లెట్స్ రాసిస్తాను. మెల్లిగా గతం గుర్తు చేసే ప్రయత్నం చేయండి. ఎక్కువగా స్ట్రెస్ చేయకండి. తనకు తానే గుర్తు తెచ్చుకోవాలి. వారం తర్వాత తీసుకురండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. ఈ బాబు ఎవరో తెలుసుకోకుండా ఇంటికి తీసుకెళ్లడం అంటే ఎలా అని అతను అంటాడు.

కానీ, ఈ బాబును చూస్తే గుండె తరుక్కుపోతుంది. మీ ఫ్రెండ్‌తో వీడు ఎవడో తెలుసుకోనివ్వండి. ఇంటికి తీసుకెళ్లాక వాడికి గతం గుర్తుకు వస్తే అప్పుడు వాళ్ల వారికి ఇచ్చేద్దామని లక్ష్మీ అంటుంది. సరే బిల్ కట్టి వస్తానని లక్ష్మీ భర్త వెళ్లిపోతాడు. జరిగింది, కుటుంబాన్ని తలుచుకుంటూ అపర్ణ కుమిలిపోతుంటే.. మరోవైపు రేఖ పగతో రగిలిపోతుంది.

అపర్ణ ఏం చేస్తుంది? రేఖ ఆటలు సాగుతాయా?

ఇంతకుముందు మీ మమ్మీ దుగ్గిరాల కుటుంబంలో ఉండేది. ఇప్పుడు మీ దగ్గర ఏముంది. ఈ బిడ్డ తప్ప. నా తమ్ముడిది చిన్న కంపెనీ. ఇప్పుడు నిన్ను నమ్ముకుంటే ఏమొస్తుందని అతని అక్క అంటుంది. నన్ను నమ్ముకుంటే మీరు అనుకుంది వస్తుంది. మా అమ్మ చచ్చినా ఆశయం చావలేదు. ఆస్తి లాక్కుని అపర్ణ, చావ చచ్చిన సుభాష్‌ను పైకి పంపేస్తే పగ తీరుతుందని రేఖ అంటుంది.

ఇదంతా చేయాలంటే నాకు బలం కావాలి. ఆ సామ్రాజ్యం నడిపించడానికి తోడు కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆస్తి సొంతం చేసుకోవాలని రేఖ అంటుంది. పెళ్లి చేసుకుని మా ఇంటికి రావాలి లేదా మేమే మీ ఇంటికి రావాలి. నాకు పెళ్లయి భర్త, పిల్లలు కూడా ఉన్నారు. మేమంతా అక్కడికి రావడం అంటే అని ఆమె అంటే.. నాకు ఓకే. పెళ్లి చేసుకున్న మరుక్షణం మీరు నా ఫ్యామిలీ అవుతారని రేఖ అంటుంది.

ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. అన్ని రెడీగా ఉన్నాయని రేఖ అంటే.. వాళ్లు సరేనంటారు. మరోవైపు ఇంట్లో అపర్ణ, సుభాష్ ఒంటరిగా ఫీల్ అవుతారు. ఇది పాడుబడిన ఇల్లులా అనిపిస్తుందని అపర్ణ అంటుంది. ఇంతలో రేఖ పెళ్లి చేసుకుని వస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ లో రేపటి ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా ఉండబోతోంది. ఏం జరుగుతుందో చూడాలంటే మా ఛానల్ చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.