|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పాక్ ఉగ్రదాడి: భారత్‌పై నిందలు.. కేంద్రం ఘాటు కౌంటర్!

Published: 28-06-2026, 9:12 PM
పాక్ ఉగ్రదాడి: భారత్‌పై నిందలు.. కేంద్రం ఘాటు కౌంటర్!
  • కరాచీలోని సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఉగ్రదాడి.
  • ఈ దాడిలో నలుగురు సైనికులు మృతి, ఆరుగురు ఉగ్రవాదులు హతం.
  • ఆధారాలు లేకుండానే భారత్‌పై పాకిస్తాన్ నిరాధార ఆరోపణలు.
  • పాక్ తన సొంత గడ్డపై ఉగ్రవాదంపై దృష్టి పెట్టాలని భారత్ ఘాటు కౌంటర్.

పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, పాక్ భారత్‌పై నిరాధార ఆరోపణలు చేసింది. దీనిపై భారత కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. తన అంతర్గత భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భారత్‌పై నిందలు వేయడం మానుకోవాలని పాక్‌కు హితవు పలికింది.

కరాచీలో ఉగ్రదాడి: వివరాలు

పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై శనివారం రాత్రి ఉగ్రదాడి జరిగింది. గులిస్తాన్-ఇ-జౌహర్‌లో గల ఈ పారామిలటరీ కాంపౌండ్‌ ప్రధాన గేటును తొలుత పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనం ఢీకొట్టింది. అనంతరం లోపలికి చొరబడిన ఉగ్రవాదులు హ్యాండ్ గ్రెనేడ్లతో విరుచుకుపడుతూ కాల్పులు జరిపారు. దీంతో బలగాలు స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. దాదాపు గంటన్నర పాటు ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు మరణించగా, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో గాయపడిన ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. కాగా.. ఈ దాడికి నిషేదిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ గ్రూప్‌కు చెందిన జమాత్-ఉల్-అహ్రార్ బాధ్యత వహించింది.

కరాచీలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ భారత్‌పై నిందలు వేసింది. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ, ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఎలాంటి ఆధారాలు లేకుండానే ఈ దాడి వెనుక ‘భారతీయ ప్రాక్సీల’ హస్తం ఉందని ఆరోపించారు. విదేశీ నిధులతో, విదేశీ శక్తుల కనుసన్నల్లో పనిచేసే ఉగ్రవాద ముఠాలు పాకిస్తాన్‌ను అస్థిరపరచాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. కానీ వారి దుష్ట సంకల్పాలు ఎప్పటికీ నెరవేరవు అని వ్యాఖ్యానించారు. ఆ దేశ అంతర్గత భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్‌పై నిందలు వేస్తూ అక్కసు వెళ్లగక్కారు.

భారత్‌పై పాక్ నిందలు: ఆరోపణలు

ముందు ఆత్మపరిశీలన చేసుకోండి : భారత్ కౌంటర్

కేంద్రం ఘాటు కౌంటర్: భారత్ స్పందన

ఈ ఉగ్రదాడికి భారత్ కారణం అంటూ పాక్ చేసిన ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ చేసిన నిరాధారమైన ఆరోపణలను కొట్టిపారేసింది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి తమ సొంత భూభాగంలో ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై దృష్టి పెట్టాలని ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. పాక్ ఇతరులపై నిందలు వేయడం ఆపి, తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన సొంత గడ్డపై ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో ఆదివారం మాట్లాడుతూ.. పాక్ ఆరోపణలను ఖండిస్తున్నట్టు తెలిపారు. పాక్ ఇతర దేశాలను వేలెత్తి చూపడానికి ముందే తమ అంతర్గత భద్రతా సవాళ్లను గుర్తించాలని అన్నారు. ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిదని సూచించారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగించుకునే అలవాటు నుండి బయటపడాలని తెలిపారు.

పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలి. ఇతరులపై నిందలు వేయడం ద్వారా నిజమైన సమస్యలు పరిష్కారం కావని భారత్ స్పష్టం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.