
📌 Key Points
- కావ్య మోడలింగ్‌కు నిరాకరించడంతో, ధాన్యలక్ష్మీ మోడల్‌గా ముందుకు వచ్చింది.
- అంజలి తండ్రి అశోక్ కాదని, రేణుక రెండో భర్త అని నిజం చెప్పింది.
- అంజలి తండ్రి గురించి రేణుక, అశోక్‌లను అప్పు నిలదీసింది.
- రాజ్ దగ్గరికి ఫేక్ డైరెక్టర్‌ను పంపి రాహుల్ కుట్ర పన్నాడు.
బ్రహ్మముడి డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. కావ్య మోడలింగ్‌కు నో చెప్పడంతో ధాన్యలక్ష్మీ రంగంలోకి దిగింది. అంజలి తండ్రి గురించి రేణుక చెప్పిన నిజాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మరోవైపు రాహుల్ ప్లాన్ రాజ్‌ను ఇరుకున పడేస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.
మోడల్‌గా ధాన్యలక్ష్మీ: కావ్య నిరాకరణతో కొత్త ట్విస్ట్!
బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో ట్రెడిషనల్‌గా ఉన్న కావ్య ఫొటో చూసి మోడల్‌గా అనుకుంటాడు రాజ్. కానీ, కావ్య మోడలింగ్‌కు ఒప్పుకోదు. దాంతో మోడల్‌గా ధాన్యలక్ష్మీ రెడీ అయి వస్తుంది. మరోవైపు అంజలి తండ్రి అశోక్ కాదని, తనకు రెండో భర్త అని రేణుక నిజాలు చెబుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య మోడ్రన్ డ్రెస్సులో ఉన్న ఫొటోను డీపీగా పెట్టుకుని, ఫ్యామిలీ అందరికి చూపిస్తానంటాడు రాజ్. దాంతో వద్దని ఫోన్ తీసుకునేందుకు కావ్య ట్రై చేస్తుంది. తర్వాత రాజ్‌ను గట్టిగా సోఫాలో పడేసి ముద్దులు పెట్టినట్లు చేసి మురిసిపెడుతుంది కావ్య. తర్వాత కాసేపటికి భయపడిన రాజ్ ఫోన్ ఇస్తాడు.
మరోవైపు రేణుక, అశోక్‌లను అప్పు ఇన్వేస్టిగేట్ చేస్తుంది. మీ ఇద్దరు నాకెందుకు అబద్ధం చెప్పారని అప్పు అడుగుతుంది. పాప వివరాలు అన్ని సరిగ్గానే చెప్పాం కదా అని రేణుక అంటుంది. కనిపించకుండా పోయిన మీ పాపకు తండ్రి ఎవరు అని అప్పు అడిగితే రేణుక తడబడుతుంది. పాపకు నేనే తండ్రిని అని అశోక్ అంటాడు. అయితే మరి పాపకు నీకు డీఎన్ఏ ఎందుకు మ్యాచ్ అవ్వలేదని చాలా కోప్పడుతుంది అప్పు .
రేణుక చెప్పిన షాకింగ్ నిజాలు: అంజలి తండ్రి ఎవరు?
అప్పుడు రేణుక నిజం చెబుతుంది. అంజలి అశోక్ కూతురు కాదు. అశోక్ నా రెండో భర్త. నా మొదటి భర్త యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత అశోక్ దగ్గరయ్యాడని రేణుక చెబుతుంది. మరి ఆ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదని అప్పు కోప్పడుతుంది. అశోక్ చెప్పొద్దన్నాడు. మీకే కాదు ఎవరికి చెప్పొద్దు. పాపకు నేనే తండ్రిని. నేను నీకు రెండో భర్తను అని తెలియొద్దు. నువ్వు బాధపడొద్దు అని రేణుక అంటుంది.
ఇరిటేట్ అయిన అప్పు ఇందులో ఏదో తిరకాసు ఉంది. ఏదో మిస్ అవుతున్నా. మళ్లీ కేసు క్లియర్‌గా చూడాలనుకుంటుంది అప్పు. మరోవైపు అంతా డిన్నర్‌లో కూర్చుంటారు. పాపం రాజ్ గాడు బాగా ఫీల్ అవుతున్నాడు. ఇంకాస్తా పొడుద్దాం అని యాడ్ ఫిల్మ్ షూటింగ్ గురించి అడుగుతాడు రాహుల్. మోడల్ హ్యాండ్ ఇచ్చిందని రాజ్ చెబుతాడు.
రాహుల్ ప్లాన్: రాజ్ దగ్గరికి ఫేక్ డైరెక్టర్ ఎంట్రీ!
రాహుల్ చూడు మోడల్‌ను నమ్ముకోకుండా తన భార్యతో షూట్ చేశాడని ప్రకాశం అంటే.. దేనికైనా ప్లానింగ్ ఉండాలని రాహుల్, దాన్నే ముందు చూపు అంటారని రుద్రాణి అంటారు. అంటే రాజ్ కంటే రాహుల్ బాగా ఆలోచించాడని ఇన్‌డైరెక్ట్‌గా అంటారు. తర్వాత మోడల్ ఉంది. కానీ, తనే ఒప్పుకోవట్లేదు అని కావ్య గురించి చెబుతాడు రాజ్. చాలా మంచి ఐడియా అని సుభాష్ అంటాడు.
యాడ్ షూటింగ్‌కు క్యాప్షన్ చెబుతుంది ధాన్యలక్ష్మీ. అంతా వద్దంటారు. భరించలేకపోతున్నామంటారు. మీకు టేస్ట్ లేదని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. మరోవైపు రాత్రి పరాట కాల్చుకునే వాడి దగ్గరికి వెళ్లి రాజ్ దగ్గర యాడ్ షూట్ డైరెక్టర్‌గా నటించాలని చెబుతాడు రాహుల్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ బ్రహ్మముడి సీరియల్‌లో అనేక నాటకీయ పరిణామాలకు వేదికైంది. రేణుక నిజం చెప్పడం, రాహుల్ కుట్ర కొనసాగడం కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. రాజ్, కావ్యల జీవితాల్లో ఈ సంఘటనలు ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.


