
టాలీవుడ్ నటి నివేదా థామస్ తాజాగా గద్దర్ అవార్డు అందుకున్నారు. అయితే ఆమె బరువు పెరిగినందుకు కొంతమంది నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక నెటిజన్ చేసిన అసభ్యకర ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
Key Points
నివేదా థామస్ బరువు పెరిగినందుకు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఒక నెటిజన్ చేసిన అసభ్యకర ట్వీట్ వైరల్ అవుతోంది.
నెటిజన్లు ఆ ట్వీట్‌ను తప్పుపడుతూ తీవ్రంగా స్పందిస్తున్నారు.
నివేదా థామస్ అందంపై అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నివేదా థామస్‌పై ట్రోల్స్
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు హీరోయిన్స్ కొంత మంది బొద్దుగా, మరికొందరు స్లిమ్‌గా కనిపిస్తారు. ఇక కొన్నాళ్ల తర్వాత బొద్దుగా ఉన్న వాళ్లు అస్సలు ఊహించని విధంగా స్లిమ్ అవుతుంటే.. స్లిమ్‌గా ఉన్నవారు మాత్రం బొద్దుగా మారిపోతారు. దీంతో ఆఫర్స్ కూడా తక్కవ కావడంతో ఇండస్ట్రీకి కొంచెం కొంచెం దూరంగా అవుతారు. ఇలాంటి హీరోయిన్స్‌లో నివేదా థామస్ ఒకరు. కేరళకు చెందిన ఈ బ్యూటీ.. ‘జెంటిల్‌మేన్’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వచ్చిన ‘నిన్ను కోరి’ మూవీతో యూత్‌ను మైమరపించిన ఈ బ్యూటీ.. తర్వాత పలు సినిమాల్లో నటించి చివరగా ‘35: ఇది చిన్న కథ కాదు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. రీసెంట్‌గా ఈ మూవీలో నివేదా పాత్రకు గాను గద్దర్ అవార్డ్ వరించింది.
శనివారం రాత్రి హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం జరగా.. నివేదా థామస్ హాజరై అవార్డు అందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడంతో.. నివేదా లుక్‌పై నెట్టింట దారుణమైన ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. వైరల్ అవుతున్న వీడియోస్‌లో నివేదా బాగా బొద్దుగా కనిపించడంతో.. ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా ఆ వీడియో షేర్ చేస్తూ.. ‘ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెక్స్ లేకపోతే ఉమెన లావు అవుతారు’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రజెంట్ ఈ ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారగా.. మీ ఇంట్లో వాళ్లు లావు అయినా ఇలాగే అంటావా, అమ్మాయిలు లావు అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి, నివేదాకు థైరాయిడ్ ఉందని చాలా సందర్భాల్లో చెప్పింది ఆ మాత్రం తెలియకుండా ఎలా పడితే అలా ఒక అమ్మాయిపై కామెంట్ చేయకు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. అయితే.. మరికొందరు మాత్రం బొద్దుగా ఉన్నా నివేదా చాలా అందంగా కనిపిస్తుంది అంటూ రిప్లైలు ఇస్తు్న్నారు.
నెటిజన్ల తీవ్ర స్పందన
వివాదాస్పద ట్వీట్
నివేదా థామస్ బరువు పెరుగుదలపై నెటిజన్ల విమర్శలు, వారి స్పందనలు ఈ సంఘటనకు అద్దం పడుతున్నాయి. సోషల్ మీడియాలో అలాంటి వ్యాఖ్యలు ఎంత ప్రమాదకరమో ఇది మరోసారి చాటుతోంది.


