|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వక్‌సేన్ ‘లెగసీ’లో కన్నడ అందం… ఆమె ఎంట్రీతో టాలీవుడ్‌లో కొత్త చర్చ! ఫస్ట్ లుక్ వైరల్.

Published: 06-01-2026, 5:00 AM
విశ్వక్‌సేన్ 'లెగసీ'లో కన్నడ అందం... ఆమె ఎంట్రీతో టాలీవుడ్‌లో కొత్త చర్చ! ఫస్ట్ లుక్ వైరల్.
  • విశ్వక్ సేన్ ‘లెగసీ’ చిత్రంలో రాజకీయ నాయకుడి వారసత్వ కథ నేపథ్యం.
  • ఈ చిత్రం సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో కలాహీ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
  • కన్నడ నటి ఏక్తా రాథోడ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది.
  • ఏక్తా రాథోడ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న ‘లెగసీ’ చిత్రంలో కొత్త కబురు! ఈ మూవీలో ఆయనకు జోడీగా కన్నడ బ్యూటీ ఏక్తా రాథోడ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర, విశ్వక్‌సేన్‌తో ఆమె కెమిస్ట్రీపై అంచనాలు భారీగా పెరిగాయి.

విశ్వక్ సేన్ ‘లెగసీ’: కథా నేపథ్యం

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్(Vishwak Sen) నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో ‘లెగసీ’ (Legacy)ఒకటి. ఈ మూవీ అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథగా రాబోతున్నట్లు సమాచారం. అధికార పీఠాన్ని అధిరోహించేందుకు రక్తం ఎలా ఏరులైపారుతుంది? ఎంతమంది జీవితాలను మట్టు పెట్టి అందలం ఎక్కుతున్నారు? అనే స్టోరీతో రాబోతున్నట్లు టాక్. ఈ సినిమా సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో తెరకెక్కనుంది. కలాహీ మీడియా బ్యానర్‌పై దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, సచిన్ ఖేదేకర్, మురళి మోహన్, కేకే మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా.. న్యూ ఇయర్ సందర్భంగా మూవీ మేకర్స్ పవర్ ఫుల్ టీజర్‌తో అంచనాలను పెంచేశారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నట్లు టాక్. తాజాగా, ఈ సినిమాలో ఓ కన్నడ బ్యూటీ నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. నేడు ఏక్తా రాథోడ్ (Ekta Rathod)పుట్టిన రోజు కావడంతో విషెస్ తెలుపుతూ.. విశ్వక్ సేన్‌కు జోడీగా నటించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా లంగా ఓణీలో సంప్రదాయ లుక్‌లో భుజంపై రామచిలుకతో మెస్మరైజింగ్ లుక్‌లో కనిపించగా.. పక్కనే విశ్వక్‌సేన్ నవ్వులు చిందిస్తున్నట్లు ఉన్న లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాతో ఏక్తా రాథోడ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. పలు కన్నడ చిత్రాల్లో నటించిన ఈ భామ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ మాస్ హీరోతో రొమాన్స్ చేయనుంది.

టాలీవుడ్‌లోకి ఏక్తా రాథోడ్ ఎంట్రీ

ఫస్ట్ లుక్ లో విశ్వక్-ఏక్తా లుక్

ఏక్తా రాథోడ్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం, విశ్వక్‌సేన్‌తో ఆమె జోడీ ‘లెగసీ’ చిత్రానికి మరింత హైప్ తెచ్చింది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుండగా, ఆమె నటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.