|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సెప్టెంబర్ 23 ఎపిసోడ్: కావ్యకు తెలియకుండానే అబార్షన్.. డాక్టర్ కాళ్లు పట్టుకోబోయిన రాజ్.. చూసేసిన కళావతి

Published: 22-09-2025, 10:15 PM
బ్రహ్మముడి సెప్టెంబర్ 23 ఎపిసోడ్: కావ్యకు తెలియకుండానే అబార్షన్.. డాక్టర్ కాళ్లు పట్టుకోబోయిన రాజ్.. చూసేసిన కళావతి

బ్రహ్మముడి సీరియల్ 833వ ఎపిసోడ్ లో అనేక ఉత్కంఠ భరిత సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజ్ తీసుకున్న ఒక కష్టమైన నిర్ణయం, అతని కుటుంబ సభ్యులతో అతని సంఘర్షణలు ఈ ఎపిసోడ్ లో ప్రధానంగా చూపించారు.

Key Points

1

కావ్యకు తెలియకుండా అబార్షన్ చేయించాలని రాజ్ నిర్ణయం

2

కళ్యాణ్ రాజ్ ని అడ్డుకుని వదినను కాపాడమని సలహా ఇవ్వడం

4

రాజ్ రాహుల్ మరియు రుద్రాణిని తిట్టడం

కావ్యకు తెలియకుండా అబార్షన్

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 833వ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ ఎపిసోడ్ మొత్తం రాజ్ చుట్టూనే తిరిగింది. బిడ్డను కోల్పోవడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం, అయితే కావ్యకు తెలియకుండా ఆ పని చేయాలనుకోవడంలాంటి సీన్లు బాధ కలిగిస్తాయి. ఇంకా ఏం జరిగిందో చూడండి.

వదినకు అబార్షన్ చేయించాల్సిందేనన్న కల్యాణ్

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ హాస్పిటల్లో ఓ వ్యక్తిని రాజ్ తిడుతున్న సీన్ తో మొదలవుతుంది. డబ్బు లేదని బిడ్డను తీసేయడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తానని రాజ్ అంటాడు. అప్పుడే కల్యాణ్ వచ్చి అతన్ని అడ్డుకుంటాడు. వాళ్లకు క్షమాపణ చెబుతాడు.

రాజ్ ను బయటకు తీసుకెళ్లి ఏం చేస్తున్నావని అడుగుతాడు. ప్రాక్టికల్ గా ఆలోచించు.. బిడ్డను వదులుకొని వదినను కాపాడుకో అని అతనికి స్పష్టం చేస్తాడు. కడుపు నిండిన వాడికి ఆకలి.. కడుపు పండిన వాడికి బిడ్డ విలువ తెలియదని రాజ్ కు నచ్చచెబుతాడు. దీంతో కావ్యకు అబార్షన్ చేయించాలన్న నిర్ణయానికి రాజ్ వస్తాడు.

రుద్రాణి, రాహుల్ కొత్త కుట్ర

రాజ్ మరియు కళ్యాణ్ మధ్య సంఘర్షణ

అటు రాహుల్ పరిస్థితి చూసిన రుద్రాణి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె దగ్గరకు వచ్చిన రాహుల్.. కంపెనీని దక్కించుకోవడానికి ఇదే సరైన సమయం అని చెబుతాడు. రాజ్ పరిస్థితి బాలేదు.. కావ్య వెళ్లలేదు.. నేనే నేరుగా వెళ్లి కంపెనీ బాధ్యతలు ఇవ్వమని అడుగుతానని రుద్రాణితో అంటాడు రాహుల్. తానూ వస్తానని రుద్రాణి అంటే.. వద్దు నిన్ను ఇంట్లో అందరూ ఓ నెగటివ్ ఎనర్జీ అనుకుంటున్నారు.. నువ్వు వస్తే రాజ్ వినడు.. నేనే కన్విన్స్ చేస్తానని వెళ్తాడు.

రాహుల్‌, రుద్రాణిలకు క్లాస్ పీకిన రాజ్

రాజ్ ఇంటికి రాగానే రాహుల్ అతని దగ్గరికి వెళ్లి కంపెనీ గురించి మాట్లాడాలి అని అంటాడు. నువ్వు వెళ్లడం లేదు.. కావ్య వెళ్లేలా లేదు.. పెద్ద మామయ్య, చిన్న మామయ్య కూడా పట్టించుకోవడం లేదు.. అందుకే తాను కొన్నాళ్ల పాటు కంపెనీ బాధ్యతలు చూసుకుంటానని రాజ్ తో అంటాడు రాహుల్. దీంతో రాజ్ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కంపెనీ నడపడం అంటే ఆటలు అనుకుంటున్నావా.. సిటీలో అన్ని కంపెనీలతో పోటీ పడి నడపడం చిన్న విషయం కాదు.. నీకు అంత తెలివి లేదు అని తిడతాడు.

దీంతో రుద్రాణి సీన్ లోకి ఎంటరవుతుంది. నా కొడుకును తిట్టినా ఏమీ అనను కానీ.. తెలివి లేదు అంటే మాత్రం ఊరుకోనని అంటుంది. కంపెనీపై మీకు ఎంత హక్కు ఉందో తమకూ అంతే హక్కు ఉందని చెబుతుంది. రాహుల్ ఇంట్లో వాడైతే ఎండీ పదవి రాదు.. ఇంటెలిజెన్స్ ఉండాలని రాజ్ స్పష్టం చేస్తాడు. తాను మీ నాన్నమ్మకు పుట్టిన దానిని కాదు కాబట్టే ఇలా చేస్తున్నావని రుద్రాణి అనడంతో ఇందిరా దేవి వచ్చి ఆమెను తిడుతుంది. అలా అనుకుంటే నిన్ను ఇప్పటి వరకూ ఇంట్లోనే ఉండనిచ్చేదానిని కాదని, ఇక్కడి నుంచి వెళ్లిపోమని అంటుంది.

బిడ్డ కోసం రాజ్ ఎమోషనల్..

రుద్రాణి మరియు రాహుల్ కుట్రలు

కావ్య నీకోసం తినకుండా ఎదురుచూస్తోందని ఇందిర చెప్పడంతో రాజ్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందని కల్యాణ్ ను అడిగినా అతడు చెప్పకుండా వెళ్లిపోతాడు. అటు రాజ్ వెళ్లేసరికి కావ్య పడుకొని ఉంటుంది. ఆమె కడుపుపై చేయి వేసి బిడ్డతో మాట్లాడుతూ రాజ్ ఎమోషనల్ అవుతాడు.

ఏం జరిగినా చూసుకోవడానికి నాన్న ఉన్నాడని అమ్మ చెబితే హాయిగా పడుకున్నావా.. కానీ ఈ నాన్న నమ్మకద్రోహం చేయడానికి వచ్చాడు.. ఇంకా పూర్తిగా రూపం దాల్చని నీ ఊపిరి తీయాలనుకుంటున్నాను.. నేను చాలా స్వార్థపరుడిని.. నీ ఊపిరి తీసి మీ అమ్మ ప్రాణం కాపాడాలని అనుకుంటున్నాని రాజ్ బిడ్డతో మాట్లాడుతూ ఎమోషనల్ అవుతాడు.

కావ్యకు తెలియకుండానే అబార్షన్

అయితే ఈ విషయం మీ అమ్మకు తెలియకుండానే అబార్షన్ చేయించబోతున్నట్లు కూడా చెప్పి కంటతడి పెడతాడు. అప్పుడే కావ్య నిద్ర లేస్తుంది. మీరు నాకోసం కాదు.. ఎవరి కోసం వచ్చారో తెలుసు.. నేను బాగా చూసుకుంటున్నానో లేదో మీ బిడ్డను అడగడానికి వచ్చారు కదా.. ఆరు నెలలు ఆగితే బిడ్డను తీసి మీ చేతుల్లో పెడతాను.. బాగా చూసుకోండి.. బిడ్డ వచ్చినా నా ప్రేమ మొత్తం మీకే అని కావ్య అనడంతో రాజ్ మరింత ఎమోషనల్ అవుతాడు.

ఇంకా కడుపులోనే ఉన్న బిడ్డపై మనం మరీ అంత ప్రేమ పెంచుకోవడం కూడా మంచిది కాదేమో అని రాజ్ అంటాడు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లి కావ్యకు తెలియకుండానే ఆపరేషన్ చేసిన అబార్షన్ చేయాలని రాజ్ అడుగుతాడు. తెలియకుండా చేయడం కరెక్ట్ కాదని డాక్టర్ అనడంతో ఆమె కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమవుతాడు రాజ్. అప్పుడే కావ్యకు అక్కడకు రావడం, అది వినడంతో షాక్ తింటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్ రాజ్ యొక్క కష్టాలను, అతని నిర్ణయాల వల్ల కలిగే పరిణామాలను చూపిస్తుంది. కావ్య, రాజ్, మరియు ఇతర పాత్రల భవిష్యత్తు ఏమిటో తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.