
📌 Key Points
- సమంత ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో సంచలన వ్యాఖ్యలు.
- దర్శకుడు రాజ్ నిడిమోరుపై సమంత ప్రశంసలు, ఇతర దర్శకులపై పరోక్ష విమర్శలు.
- ‘రాజ్ ఒక్కడే అలా చేస్తాడు, ఏ డైరెక్టర్ అలా చేయడు’ అంటూ సమంత కామెంట్స్ వైరల్.
- సమంత వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ, విమర్శలు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో భాగంగా, దర్శకుల పనితీరుపై చేసిన షాకింగ్ కామెంట్స్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యల వెనుక అసలు నిజం ఏమిటి?
రాజ్ నిడిమోరుతో సమంత బంధం వెనుక రహస్యం!
Samantha : సమంత దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ దర్శకత్వంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించింది. అప్పట్నుంచే వీరి బంధం మొదలైంది. ఇప్పుడు రాజ్ ఇచ్చిన కథతో, రాజ్ – సమంత నిర్మాణంలో సమంత హీరోయిన్ గా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా మా ఇంటి బంగారం చేసింది. ఈ సినిమా జూన్ 19 న రిలీజ్ కానుంది.
సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో రాజ్, నందిని రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఇతర దర్శకులపై సమంత పరోక్ష విమర్శలు?
ఈ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. నేను ఫ్యామిలీ మ్యాన్ కి ముందు చాలా సినిమాలు చేసాను. కానీ రైటర్స్, సినిమాకు పనిచేసే వాళ్ళు అందరూ కూర్చొని ఎవరి పాయింట్ అఫ్ వ్యూ వాళ్ళు చెప్పడం, డిస్కస్ చేసుకోవడం నేను ఎక్కడా అప్పటివరకు చూడలేదు. రాజ్ దగ్గరే మొదటిసారి చూసాను. చాలా సినిమాల్లో డైరెక్టర్ ఏది చెప్తే అదే. ఎవరి మాట వినరు. అది వన్ మ్యాన్ షో అనిపిస్తుంది. కానీ రాజ్ చేసేది బెటర్ అవుతుంది, వర్క్ అవుతుంది అనిపిస్తుంది. చాలా మంది తెలివైన వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తే మంచి అవుట్ పుట్ వస్తుంది అని చెప్పింది.
“మా ఇంటి బంగారం” ప్రమోషన్స్‌లో రచ్చ!
దీంతో సమంత కామెంట్స్ వైరల్ గా మారాయి. చాలా మంది దర్శకులు తమ రైటింగ్ టీమ్ తో కూర్చొని, హీరో, కొంతమంది నటీనటులతో కూర్చొనే స్క్రిప్ట్ డిస్కస్ చేస్తారు. సుకుమార్ లాంటి స్టార్ దర్శకులు కూడా తన టీమ్ అందరితో కూర్చొనే స్క్రిప్ట్ ఫైనల్ చేస్తారు. తర్వాత హీరోలు ఏదైనా చెప్పిన దర్శకులు వింటారు. ఇలా చాలా మంది దర్శకులు ఇతరులు చెప్పేది వినడం, అందరితో డిస్కస్ చేయడం చేస్తారు. ఈ విషయాన్ని చాలా మంది స్టేజీలపైనే చెప్పారు. కానీ సమంత ఇప్పుడు తన భర్త రాజ్ ఒక్కడే అలా చేస్తాడు. ఏ డైరెక్టర్ దగ్గరా అలా చూడలేదు అనడంతో విమర్శలు వస్తున్నాయి.
సమంత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి. ఆమె మాటలపై మరిన్ని స్పందనలు, వివరణల కోసం వేచి చూడండి. సినీ ప్రపంచం నుండి తాజా అప్‌డేట్‌ల కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి!


