
రష్మిక మందన్నా ప్రేమ, బ్రేకప్‌లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మగవారికంటే మహిళలే ఎక్కువ బాధపడతారని, దానిని వ్యక్తం చేయలేరని రష్మిక స్పష్టం చేసింది. ఆమె వ్యక్తిగత ప్రేమ జీవితం, కెరీర్ వివరాలు తెలుసుకుందాం.
Key Points
నటి రష్మిక మందన్నా ప్రేమ, బ్రేకప్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
బ్రేకప్ తర్వాత మహిళలే ఎక్కువ బాధపడతారని, పురుషులకంటే వేదనకు గురవుతారని పేర్కొంది.
మగవారిలా బాధను వ్యక్తం చేయడానికి మద్యం తాగడం, గడ్డం పెంచడం చేయలేమని తెలిపింది.
రక్షిత్ శెట్టితో గతంలో బ్రేకప్, ప్రస్తుతం విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం వార్తలు.
రష్మిక మందన్నా బ్రేకప్ వ్యాఖ్యలు
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్నా ( Rashmika Mandanna ). ఇటీవలే హారర్ కామెడీ థ్రిల్లర్ థామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే ఈ మధ్యే తెలుగు హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda )తో రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీనికంటే ముందు రష్మికకు లవ్ బ్రేకప్ అనుభవం ఉన్న విషయం తెలిసిందే. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి ( Rakshit Shetty )తో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా జరుపుకుంది. పెళ్లి బంధంతో ఒక్కటవుతారనుకుంటే.. బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.
మగవారికంటే మహిళలే ఎక్కువ బాధ: రష్మిక
మగవారిలా గడ్డం పెంచలేం ఇటీవల ఓ భేటీలో రష్మిక.. ప్రేమ, బ్రేకప్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రేమ, బ్రేకప్‌లో విషయంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా బాధపడతారనే మాటను అంగీకరించనంది. బ్రేకప్ వల్ల మహిళలే ఎక్కువ బాధ, వేదనకు గురవుతున్నారని పేర్కొంది. తమ బాధను వ్యక్తం చేయడానికి మగవారిలా గడ్డం పెంచడం, మద్యం తాగడం వంటివి చేయలేమంది. మనసులోనే బాధను భరిస్తుంటామని, బయటకు వ్యక్తం చేయలేమని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా రష్మిక మందన్నా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది.
గతం, వర్తమానం: రష్మిక ప్రేమ ప్రయాణం
రష్మిక మందన్నా బ్రేకప్‌పై చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యక్తిగత జీవితంపై తరచుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


