|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రోలర్స్ కు మెగాస్టార్ స్ట్రాంగ్ కౌంటర్! ‘నాకు కెపాసిటీ ఉంది.. నేను రెడీ!’

Published: 13-06-2026, 4:16 PM
ట్రోలర్స్ కు మెగాస్టార్ స్ట్రాంగ్ కౌంటర్! 'నాకు కెపాసిటీ ఉంది.. నేను రెడీ!'
  • మెగాస్టార్ చిరంజీవిపై వస్తున్న ట్రోల్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
  • నాకు మంచి కథలు వస్తే, అలాంటి సినిమాలు చేయడానికి సిద్ధం అని చిరంజీవి అన్నారు.
  • బాలచందర్, ఎస్పీ బాలు వంటి దిగ్గజాల వ్యాఖ్యలను గుర్తుచేసిన మెగాస్టార్.
  • దంగల్, చక్ దే లాంటి చిత్రాలు చేయాలని ఆశపడ్డ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.

మెగాస్టార్ చిరంజీవి తనపై వస్తున్న విమర్శలకు, ట్రోల్స్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ప్రయోగాత్మక చిత్రాలపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. మెగా ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండుగే! చిరు ఏమన్నారో తెలుసుకోవాలంటే చదవండి!

ట్రోలర్స్ కు మెగాస్టార్ దిమ్మతిరిగే సమాధానం!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ని దాదాపు మూడు దశాబ్దాలు నెంబర్ వన్ గా ఏలిన నటుడు. కమర్షియల్ మాస్ సినిమాలే కాదు తన నటన పర్ఫార్మెన్స్ తో ఏడిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయాలకు వెళ్లొచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి చేసే సినిమాలు చూసి ఆయన గురించి తెలియని ఈ జనరేషన్ కొంతమంది చిరుని ట్రోల్ చేసారు.

చిరంజీవి అవే కమర్షియల్ సినిమాలు చేస్తున్నారని, నటనకు స్కోప్ ఎక్కువగా ఉండట్లేదని, ఇది కాదు చిరంజీవి అని, ఒకప్పుడు చిరంజీవి వేరు ఇప్పటి చిరంజీవి వేరు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఫ్యాన్స్ కూడా కొంతమంది చిరంజీవిని ఫ్లాప్ అయినా సరే డాడీ, ఆపద్బాంధవుడు, రుద్రవీణ.. లాంటి సినిమాలు చేయాలని రిక్వెస్ట్ లు చేశారు.

“నాకు కెపాసిటీ ఉంది.. నేను రెడీ!” – చిరు సంచలనం

ఇలా తనపై వచ్చే ట్రోల్స్ కి మెగాస్టార్ నేడు సమాధానమిచ్చారు. షూటింగ్ లో బిజీగా ఉండి కాస్త ఆలస్యంగా పెద్ది సినిమా చూసిన చిరంజీవి బుచ్చిబాబుని పిలిచి సినిమా గురించి మాట్లాడి అభినందించారు.

ఇందులో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకసారి నాతో మాట్లాడుతూ.. రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి చాలా నటన పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు చేసావు. కానీ ఇప్పుడు కమర్షియల్ వైపు వెళ్ళిపోతున్నావు. నీలో ఆ పొటెన్షియల్ ఉంది అన్నారు. బాలచందర్ కమల్ – రజిని కలిపితే చిరంజీవి అనే మాటను స్టేజిపై చెప్పారు అని గుర్తుచేశారు. నేను అలాంటి కంటెంట్ సినిమాలు వస్తే ఎందుకు చేయను. నాకు ఆ కెపాసిటీ ఉంది. నాకు అలాంటి కథలు వస్తే చేస్తాను అని నమ్మకం కూడా ఉంది. నేను రెడీనే అలాంటి కథలు చేయడానికి. దంగల్, చక్ దే లాంటి సినిమాలు వచ్చినప్పుడు అవి చూసి నాకు కూడా ఇలాంటి కథలు వస్తే బాగుండు అనిపించింది, కానీ అలాంటి కథలు రావట్లేదు అని అన్నారు.

కంటెంట్ సినిమాలపై మెగాస్టార్ ఓపెన్ కామెంట్స్

మరి చిరంజీవి ఈ మాట అన్న తర్వాత ఎవరైనా దర్శకులు ఆయన దగ్గరకు ప్రయోగాత్మక సినిమాలు, ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా కథలు తీసుకెళ్తారేమో చూడాలి.

మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీశాయి. ఆయన ఆశించినట్టుగా మంచి కథలు వస్తే, అభిమానులకు మరోసారి నటనతో విస్మయం కలిగించడం ఖాయం. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.