
బ్రహ్మముడి సీరియల్‌లో రేవతి జీవితంలో కీలకమైన మలుపు. రుద్రాణి ఇచ్చిన సలహాతో రేవతి జగదీశ్‌తో పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఇందిరాదేవి ఎలా స్పందిస్తుంది? రుద్రాణికి ఇంకేమి పన్నాగాలు ఉన్నాయి?
Key Points
రుద్రాణి సలహాతో రేవతి జగదీశ్‌తో పెళ్లి చేసుకుంటుంది.
ఇందిరాదేవి రేవతి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
రుద్రాణి తన పన్నాగాల గురించి ఆనందిస్తుంది, కానీ రాహుల్ హెచ్చరిస్తాడు.
రేవతి కొడుకు, మనవడిని అపర్ణ ఇంటికి తీసుకువచ్చిన అమ్మమ్మ.
రుద్రాణి సలహాతో రేవతి పెళ్లి
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఆరోజు రేవతి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఇలా బాధపడేవాళ్లం కాదు. అమ్మకు చెప్పంది ఏది చేసేదానివి కాదు. అలాంటిది ఇంతపెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావే అని రేవతిని అడుగుతుంది ఇందిరాదేవి .
ఇంట్లోవాళ్లను ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ, రుద్రాణి అత్తయ్య ఇచ్చిన సలహాతోనే ఇలా చేశాం అని జరిగింది చెబుతుంది రేవతి. జగదీశ్‌తో రేవతి కలిసి ఉండటం రుద్రాణి చూస్తుంది. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి అని రేవతి దగ్గరికి వెళ్లి ప్రేమించడం తప్పేం కాదే. ప్రేమించి పెళ్లి చేసుకోకుంటే తప్పు అని అంటుంది రుద్రాణి.
కూతురు డ్రైవర్‌న ప్రేమిస్తుందంటే నిన్ను కొడతారేమో, జగదీష్‌ను చంపేస్తారు. కాబట్టి, ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకో. అప్పుడే నీ ప్రేమ నిలబడుతుంది. నేరుగా పెళ్లి చేసుకుని వచ్చి అమ్మనాన్నల ముందు నిలబడు. అప్పుడు తప్పని పరిస్థితులో ఒప్పుకుంటారు. పక్కనే నేను ఉంటాను కాబట్టి మీకు సపోర్ట్ చేస్తాను అని రుద్రాణి అంటుంది.
దాంతో సరే అని రేవతి అంటుంది. ఇదంతా ఆ దొంగ మొహం రుద్రాణి ఇచ్చిన సలహానా. దానికి సరైన బుద్ధి చెబుతాను అని ఇందిరాదేవి కోప్పడుతుంది. అనుకున్నా. ఇంట్లో అంత దారుణం జరిగితే రుద్రాణి గారి హస్తం లేదా అని డౌట్ వచ్చింది అని కావ్య అంటుంది. మరోవైపు రేవతిని వెళ్లగొట్టినందుకు రుద్రాణి తెగ సంబరపడుతు తీన్‌మార్ డ్యాన్స్ చేస్తుంది.
ఇందిరాదేవి ఆగ్రహం
ఇలా ఇంట్లో డ్యాన్స్ చేయడం ఎవరైనా చూస్తే మన మీద డౌట్ వచ్చే అవకాశం ఉందని రాహుల్ అంటాడు. దాంతో రుద్రాణి ఆగిపోతుంది. గతంలో చేసింది, ఇవాళ చేసింది, అపర్ణను రెచ్చగొట్టింది చెబుతుంది రుద్రాణి. ఈ ఆస్తి మొత్తం మన చేతికి రావాలంటే రాజ్‌ను యామినికి అప్పజెప్పాలి అని రుద్రాణి అంటుంది. ఇంతలో ఇందిరాదేవి డోర్ తీస్తుంది.
ఇద్దరిని కోపంగా చూస్తుంది. నీకు గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను అంటే రుద్రాణి తెగ సంతోషపడుతుంది. దాంతో ఒక్కటి లాగిపెట్టి కొడుతుంది. ఇది 15 ఏళ్ల క్రితం చేసినదానికి ఇప్పుడు కొట్టాను. నాకు ఇప్పుడే గుర్తు వచ్చిందని చెప్పి వెళ్లిపోతుంది ఇందిరాదేవి. మరోవైపు రాజ్‌ను సీరియస్‌గా కావ్య చూస్తుంటే రాజ్ భయపడిపోతాడు. రాజ్ ఇచ్చిన ఐడియా గురించి తిడుతుంది కావ్య.
ఇదంతా మనకు మంచే జరిగింది. ఇప్పుడు రేవతి మీద అమ్మకు కోపం ఎలా ఉందో తెలిసింది కదా. ఆ కోపాన్ని పోగొట్టాలి. కూతురి వల్ల మనసు కరగలేదు కాబట్టి మనవడితో కరిగించాల్సిందే అని రాజ్ మరో ఐడియా ఇస్తాడు. ఈ ఒక్కసారికే రెండో ఛాన్స్ ఇస్తున్నా. ముందు ఆ ప్లాన్ చెప్పండి అని కావ్య అంటుంది. అమ్మను గుడికి తీసుకురా. నేను అక్కను ఒప్పించి కరెక్ట్ టైమ్ చూసి మనవడిని దింపుతా అని రాజ్ అంటాడు.
మరుసటి రోజు ఉదయం అపర్ణను కావ్య దొంగచాటుగా చూస్తే ఏం చేస్తున్నావ్ ఇందిరాదేవి అంటుంది. దాంతో భయపడుతుంది కావ్య. గుడి విషయం చెప్పి అపర్ణ దగ్గరికి టీ తీసుకెళ్తుంది కావ్య. దాంతో అపర్ణ కోపడుతుంది. ఇందిరాదేవి వచ్చి అపర్ణను సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పి ఇన్‌డైరెక్ట్‌గా తిడుతుంది. మరి ఇంత చేసిన ఆవిడ నాతో గుడికి ఎందుకు రావట్లేదని కావ్య అంటుంది.
రుద్రాణి యొక్క పన్నాగాలు
నేను గుడికి వెళ్లట్లేదని ఎవరు చెప్పారు. నేను వెళ్తున్నాను. ఎవరైనా వెళ్లేవాళ్లుంటే వెళ్లొచ్చు అని అపర్ణ వెళ్లిపోతుంది. తర్వాత కావ్యకు రాజ్ కాల్ చేస్తాడు. అత్తయ్యను ఒప్పించినట్లు కావ్య చెబుతుంది. రేవతి అక్క వరకు ఒప్పించాను. బాబు సంగతి చెప్పలేదు అని రాజ్ అంటాడు. రేవితి గారిని కన్విన్స్ చేయడానికి కావ్యను ముందే రమ్మంటాడు రాజ్.
దాంతో కావ్య బయలుదేరుతుంది. మరోవైపు రేవతి దగ్గిరికి కొడుకు స్వరాజ్ వచ్చి ఆకలి వేస్తుంది, టిఫిన్ పెట్టమని అంటాడు. రేవతి పట్టించుకోదు. జగదీశ్ వచ్చి బాబు అడుగుతుంటే పట్టనట్లు అంతలా పరధ్యానంగా ఉన్నావేంటీ అని అడుగుతాడు. తర్వాత గుడి నుంచి మనవడు స్వరాజ్‌ను ఇంటికి తీసుకొస్తుంది అపర్ణ. దాంతో దుగ్గిరాల కుటుంబం షేక్ అవుతుంది.
ఈ ఇంటికి ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లుంది అని ఇందిరాదేవి హాల్లోకి వచ్చి చూస్తే రేవతి కొడుకు ఉంటాడు. ఈ బాబు గుడిలో తప్పిపోయాడని, అందుకే తీసుకొచ్చినట్లు చెబుతుంది అపర్ణ. ఈ బాబును ఎక్కడో చూసినట్లుందని స్వప్న, అప్పు డౌట్ పడతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరిగా, రేవతి పెళ్లితో కుటుంబంలో కలతలు, రుద్రాణి యొక్క కుట్రలు, మరియు అపర్ణ ఇంటికి మనవడు రాకతో ఎపిసోడ్ ముగుస్తుంది. అన్ని విషయాలు ఎలా అవుతాయో వచ్చే ఎపిసోడ్‌లో చూడాలి.

