|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాను ఇండస్ట్రీ హిట్‌గా మార్చిన రాజమౌళి! ఇది కదా అసలు ట్విస్ట్ అంటే!!

Published: 10-02-2026, 11:05 PM
షాకింగ్: ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాను ఇండస్ట్రీ హిట్‌గా మార్చిన రాజమౌళి! ఇది కదా అసలు ట్విస్ట్ అంటే!!
  • యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌ను మార్చిన ‘సింహాద్రి’ మూవీ వెనుక అసలు కథ ఇదిగో!
  • రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 33 కోట్లు వసూలు చేసింది.
  • 2003 జులై 11న విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్‌కు స్టార్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది.
  • ఈ మూవీ ప్రారంభోత్సవానికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మీకు తెలుసా? ఒక సినిమా ఆగిపోతే, రాజమౌళి వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా ఎలా మార్చారో తెలుసుకుందాం!

రాజమౌళితో ఎన్టీఆర్ జర్నీలో షాకింగ్ నిజాలు!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఆయన లెక్కలు మారిపోయాయి. `దేవర`తో పాన్‌ ఇండియా హిట్‌ని అందుకున్నారు. కానీ `వార్‌ 2` తో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ మూవీతో అంతా తలక్రిందులయ్యాయి. ప్లాన్స్ అన్నీ బెడిసి కొట్టాయి. ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ తర్వాతనే కొత్త సినిమా అప్‌ డేట్స్ రాబోతున్నాయి. అయితే త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది ఆగిపోయిందా? ఉందా అనేది క్లారిటీ లేదు. అలాగే `దేవర 2` చేయాల్సి ఉంది. ఎప్పుడు ఏ సినిమా చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే కెరీర్‌ బిగినింగ్‌ లో ఎన్టీఆర్‌ విషయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్నాయి. `స్టూడెంట్‌ నెం 1` టైమ్‌లో దర్శకుడు రాజమౌళి.. తారక్‌ని చూసి వీడేంటి ఇలా ఉన్నాడని అనుకున్నాడట. ఎన్టీఆర్‌ లావుగా ఉండటంతో వీడు హీరోనా అని మనసులో అనుకున్నాడట. ఆ తర్వాత రియలైజ్‌ అయ్యాడు, ఇద్దరు కలిసి నాలుగు సినిమాలు చేశారు.

సింహాద్రి సినిమా వెనుక అసలు కథ ఏంటో తెలుసా?

ఇదిలా ఉంటే `స్టూడెంట్‌ నెం 1` తర్వాత తారక్‌కి హిట్‌ లేవు. వరుసగా నాలుగు సినిమాలు డిజాస్టర్‌ అయ్యాయి. దీంతో ఎలాగైనా మంచి సినిమా చేయాలని పవన్‌ శ్రీధర్‌ దర్శకత్వంలో దొరస్వామి రాజు ఓ సినిమాని నిర్మించారు. దాదాపు 40 రోజులు చిత్రీకరణ జరిపారు. ఔట్‌పుట్‌ చూసుకున్నాక సరిగా రాలేదట. ఇది ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి సెట్‌ అయ్యేలా లేదని చెప్పి ఆ సినిమాని పక్కన పెట్టారు. ఆ తర్వాత మళ్లీ రాజమౌళిని తీసుకొచ్చారు. ఆయన మరో కథని రెడీ చేశారు. అలా సేమ్‌ బ్యానర్‌లోనే ఎన్టీఆర్‌ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేశారు. ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. అదే `సింహాద్రి`.

ఎన్టీఆర్ కెరీర్‌ను మార్చిన దర్శకుడు రాజమౌళి!

ఎన్టీఆర్‌ హీరోగా, భూమిక, అంకిత హీరోహీరోయిన్లుగా నటించారు. దొరస్వామి రాజు, విజయ్‌ కుమార్‌ వర్మ నిర్మించారు. ఈ సినిమా ఓపెనింగ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2003 జులై 11న విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. రూ.8 కోట్లతో రూపొంది, రూ.33కోట్లు వసూలు చేసింది. వంద రోజులకుపైగా ఆడింది. అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్‌గా చెప్పొచ్చు. ఈ సినిమాతోనే కమర్షియల్‌ హీరోగా ఎదిగారు తారక్‌. స్టార్‌ ఇమేజ్‌ ని సొంతం చేసుకున్నాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక రకంగా `సింహాద్రి` మూవీ ఎన్టీఆర్‌ కెరీర్‌ కి బిగ్‌ టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పొచ్చు.

సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్‌కు ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.